NewsOrbit
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

TDP Issue: బాబుకి షాక్ .. టీడీపీ నో..! జనసేన బీజేపీ స్పెషల్ ప్రణాళికలు..!

TDP Issue: తెలుగుదేశం పార్టీ మొదటి నుండి జనసేన పార్టీతో పొత్తు కోరుకుంది. రెండు పార్టీలు కలిసి పోటీ చేసి వైసీపీని ఓడించాలని టీడీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. అదే విధంగా చంద్రబాబు కూడా అనుకున్నారు. అందుకే చంద్రబాబు ఒకటి రెండు సార్లు బయటపడ్డారు. వన్ సైడ్ లవ్ అయితే కుదరదు, అటు వైపు నుండి కూడా ఉండాలి కదా అంటూ కామెంట్స్ చేశారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ నోటి వెంట జనసేన అభిప్రాయం బయటపడింది. పొత్తుకు రెడీ, వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని పవన్ కళ్యాణ్ చెప్పేశారు. జనసేన కూడా పొత్తు పెట్టుకోవడానికి రెడీ అయ్యింది. కానీ ఇప్పుడు జనసేనతో పొత్తు అంటే ఒకరిద్దరు నాయకులు తప్పించి తెలుగుదేశం పార్టీ భయపడుతోంది. వెనుకడుగు వేస్తోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.

TDP Issue: janasena bjp special strategy
TDP Issue: janasena bjp special strategy

Read More: AP Politics: టీడీపీకి డేంజర్ సిగ్నల్..! ఏపిలో బీహార్ తరహా ప్లాన్ అమలు..!

TDP Issue: భిన్నంగా పార్టీల వాదనలు

అందులో సీట్ల షేరింగ్ విషయంలో టీడీపీ అంచనాలు ఒకలా ఉంటే, జనసేన అనుకుంటుంది మరోలా ఉంది. పవర్ షేరింగ్ విషయంలో టీడీపీ ఒకలా ఆలోచిస్తూ జనసేన మరోలా ఆలోచిస్తోంది. టీడీపీ జనసేనను ఒక రకంగా డీల్ చేయాలి అనుకుంటుంటే జనసేన టీడీపీని మరో విధంగా డీల్ చేయాలని అనుకుంటోంది. ఈ రెండు పార్టీల మధ్య ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి. జనసేన పార్టీ ఏమి ఆలోచిస్తుంది అంటే..2014లో మీరు అధికారంలోకి రావడానికి కారణం మేమే. మేము ఓట్లు చీల్చలేదు కాబట్టే మీరు అధికారంలోకి వచ్చారు. 2019లో మేము విడిగా పోటీ చేయడం వల్లనే మీరు అధికారానికి దూరం అయ్యారు. 25 నుండి 30 సీట్లలో మేమే కీలకం. టీడీపి అధికారంలోకి రావాలంటే తామే కీలకం అని జనసేన క్యాడర్ అంటోంది. అసలు జనసేన పార్టీ గెలవాలంటేనే టీడీపీి క్యాడర్ పని చేయడం కీలకం. పవన్ కల్యాణ్ సైతం ఓడిపోయారు అంటే ఆయన పోటీ చేసిన నియోజకవర్గాల్లో టీడీపీకి ఎక్కువ ఓట్లు రావడమే అని పేర్కొంటున్నారు. రాజకీయాల్లో టీడీపీ 40 సంవత్సరాల నుండి ఉంది. బలమైన క్యాడర్ తో సంస్థాగతంగా 35 శాతం ఓట్ బ్యాంక్ ఉంది. అంత ఓట్ బ్యాంకు ఉన్న ఈ చిన్న పార్టీ సాసించడం ఏమిటా అని టీడీపీ మనోగతంగా ఉంది. ఈ రెండు విషయాల్లో ఏ పార్టీకి ఆ పార్టీ వాదనలు భిన్నంగా ఉన్నాయి.

TDP Issue: టీఆర్ఎస్ కు మారిదిగా ఎక్కువ సీట్లు ఇస్తే..

ముఖ్యంగా జనసేన ఏమి కోరుకుంటుంది అంటే..2014లో పోటీ చేయలేదు. 2019లో పోటీ చేసి ఓడిపోయాం, 2014 ఎన్నికల్లో కింగ్ మేకర్ గా నిలవాలి. 20 నుండి 25 సీట్లు అయినా గెలుచుకుని పవర్ లోకి వెళ్లాలని ఆలోచన చేస్తోంది. ప్రతిపక్షంగా ఉండకూడదు అని జనసేన అభిప్రాయం. తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ఏమిటంటే జనసేనతో పొత్తు ఉంటే 25 నుండి 30 సీట్లు ఇవ్వడానికి, అలానే మూడు లేదా నాలుగు పార్లమెంట్ సీట్లు ఇవ్వడానికి రెడీ అయ్యింది. టీడీపీ గతంలో 2009లో ఒక అనుభవం ఎదురైంది. మహాకూటమి పేరుతో ఏర్పాటు అయిన నేపథ్యంలో టీఆర్ఎస్ కు వాళ్ల బలానికి మించి 40కిపైగా సీట్లు ఇస్తే ఆ పార్టీ పది సీట్లలోనే గెలిచింది. టీడీపీినే తెలంగాణలో ఎక్కువ స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు కూడా జనసేనకు ఎక్కువ సీట్లు ఇస్తే వాళ్లు తక్కువ స్థానాల్లో గెలిస్తే ఆ డ్యామేజీ తెలుగుదేశం పార్టీకి కఛ్చితంగా ఉంటుంది. అయితే ఇప్పుడు జనసేన గాలిలో తేలుతోంది. మేము బలపడిపోయాం, మేము 40 సీట్లు, 50 సీట్లలో గెలిచేస్తాం అన్నట్లు ఊహించుకుంటోంది. జనసేన వాస్తవ బలం ఏమిటి అనేది ఎవరికీ పూర్తిగా తెలియదు. గత ఎన్నికల్లో జనసేనకు 6 శాతం ఓటింగ్ వచ్చింది. ఇప్పుడు పెరిగితే 10 లేదా 15 శాతంకు పెరిగి ఉంటుంది. దీన్ని బట్టి ఒక్కో నియోజకవర్గంలో 20 నుండి 25 వేల ఓట్లు వస్తాయి. అన్ని నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉండదు. రాష్ట్రం మొత్తం మీద 30 నుండి 35 నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉంటుంది. ఆ కేపాసిటీయే ఉన్న జనసేన ఇప్పుడు పవర్ షేరింగ్ అడుగుతోంది.

AP Politics TDP Alliance fear

TDP Issue: తొలి రెండేళ్లు సీఎం కుర్చీ..?

రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే పవన్ కళ్యాణ్ సీఎం సీటులో కూర్చోవాలి, తొలి రెండు సంవత్సరాలు అధికారం ఇవ్వాలి అనేది జనసేన వైపు నుండి వస్తున్న డిమాండ్. దీనితో పాటు మన ఇద్దరిమే కాదు బీజేపీని కూడా కలుపుకుందాం, మన ఇద్దరి మధ్యలో బీజేపీ ఉంటుంది అని ప్రతిపాదిస్తోంది. బీజేపీ కేంద్రంలో ఎలానూ అధికారంలో ఉంటుంది కాబట్టి వాళ్లే మనల్ని మారుస్తారు, ఫస్ట్ రెండు సంవత్సరాలు మేము, తరువాత మూడు సంవత్సరాలు మీరు అన్న ప్రతిపాదనను తెరపైకి తీసుకువస్తుంది జనసేన. కానీ తెలుగుదేశం పార్టీకి ఇది ఏ మాత్రం ఇష్టం లేదు. సీఎం కుర్చీ ఇవ్వము, కావాలంటే మూడు నాలుగు మంత్రి పదవులు, ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తామని టీడీపీ చెబుతోంది. సీఎం సీటు అడిగినా, 40కిపైగా స్థానాలు అడిగినా అసలు జనసేనతో పొత్తే వద్దు అని అంతర్గతంగా చంద్రబాబుతో సీనియర్ నేతలు సూచిస్తున్నారుట. ఈ కారణంగా ఇప్పుడు టీడీపీ, జనసేనలో కొత్తరకమైన గందరగోళం తయారైంది. పొత్తు ఉంటుందో లేదో గానీ ఈ ఊహాగానాలు చర్చలు, సోషల్ మీడియావార్ లు ఎక్కువైపోయాయి.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N