NewsOrbit
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Politics: టీడీపీకి డేంజర్ సిగ్నల్..! ఏపిలో బీహార్ తరహా ప్లాన్ అమలు..!

AP Politics: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జనసేన – టీడీపీ పొత్తు అంశం హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా జనసేన పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పవన్ కళ్యాణ్ చేసిన కీలక వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఈ అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. జనసేన – టీడీపీ మధ్య పొత్తు ఉంటుంది అని అటు ప్రింట్ మీడియాలో, ఇటు డిజిటల్, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే పొత్తుకు సంబంధించి రకరకాల అంశాలు, భిన్నమైన కోణాలను “న్యూస్ ఆర్బిట్” అందిస్తూనే ఉంది. బీజేపీకి ఉన్న బలమైన స్ట్రాటజీ ద్వారా తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని ఏమైనా ప్రయత్నిస్తున్నదా.. ? బీజేపి ఎలక్షన్ స్ట్రాటజీలు ఎలా ఉంటాయి..? ఈ పొత్తు టీడీపీ మంచికా..? చెడుకా..? అనే విషయాలను ఒక సారి పరిశీలన చేస్తే..

AP Politics bjp Bihar type politics
AP Politics bjp Bihar type politics

Read More: AP Politics: ఫుల్ ప్లానింగ్ తో పవన్ కళ్యాణ్ ..! బీజేపీ – టీడీపీ మధ్యలో..కానీ..!?

AP Politics: బీహార్ లో గ్రాఫ్ పెంచుకున్న బీజేపీ

మొత్తానికి ఈ పొత్తు అంశం తెలుగుదేశం పార్టీకి ప్రాణసంకట పరిస్థితి (డేంజర్ సిగ్నల్స్) అని చెప్పవచ్చు. బీజేపీ రాజకీయ వ్యూహాలు ఎలా అమలు చేస్తుంది అనేందుకు బీహార్ ఎన్నికలను ఒక ఉదాహారణగా తీసుకోవచ్చు. 2015 లో బీహార్ లో జరిగిన ఎన్నికల్లో తేజశ్వినీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ (లాలూ ప్రసాద్ పార్టీ)కి 80, బీజేపీ 53, నితీష్ కుమార్ పార్టీకి 71 సీట్లు వచ్చాయి. అప్పుడు బీజేపీ – నితీష్ కుమార్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మధ్యలో బీజేపీ ద్వారా అధికార మార్పిడి జరిగింది. 2020 ఎన్నికలు వచ్చే సరికి నితీష్ కుమార్ 71 నుండి 43 స్థానాలకు పడిపోయారు. బీజేపీ 53 నుండి 74 స్థానాలకు పెరిగింది. ఆర్జేడీ 80 నుండి 75కి పడిపోయింది. నిజానికి బీహార్ లో బీజేపికి అంత బలం లేదు. నితీష్ కుమార్ తో పొత్తు పెట్టుకోవడం వల్లనే ఎదిగింది. బీహార్ లో బీజేపీకి అంత సత్తా లేదు.

AP Politics TDP Alliance fear

Read More: TDP Janasena: ఆ పొత్తులపై టీడీపీలో భయం భయం..! జనసేనతో పేచీలు టీడీపీ టెన్షన్..!?

ఎంఐఎంతో ఆర్జేడీ, నితీష్ కు దెబ్బ

కానీ కొన్ని స్ట్రాటజీలు, కొన్ని పొత్తులు, కొన్ని తెరవెనుక ఎత్తుల ద్వారా నితీష్ కుమార్ తో పొత్తు ఉన్నప్పటికీ ఆ పార్టీని ఓడించింది. ఇటు ఆర్జేడీ గెలవాల్సిన చూట దాన్ని ఓడించింది. బీజేపీ గెలుపు అవకాశాలు లేని చోట బీజేపీ గెలిచింది. ఎంఐఎం పార్టీని చాలా జాగ్రత్త గా బీహార్ లో ప్రయోగించి బీజేపీ సక్సెస్ అయ్యింది. ఎంఐఎం బీహార్ లో పోటీ చేయడం ద్వారా ఎంఐఎం అయిదు స్థానాలు గెలుచుకుంటే, 15 నుండి 20 స్థానాల్లో అటు ఆర్జేడీకి, నితీష్ కుమార్ పార్టీకి దెబ్బ పడింది. ఇది బీజేపీ ఎత్తుగడ అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటుంటారు. దీనికి ఆంధ్రప్రదేశ్ కి సంబంధం ఏమిటి అంటే..

టీడీపీకి మ్యాజిక్ ఫిగర్ వస్తే ..

బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకున్నాయి అనుకుంటే ఈ మూడు పార్టీల్లో బలాబలాలు చూసుకుంటే జనసేన, బీజేపీ కంటే టీడీపీ బలమే ఎక్కువ. ఈ విషయం అందరికీ తెలుసు. 100లో 75 శాతం బలం టీడీపీకి ఉంటుంది. 20 శాతం జనసేనది అయితే 5 శాతం బలం బీజేపీది. ఈ రేషియో ప్రకారం టీడీపీ 140, బీజేపీ 7 లేదా 8, జనసేన 25 నుండి 30 స్థానాల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. ఆయా పార్టీలకు ఉన్న సంస్థాగత రేషియోను బట్టి అలా పోటీ చేస్తారు. కానీ అదే రేషియో ప్రకారం వీళ్లు వెలితే రేపు టీడీపీకి మ్యాజిక్ ఫిగర్ వచ్చేస్తే జనసేన, బీజేపీ మాట వినకపోవచ్చు. టీడీపీకి మ్యాజిక్ ఫిగర్ రాకుండా చేయాలి. టీడీపీని కొన్ని చూట్ల ఓడించాలి. అదే సమయంలో టీడీపీ పొత్తు ఉన్న చోట్ల కూడా జనసేన అభ్యర్ధులను నిలపడమో లేక వేరే వాళ్లను పెట్టి ప్రోత్సహించాలి. ఏదైనా కానీ టీడీపీకి మ్యాజిక్ ఫిగర్ రాకూడదు. వస్తే వీళ్ల మాట వినకపోవచ్చు. అవసరమైతే టీడీపీ కంటే వేరే పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలి. ఇలా కొన్ని రకాల ఎత్తుగడలు ఉంటాయి. ఎందుకంటే కాబోయే ముఖ్యమంత్రి బీజేపీ, జనసేన మాట వినాలి అనేది బీజేపీ ప్లాన్.

 

AP Politics: మాట వినే సీఎంయే బీజేపీకి కావాలి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఇన్ని రకాల వ్యూహాలు తెలియవు. ఆయనకు ఒకటే టార్గెట్. వైసీపీ అధికారంలోకి రాకూడదు. వీళ్ల కూటమి అధికారంలోకి రావాలి అనేది పవన్ లక్ష్యం. కానీ బీజేపీకి ఈ సింపుల్ ప్లాన్ ఉండదు. మా మాట వినేవాడు ముఖ్యమంత్రిగా ఉండాలి. మాకు మద్దతు ఇచ్చేవాడు ముఖ్యమంత్రిగా ఉండాలి. మేము ఏమిచేసినా, ఏమి చెప్పినా గుడ్డిగా తల ఊపేవాడు ముఖ్యమంత్రిగా ఉండాలన్న ఆలోచనలో బీజేపి ఉంటుంది. టీడీపీకి మ్యాజిక్ ఫిగర్ వచ్చి చంద్రబాబు సీఎం అయితే తమ మాట వింటారో లేదో అన్న అనుమానం బీజేపీకి ఉంటుంది. అందుకే ఆయనతో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఆయన బలం తగ్గించాలి. ఇటువంటి ప్లాన్ లు బీజేపీ వద్ద చాలా ఉంటాయి. వైసీపీకి వ్యతిరేకంగా జనసేన, బీజేపీ, టీడీపీతో ఓ పెద్ద కూటమి కట్టాలన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. బీజేపీయేమో జనసేన ద్వారా రాష్ట్రంలో అధికారంలోకి రావాలి. జనసేన ద్వారా టీడీపీకి తమ గుప్పిట్లో పెట్టుకోవాలన్న ఆలోచనలో బీజేపి ఉంది. ఆయా పార్టీల అవసరాలు, తెరవెనుక ఎత్తులు, పై ఎత్తులు ఇలా చాలా ఉంటాయి.

Related posts

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N