NewsOrbit
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP Janasena: జగన్ వ్యూహాలకు బాబు భయపడ్డారా..!?

TDP Janasena: ఏపి రాజకీయాల్లో ప్రస్తుతం ఈ అంశం చాలా హాట్ టాపిక్ గా ఉంది. కుప్పం పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ – జనసేన పొత్తుకు సంబంధించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. లవ్ ఎప్పుడూ రెండు వైపులా ఉండాలి. వన్ సైడ్ లవ్ అయితే ఉపయోగం ఉండదు అన్నట్లు ఇరు వైపుల నుండి ఆసక్తి ఉంటే పొత్తు పెట్టుకోవాలి అన్నట్లు చెప్పారు చంద్రబాబు. దీంతో చాలా మందికి ఒక కన్ఫూషన్ నెలకొంది. టీడీపీ – జనసేన పొత్తు ఉంటుందా.. ఉండదా అనే దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. పొత్తు ఉంటుంది అనుకుంటున్న వాళ్లు అయ్యో పొత్తు ఉండదా అని బాధపడుతుండగా, పొత్తు ఉండదు అనుకునే వాళ్లు ఇది విని కాస్త రిలాక్స్ అయ్యారు.

TDP Janasena election strategy
TDP Janasena election strategy

టీడీపీ – జనసేన పొత్తు ఉంటుందా ఉండదా అనేది ఆ పార్టీల నిర్ణయం బట్టి ఉంటి. ఆ విషయాన్ని పక్కన బెడితే.. ఒక పార్టీ తన రాజకీయ వ్యూహాన్ని ముందుగానే ప్రత్యర్ధికి తెలిసినట్లుగా చేయకూడదు. కానీ ఈ రెండు పార్టీల పొత్తు వ్యూహం ముందుగానే వైసీపీకి తెలిసిపోయింది. అలా తెలిసింది కాబట్టే వైసీపీ విరుగుడు వ్యూహం రచించింది. ఈ రెండు పార్టీలు కలిస్తే కాపు సామాజికవర్గ ఓట్లు కూటమికి చేరతాయి. అలా వెళ్లకుండా చేయడానికి ముందుగా వ్యూహాలను రచించింది వైసీపీ. అందులో మొదటిది వంగవీటి రాధాను పార్టీలోకి తీసుకోవాలి. 2.ముద్రగడతో పార్టీ పెట్టించాలి. 3.గంటా శ్రీనివాసరావు, జెడి లక్ష్మీనారాయణ తదితరులతో ఈ కూటమికి వ్యతిరేకంగా మాట్లాడించాలి. జనసేన – టీడీపీ పొత్తు పెట్టుకుందని ముందుగానే గ్రహించిన వైసీపీ ఈ విరుగుడు వ్యూహాలను రచించింది. సో.. ప్రత్యర్ధి పార్టీకి ఆ అవకాశం ఇవ్వకూడదు అంటే.. పొత్తు ఉంటుందా.. ఉండదా అనేది చివరి వరకూ క్లారిటీ ఇవ్వకూడదు. కార్యకర్త అడిగిన వెంటనే పొత్తు ఉంటుంది అని చెప్పగలరా.. అలా చెప్పకూడదు. ఇప్పుడు ఎన్నికలు లేవు. ఎన్నికలు రావడానికి ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. ఇప్పుడు పొత్తుల విషయం ఫైనల్ చేస్తే వీళ్లకు అదనపు బలం రాదు. అందుకే ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు వరకూ అధికారికంగా పొత్తు విషయాలపై బహిరంగంగా చెప్పరు. ఇప్పుడే పొత్తు విషయాలను ఖరారు చేస్తే ప్రత్యర్ధి పార్టీ వాళ్లను దెబ్బతీయడానికి వ్యూహాలను రచిస్తుంది.

రాజకీయ నాయకులు ఏమి చేస్తున్నారు అనేది ముందు రోజు వరకూ చెప్పరు. అలానే పొత్తు విషయాలను ముందుగానే బహిర్గతం చేయరు. ఉదహారణకు తీసుకుంటే పార్టీలు మారే ఎమ్మెల్యేలు.. ముందు రోజు వరకూ నేను పార్టీ మారను అని చెబుతూనే ఉంటారు. జగన్మోహనరెడ్డి నాకు దేవుడు, నాకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చారు అని చెబుతారు. అదే విధంగా చంద్రబాబే మా నాయకుడు, నేను పార్టీ మారను అని చెబుతారు. అన్ని మాటలు చెప్పిన వాళ్లు మరుసటి రోజే పార్టీ మారిపోతుంటారు. రాజకీయాలు అంటే అలానే చేస్తుంటారు. జనసేన – టీడీపీ పొత్తుల గురించి ఆ రెండు పార్టీలు ఇప్పుడు మాట్లాడకుండా ఉండటమే మంచింది. అది రాజకీయంగా ఒక స్ట్రాటజీ.

TDP Internal News: TDP Big Hand to BC .. for Kamma

 

author avatar
Srinivas Manem

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju