Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ “దేవర” సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తారీఖు విడుదల కాబోతోంది. రెండు భాగాలుగా ఈ సినిమాని చిత్రీకరిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి 80% షూటింగ్ కంప్లీట్ అయింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ లో అనిరుద్ “దేవర” టీజర్ అద్భుతంగా వచ్చిందని పోస్ట్ చేశారు. టీజర్ గుస్ బంప్స్ అంతే. ఆసక్తిగా ఎదురు చూస్తున్నా” అంటూ ట్విట్ చేశారు. దీంతో న్యూ ఇయర్ కానుకగా “దేవర” టీజర్ విడుదల కాబోతున్నట్లు అభిమానులు భావిస్తున్నారు. “RRR” తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
నిర్మాతలలో ఒకరైన నందమూరి కళ్యాణ్ రామ్ ఇదే విషయాన్ని ఇటీవల తెలియజేశారు. తన కొత్త సినిమా “డెవిల్” సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ “RRR” లాంటి పెద్ద హిట్ తర్వాత దాదాపు యాడాది టైం తీసుకుని ఎన్టీఆర్ ఈ సినిమా చేస్తున్నారు. కాబట్టి “దేవర” సినిమా నిర్మాణం విషయంలో ఎక్కడా కూడా రాజీ పడటం లేదు. సినిమాకి ఎక్కడ కూడా నెగిటివ్ రాకుండా… ఆచితూచి సినిమా చేస్తున్నం. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ప్రతి విషయంలో జాగ్రత్త పడుతున్నాం. కొరటాల శివ మరియు తారక్ నాకు ఈ విషయంలో చాలా ఒత్తిడి ఉంది.
దీంతో ఎక్కడ కూడా అశ్రద్ధ చేయకుండా.. “దేవర” సినిమా షూటింగ్ జరుగుతుందని కళ్యాణ్ రామ్ వ్యాఖ్యానించారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ డబల్ రోల్ చేసినట్లు టాక్. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర చేస్తూ ఉన్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో సినిమా విడుదలకు వంద రోజులు మాత్రమే ఉండటంతో జనవరిలో న్యూ ఇయర్ కానుకగా “దేవర” టీజర్ కాబోతున్నట్లు.. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ చేసిన కామెంట్ బట్టి తెలుస్తుంది. ఇప్పటివరకు హీరో ఎన్టీఆర్ హీరోయిన్ జాహ్నవి కపూర్… విలన్ సైఫ్ అలీఖాన్ పాత్రలకి సంబంధించి పోస్టర్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో న్యూయార్ కి రాబోయే టీజర్ ఎలా ఉంటుందో చూడాలి.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!