Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ “సలార్” సినిమా సూపర్ డూపర్ హిట్ కావటం తెలిసిందే. 2018లో “బాహుబలి” రెండో భాగం తర్వాత ప్రభాస్ సరైన విజయం లేక ఐదు సంవత్సరాల పాటు కెరియర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో మార్కెట్ విస్తరించిన గాని సరైన హిట్ అందుకోలేకపోయారు. “బాహుబలి 2” తర్వాత ప్రభాస్ మూడు సినిమాలు చేయడం జరిగింది. ఈ క్రమంలో ప్రతి సినిమాకి దాదాపు ఏడాదిన్నరకు పైగానే సమయం కేటాయించాల్సి వచ్చింది. సాహో, రాధేశ్యం, ఆదిపురుష్… ఈ మూడు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. మధ్యలో కరోనా ఎఫెక్ట్ తో రకరకాలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవటం జరిగింది.
ఇటువంటి పరిస్థితులలో హిట్టు అందుకుని ఐదు సంవత్సరాలు దాటడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో తల్లడిల్లిపోయారు. ఇలాంటి సమయంలో “KGF” దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ ప్రకటించి రెండు భాగాలుగా వస్తుందని తెలియజేసి అందరికీ షాక్ ఇవ్వటం జరిగింది. ఈ క్రమంలో మొదటి భాగం ఇటీవల డిసెంబర్ 22వ తారీకు విడుదల చేసి.. చాలా సైలెంట్ గా వచ్చి వైలెంట్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాకి ప్రమోషన్ కార్యక్రమాలు పెద్దగా జరగలేదు. అయినా గాని ప్రభాస్ సినిమా హిట్ అయితే ఎలా ఉంటుందో ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద రికార్డులు తెలియజేస్తున్నాయి. “సలార్” మూడు రోజులకే 400 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. ఐదు భాషలలో పాన్ ఇండియా నేపథ్యంలో విడుదలైన ఈ సినిమా… బాక్సాఫీస్ వద్ద అరాచకం సృష్టిస్తూ ఉంది.
2023 ఏడాదిలో ఓపెనింగ్స్ లో.. విడుదలైన అన్ని సినిమాల్లో కంటే “సలార్” అత్యధిక వసూలు రాబట్టి రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో నైజాం మార్కెట్ అతి కీలకమని అందరికీ తెలుసు. ఈ నైజాం మార్కెట్లో కూడా “సలార్” అనేక రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంది. నైజాం ఏరియాలో 50 కోట్ల షేర్ మార్కును అందుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో నైజాంలో 50 కోట్ల మార్క్ అందుకున్న మూడో సినిమాగా సలార్ నిలిచింది. ఇప్పటివరకు నైజాంలో “RRR” 100 కోట్లకు పైగా “బాహుబలి 2” 60 కోట్లకు పైగా వసూలు రాబట్టగా మూడో సినిమాగా “సలార్” 50 కోట్లు వసూలు రాబట్టే రికార్డులకేక్కింది. దీంతో నాలుగు రోజులలోనే నాన్ బాహుబలి రికార్డులను నైజాంలో “సలార్” బ్రేక్ చేయడం విశేషం.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!