Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ “సలార్” తో హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. చాలాకాలం తర్వాత ప్రభాస్ హిట్ అందుకోవడంతో ఇండస్ట్రీకి చెందిన చాలామంది స్టార్ హీరోలు స్పందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నిఖిల్ ఇంకా చాలామంది ప్రముఖులు ప్రభాస్ విజయం సాధించటం పట్ల అభినందనలు తెలియజేయడం జరిగింది. 2018లో ప్రభాస్ నటించిన “బాహుబలి 2” భారతదేశంలోనే అత్యధిక రికార్డులు క్రియేట్ చేసిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా భారతీయ చలన చిత్ర రంగం యొక్క స్థాయి మరింతగా పెరిగింది. బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు అన్ని ఇండస్ట్రీలలో “బాహుబలి 2” అన్ని రికార్డులను ఆ సమయంలో బ్రేక్ చేయడం జరిగింది.
దీంతో ఒక్కసారిగా ప్రభాస్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. పాన్ ఇండియా సూపర్ స్టార్ అనే ట్యాగ్ లైన్ కూడా రావటం జరిగింది. అయితే వచ్చిన క్రేజ్ కి తగ్గ సినిమాలు మాత్రం పడలేదు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటించిన మూడు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. మొత్తం ఐదు సంవత్సరాలు టైం వేస్ట్ అయ్యింది. కెరియర్ ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో “KGF” డైరెక్టర్ ప్రశాంత్ నీల్ “సలార్” సినిమా ప్రకటించడం సంచలనం సృష్టించింది. ఖచ్చితంగా వీరిద్దరి కాంబినేషన్ లో హిట్టు పడుతుందని అభిమానులు బలంగా నమ్మారు. అభిమానులు నమ్మిన విధంగానే ప్రశాంత్ నీల్ “సలార్” తో న్యాయం చేయడం జరిగింది. సినిమాలో ప్రభాస్ ని చాలా అద్భుతంగా చూపించారు. ప్రభాస్ కటౌట్ కి తగ్గ యాక్షన్ సన్నివేశాలు… ఎలివేషన్స్ సినిమాలో అద్భుతంగా చూపించడం జరిగింది. దీంతో “సలార్” బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.
కాగా “సలార్” మొదటి భాగం విడుదల కాకముందే… రెండో భాగం కూడా ఉందని ప్రకటించడం తెలిసిందే. ఈ క్రమంలో మొదటి భాగం.. కొనసాగింపుగా రెండో భాగం ఉన్నట్లు క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇవ్వటం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ “సలార్” సక్సెస్ సాధించడం పట్ల హాలీవుడ్ మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో సినిమాకి సంబంధించి అనేక విశేషాలు తెలియజేశారు. “సలార్” సబ్జెక్టు వెన్న వెంటనే చాలా కొత్తగా ఉందని అందుకే ఒప్పుకున్నట్లు తెలిపారు. “బాహుబలి 2” తర్వాత అన్నీ సినిమాలలో కొత్తదనం ఉండేలా చూసుకున్నాను. ప్రపంచం మొత్తం భారతీయ చలనచిత్ర రంగం గురించి మాట్లాడుకుంటుంది. ఇక “సలార్” మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగం మరింత అద్భుతంగా ఉంటుందని ప్రభాస్ ఇంటర్వ్యూలో స్పష్టం చేయడం జరిగింది. దీంతో “సలార్ 2” పై మరింతగా అభిమానులు అంచనాలు పెంచేసుకుంటున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!