ఇండస్ట్రీలోకి వచ్చి చాలా ఏళ్లు అయినప్పటికీ సమంత మాత్రం ఇంకా టాలీవుడ్లో టాప్ హీరోయిన్‌గానే సత్తా చాటుతోంది. వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నా.. కెరీర్ పరంగా మాత్రం ఈ బ్యూటీ ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతోంది. ముఖ్యంగా చైతుతో విడిపోయిన తర్వాత సామ్ కెరీర్ పైనే ఫోకస్ పెట్టి.. భాషలతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్స్‌ను లైన్ లో పెడుతోంది.
ఇప్పటికే ఈ అమ్మడు `శాకుంతలం`, `యశోద` వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ను కంప్లీట్ చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు జోడీగా `ఖుషి` మూవీలో నటిస్తోంది. బాలీవుడ్ లో పలు చిత్రాలతో పాటు ఓ వెబ్ సిరీస్ కు సైన్ చేసింది. అలాగే సామ్ త్వరలోనే హాలీవుడ్ లో కూడా అడుగు పెట్టబోతోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా సమయంతో ఓ సంచలన నిర్ణయం తీసుకుందట. అదేంటంటే.. ఇకపై ఆమె సినిమాల్లో అందాల ప్రదర్శనకు దూరంగా ఉండాలని అనుకుంటుందట. రొమాంటిక్ క్యారెక్టర్స్ చేయకూడదని, కేవలం యాక్షన్ రోల్స్ ను మాత్రమే ఎంచుకుంటూ కెరీర్లో ముందుకు సాగించాలని డిసైడ్ అయినట్లు తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది.
కథ బలంగా డిమాండ్ చేస్తే రొమాంటిక్ యాంగిల్ చూపించవచ్చు కానీ.. ప్రతి సినిమాలో గ్లామర్ షో చేయాలంటే మాత్రం కుదరదు అని నిర్మాతలకు ఖరాకండిగా చెప్పేస్తుందని టాక్ నడుస్తోంది. మరి ఇదే నిజమైతే సామ్ నిర్ణయం ఖచ్చితంగా ఆమె కెరీర్ కు ప్లాస్ అవుతుందని నెటిజన్లు, అభిమానులు భావిస్తున్నారు.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!