Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. గత ఏడాది వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు చేయడం జరిగింది. ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు చేయకముందు 2022లో బాలకృష్ణ ఎలాంటి సినిమా చేయలేదు. ఆ ఏడాదిలో ఆహా ఓటీటీలో “అన్ స్టాపబుల్” టాకీ షో చేయడం జరిగింది. ఈ షో దేశంలోనే ఓటీటీలలో అన్నిటికంటే నెంబర్ వన్ టాకీ షోగా నిలిచింది. ఆ ఏడాది “అన్ స్టాపబుల్” టాకీ షో చాలామందిని ఆకట్టుకోవడం జరిగింది. ఈ షోకి గాను బాలకృష్ణకి భారీ ఎత్తున అల్లు అరవింద్ రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి.
మొదటి సీజన్ అద్భుతంగా ఉండటంతో తర్వాత రెండవ సీజన్ కూడా ప్లాన్ చేసి.. సినిమా సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులను ఆహ్వానించడం జరిగింది. రెండవ సీజన్ కూడా అద్భుతమైన వ్యూయర్ షిప్ అందుకోవడం జరిగింది. “అన్ స్టాపబుల్” టాకీ షో బాలయ్యలో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఈ షో ద్వారా అల్లు అరవింద్ ఫ్యామిలీకి మరింతగా బాలయ్య బాగా కనెక్ట్ కావడం జరిగింది. దీంతో అల్లు శిరీష్ సినిమా ప్రమోషన్ కార్యక్రమానికి కూడా బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఇప్పుడు అల్లు అరవింద్ కి బాలకృష్ణ ఊహించని ఛాన్స్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళ్తే బాలకృష్ణ లక్కీ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో “అఖండ 2” రాబోతున్న సంగతి తెలిసిందే.
2021లో “అఖండ” సినిమా విడుదలయ్యి తెలుగు చలనచిత్ర పరిశ్రమంలోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. తమన్ అందించిన మ్యూజిక్ చాలామందిని ఆకట్టుకుంది. “అఖండ” బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ థియేటర్లు దద్దరిల్లాయి. కాగా ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా “అఖండ” రెండో భాగంకి సంబంధించి నిర్మాణ బాధ్యతలను అల్లు అరవింద్ కి వచ్చేలా బాలకృష్ణ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా నిర్మించడానికి ద్వారకా క్రియేషన్స్ ఇంకా 14 రీల్స్ బ్యానర్ వారు పోటీ పడగా అల్లు అరవింద్ కి బాలకృష్ణ అవకాశం ఇచ్చినట్లు ఫిలిం నగర్ టాక్.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!