Rathika Rose: బిగ్బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కంటెస్టెంట్లు మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఈ షో మొదట్లో అంతగా పేరు ప్రఖ్యాతలు దక్కించుకోకపోయినప్పటికీ ప్రస్తుత కాలంలో ఈ షో ఓ రేంజ్ గుర్తింపును పొందుతుంది. ప్రస్తుతం బిగ్బాస్ అంటే చాలు తెలుగు ప్రేక్షకులు ఇట్టే అట్రాక్ట్ అయిపోతున్నారు. ఇక ఈ సీజన్స్ లో పాల్గొనే కంటెస్టెంట్లని కూడా తమ ఇంట్లో వారిలాగా ట్రీట్ చేస్తున్నారు. ప్రతిరోజు మర్చిపోకుండా తమ అమూల్యమైన ఓట్లను తమకి నచ్చిన కంటెస్టెంట్ కి వేస్తూ సంతృప్తి చెందుతున్నారు. ఇక ఇటీవల ముగిసిన బిగ్బాస్ సీజన్ సెవెన్ ఎంతటి టిఆర్పి రేటింగ్ దక్కించుకుందో మనందరికీ తెలిసిందే. మునుపు ఆరు సీజన్స్ కి దక్కని విధంగా ఈ సీజన్ కి మంచి గుర్తింపు దక్కింది.
ఇక ఈ ఉల్టా పుల్టా సీజన్లో పాల్గొన్న వారికి కూడా మంచి పాపులారిటీ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. వారిలో రతిక రోజ్ కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బిగ్బాస్ ఉల్టా పుల్టా లో అడుగుపెట్టి తన అంద చందాలతో ప్రతి ఒక్కరిని మైమరిపించింది ఈ ముద్దుగుమ్మ. బిగ్బాస్ సెవెన్ లో తన టాస్కులతో పాటు అందచందాలతో అదరగొట్టింది. ఇక ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి పదవ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. నాలుగో వారంలో రతికాయ ఎలిమినేట్ అయ్యి మళ్లీ వైల్డ్ కార్డ్ అంటూ రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక మొదటిగా ఈమె బిగ్బాస్ కార్యక్రమంలో పాల్గొని రైతు బిడ్డతో ఎఫైర్ నడిపింది.
అనంతరం యావర్ తో ఎఫైర్ నడిపి మొత్తానికి రాధికగా పేరు సంపాదించుకుంది. ఈమె కన్నింగ్ గేమ్ చూసి ప్రతి ఒక్కరూ విరుచుకుపడ్డారు. ఇక మరోవైపు రతిక కొన్నేళ్ల క్రితం బిగ్బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వీరి బంధానికి గుడ్ బాయ్ చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా రతిక నే బిగ్ బాస్ హౌస్ లో బయట పెట్టింది. దీంతో టర్నింగ్ గేమ్ ఆడుతుందని రాహుల్ పలు పోస్టుల ద్వారా మండిపడ్డాడు కూడా. ఇక బిగ్ బాస్ 7 కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్స్ కి ఎంత మీరా పాపులారిటీ వచ్చిందో చెప్పలేము కానీ రతికకి మాత్రం బాగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ పాపులర్టోనే బాలయ్య హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాలో కూడా ఒక హీరోని ప్లే చేసింది రతిక.
ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన ” పిజ్జా ” ఫ్రాంచైజీ లో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పుడు పిజ్జా 4 పేరుతో నాలుగో చిత్రాన్ని చిత్రీకరిస్తున్నారు. ఇక ఇందులో సీనియర్ నటుడు నాజర్ తనయుడు అభి హాసన్ హీరోగా నటిస్తుండగా హీరోయిన్గా తెలుగు బిగ్ బాస్ బ్యూటీ రతిక రోజ్ ఎంపిక అయ్యింది. ఈ సిరీస్ ని ప్రారంభించినట్టు నటి రతిక రోజ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ప్రస్తుతం ఈమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈమె పోస్ట్ చూసిన వారంతా..” బిగ్బాస్ తర్వాత ఎవరికి ఎంత క్రేజ్ వచ్చిందో తెలియదు కానీ నీకు మాత్రం గట్టిగానే క్రేజ్ వచ్చింది. ఒకప్పుడు నువ్వు ఎవరో కూడా ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నావు. నీ పని బెటర్ ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.