Sourav Ganguly Biopic: భారతీయ చలనచిత్ర రంగంలో బయోపిక్ ల పర్వం గత కొన్ని సంవత్సరాల నుండి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సినిమా రంగంలో రాజకీయ రంగంలో ఇంకా క్రీడారంగంలో చాలామంది ప్రముఖుల జీవితాలను ఆధారం చేసుకుని బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు అనేక బయోపిక్ లు వచ్చాయి. క్రికెటర్ రంగంలో సచిన్ టెండూల్కర్, అజారుద్దీన్, ధోని, కపిల్ దేవ్ వీళ్లకు సంబంధించిన బయోపిక్ లు వచ్చాయి. అయితే ఇప్పుడు కొత్తగా మరో క్రికెటర్ సౌరవ్ గంగూలీ బయోపిక్ రాబోతోంది. 2000 సంవత్సరం నుండి 2006 వరకు ఇండియన్ టీంకి కెప్టెన్ గా నాయకత్వ బాధ్యతలు వహించాడు. ఎడమ చేతివాటం ఆడే సౌరవ్ గంగూలీ.. స్టార్ బ్యాట్స్ మ్యాన్ గా కూడా రాణించడం జరిగింది.
2003వ సంవత్సరంలో జరిగిన ప్రపంచ కప్ పోరులో సౌరవ్ గంగూలీ సారథ్యంలో.. ఇండియా ఫైనల్ దాక చేరుకుని ఆస్ట్రేలియా మీద ఓడిపోయింది. మైదానంలో ఎంతో దూకుడుగా ఉండే గంగూలీ… కీలక నిర్ణయాలు తీసుకోవడంలో చాలా తెలివిగా ఆలోచిస్తాడు. అంతర్జాతీయ క్రికెట్ రంగంలో భారత్..సౌరవ్ గంగూలీ సారధ్యంలోనే బాగా రాణించడం మొదలుపెట్టింది. అంతకుముందు గంగూలీ కెప్టెన్ బాధ్యతలు వహించక ముందు.. చిన్న చిన్న టీమ్స్ మీది ఇండియా గెలిచేది. కానీ గంగూలి కెప్టెన్ అయ్యాక… పెద్ద పెద్ద జట్లపై విజయాలు సాధించి.. టీం మంచి ఫామ్ లోకి వచ్చింది. సౌరవ్ గంగూలీనీ అభిమానుల బెంగాల్ టైగర్, దాదా, కోల్ కతా ప్రిన్స్… అని ముద్దుగా పిలుచుకుంటారు.
అటువంటి క్రికెటర్ బయోపిక్ వస్తుంది. ఈ సినిమాలో సౌరవ్ గంగూలీ.. పాత్రను నేషనల్ అవార్డు విన్నర్ ఆయుష్మాన్ ఖురానా పోషించబోతున్నట్లు సమాచారం. ప్రముఖ దర్శకుడు విక్రమాదిత్య మోత్వని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది చివరిలో సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ వరకు మొత్తం అంతా పూర్తిగా అవటం జరిగిందట. ఈ క్రమంలో సౌరవ్ గంగూలీ పాత్ర పోషించబోయే ఆయుష్మాన్ ఖురాన్..గంగూలీ హావభావాలు.. అతడు ఆడే విధానం తదితరాంశాలపై ప్రత్యేకమైన శిక్షణ తీసుకుంటున్నాడు. మరికొద్ది నెలలో షూటింగ్ స్టార్ట్ చేసి ఈ ఏడాది చివరిలోపు సినిమా విడుదల చేయనున్నట్లు సమాచారం.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!