Fighter Trailer: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కొత్త సినిమా స్పిరిట్ ఆఫ్ ఫైటర్ ట్రైలర్ నేడు రిలీజ్ అయింది. సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనిల్ కపూర్, దీపికా పదుకొనే కీలక పాత్రలు చేస్తున్నారు. “ఫైటర్” సినిమా జనవరి 25వ తారీకు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ వీడియోలు సినిమాపై అంచనాలను ఓ రేంజ్ లో పెంచేసాయి. కాగా నేడు విడుదలైన ట్రైలర్ మరింతగా అంచనాలను డబల్ త్రిపుల్ చేయటం జరిగింది. తయారీ దేశం పాకిస్తాన్ చేసిన దాడికి భారత్ బదులు తీర్చుకునే నేపథ్యం కలిగిన సినిమాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సినిమా ట్రైలర్ బట్టి చూస్తే విజువల్ వండర్ గా ఉంది.
ఇక స్పిరిట్ ఆఫ్ ఫైటర్ తో హృతిక్ రోషన్ పాత్ర చూస్తే భాగంలో పైలెట్ గా పని చేసే స్కాడ్రన్ లీడర్ షంషేర్ పటానియా(పాటీ)గా కనిపించబోతుండగా దీపికా పదుకొనే ఎయిర్ డ్రాగన్ యూనిట్ లో పనిచేసే స్కాడ్రాన్ లీడర్ మినీగా నటిస్తోంది. ఈ సినిమాలో కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్, సంజిదా షేక్, తలత్ అజిజ్ ఇతర నటీనటులు కీలక పాత్రలలో నటించడం జరిగింది. ఈ సినిమాని వయాకామ్ 18 స్టూడియోస్..మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వెండితెరపై హృతిక్ రోషన్, దీపికా పదుకొనే ఫస్ట్ టైం కలిసి నటిస్తున్న సినిమా.
గత ఏడాది సిద్ధార్థ ఆనంద్ “పఠాన్” సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. షారుక్ ఖాన్ కి “పఠాన్” మంచి కం బ్యాక్ ఫిలిం గా నిలిచింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో గత ఏడాది బిగ్గెస్ట్ హిట్ సినిమాలలో “పఠాన్” ఒకటి. ఇప్పుడు సిద్ధార్థ ఆనంద్ కాంపౌండ్ నుండి ఫైటర్ వస్తూ ఉంది. దీంతో భారీగా అంచనాలు నెలకొన్నాయి. పుల్వామా దాడి నేపథ్యంలో ఈ సినిమాని రూపొందించినట్లు తెలుస్తోంది. ఏరియల్ యాక్షన్ లో దొరకెక్కిన తొలి ఇండియన్ సినిమా “ఫైటర్”.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!