Brahmamudi: ఇంద్రాదేవి పెళ్లి రోజు వేడుకలు ఘనంగా మొదలయ్యాయి.. అయితే అక్కడికి వచ్చిన కావ్య కుటుంబానికి ఘోర అవమానం జరుగుతుంది.. దాంతో వాళ్లంతా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు.. స్వప్నకు రాహుల్ అస్సలు సాయం చెయ్యడు.. అది తల్చుకొని బాధపడుతుంది. అందరూ అలా ఇంటికి వెళ్తారు.. ఇంట్లో కనకం వాళ్ల అక్క ఎదురు చూస్తూ ఉంటుంది.. నేను కాఫీ పెట్టేలోగా ఆ స్వప్న ఎక్కడికో వెళ్ళింది అని చెబుతుంది.. దానికి అందరూ స్వప్న వైపు చూస్తారు.. ఎక్కడికి వెళ్ళావ్ అని అడుగుతుంది.. ఇది రావడం తో మాకు గౌరవం పోయింది.. అందరూ నానా మాటలు అన్నారు… చచ్చిపోవాలనిపిస్తుంది అంటుంది కనకం.. దానికి స్వప్న ఏడుస్తూ నాన్న నన్ను క్షమించు అంటుంది.. దానికి అందరూ కోపంగా చూడటంతో బయపడుతుంది..

Bramhamudi: రాజ్ ఇంట్లో కావ్య కుటుంబానికి ఘోర అవమానం.. కావ్యను కోడలికి ఒప్పుకున్న అపర్ణ…
మట్టిని పిసికే చేతులు నావి.. అమ్మావారి విగ్రహాలను కూడా చేస్తాను.. నువ్వు తాకితే అపవిత్రం అవుతాయి.. నన్ను తగిలి పాపం చెయ్యకు అంటాడు.. ఇక స్వప్న లోపలికి వెళ్లి తలుపు వేసుకుంటుంది.. ఏడుస్తూ పడుకుంటుంది.. ఇక రాహుల్ ఈ అవమానం తో తనని లేపూకేళ్ళింది నేనే అని చెబితే రచ్చ చేస్తారు.. ఇంట్లో నుంచి గేంటెస్తారు.. ఒకసారి కాల్ చేద్దామని స్వప్న కు కాల్ చేస్తాడు.. అస్సలు నీకు బుద్ది ఉందా.. అందరూ నన్ను అవమానిస్తుంటే నువ్వు మాత్రం ఒక్క మాట అనలేదు.. నన్ను లేపుకెళ్ళింది నువ్వే కదా.. మాయ మాటలు చెప్పావు.. పెళ్లి ఫారిన్, ఫస్ట్ నైట్ చంద్రమండలంలో అన్నావు.. చివరికి మళ్ళీ ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలోకి తీసుకొచ్చి వదిలేసావు.. కాస్త ఓపిక పట్టు నాకు ఆస్తి కావాలి..నిన్ను నమ్మొచ్చా.. ఇక వేరే ఆప్షన్ లేదని అంటాడు.. దానికి స్వప్న నీకు ఇదే ఆఖరి అవకాశం అంటుంది..

Krishna Mukunda Murari: కృష్ణ తలకి గన్ గురి పెట్టిన భవాని.. మళ్ళీ ఏం చేసింది.!?
ఇక కావ్య తన అమ్మా నాన్నకు జరిగిన అవమానం తలుచుకొని బాధపడుతుంది.. నాకే ఎందుకిలా ఏం తప్పు చేశాను అని దేవుడిని వేడుకుంటూ బాధపడుతుంది.. దేవుడికే సవాల్ విసురుతుంది.. ఇక అటు కావ్య చిన్నత్త ఒక్కటే వంటగదిలో కష్టపడుతుంది.. ఏంటి ఒక్కదానివే అని ఇంద్రాదేవి అడుగుతుంది.. శాంతా కొడుకుకు జ్వరం అంట వెళ్ళింది.. మరి అపర్ణను పిలవకూడదు.. ఆమ్మో వద్దు అత్తయ్య అంటుంది..

ఇక కావ్య దగ్గరకు వెళ్లి వంట చెయ్యమని చెబుతుంది.. కావ్య వెళ్లి వంట చేస్తుంది.. అన్ని తానే చేస్తుంది.. ఇక అప్పు ను కళ్యాణ్ అర్జంట్ గా కలవాలని చెప్పి రమ్మంటాడు.. ఏమైందని అడిగితే రమ్మని చెబుతుంది.. వారిద్దరూ కలిసి కావ్య కోసం ఏదోకటి చెయ్యాలని ప్లాన్ చేస్తారు.. తరువాయి భాగంలో కావ్య వంట చేసిందని రుద్రాని చెబుతుంది.. నీ అత్తగా ఆర్డర్ వేసాను.. వంట ఎందుకు చేసావు అంటుంది.. అత్త అంటే నన్ను కోడలిగా ఒప్పుకున్నారా అంటుంది.. అపర్ణ ఏం చెబుతుందో ఇవాళ ఎపిసోడ్ లో చూడాలి..