Krishna Mukunda Murari: నందిని రా కొద్దిగా అన్నం తిను అని గౌతమ్ అంటాడు లేదు. నాకు అన్నం వద్దు ఏమి వద్దు కృష్ణ కావాలి నన్ను అర్జెంటుగా కృష్ణ దగ్గరకు తీసుకు వెళ్ళమని నందిని మారం చేస్తూ ఉంటుంది. ముందు అన్నం తిను ఆ తరువాత కృష్ణ దగ్గరికి నేను తీసుకు వెళ్తాను అని నందిని కన్విన్స్ చేసే అన్నం తినిపిస్తాడు. గౌతమ్ మా ఇంట్లో వాళ్ళు కృష్ణని తిడుతున్నారో ఏమో అని నందిని అనగానే.. గౌతమ్ కూడా కృష్ణ చాలా ఇబ్బందులు పడుతోంది అని మనసులోనే అనుకుని నందినికి ప్రేమగా అన్నం తినిపిస్తాడు.

Krishna Mukunda Murari: మురారినీ కృష్ణ మాయలో ఉండి నాకు ద్రోహం చేసావన్నా భవాని.. కన్నీళ్లు పెట్టుకున్న మురారి, కృష్ణ.?
ఈ ఇంట్లో వాళ్ళు కూడా ఎవ్వరూ మీతో మాట్లాడకూడదు. ఇదే నేను మీకు వేస్తున్న శిక్ష అని భవాని అంటుంది. పెద్దమ్మ ఈ శిక్ష వేయడం కరెక్ట్ కాదు పెద్దమ్మ అని మురారి అంటాడు. ఇక భవాని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన సన్నివేశాలను మురారి గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. మురారి బాధపడడం చూసిన కృష్ణ ఎలాగైనా పెద్దమ్మ కొడుకుల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించాలని ఒక్కసారి వెళ్లి భవాని అత్తయ్యతో మాట్లాడాలని అనుకుంటుంది కృష్ణ. ఇక భవాని రూమ్ తలుపు మోగడంతో ఎవరా అని వచ్చి తలుపు తీస్తుంది భవాని. చూస్తే ఎదురుగా కృష్ణ ఉంటుంది. వెంటనే తలుపు వేయబోతుండగా అత్తయ్య ప్లీజ్ ఒక్క నిమిషం అని కృష్ణ తన మనసులో ఉన్న వేదనను భవానికి చెప్పాలని అనుకుంటుంది. ఏసీబీ సార్ తప్ప ఏమీ లేదు. తప్పంతా నాదే అత్తయ్య. ఒక మేజర్ జంటకి పెళ్లి చేయాలని నేనే అడిగాను కానీ ఆ జంట ఎవరు అనేది నేను చెప్పలేదు. తప్పంతా నాదే అత్తయ్య శిక్ష అంతా నాకేయండి. కావాలంటే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టండి. అంతేకానీ ఏసీబీ సార్ తో మాత్రం మాట్లాడకుండా ఉండొద్దు అంటూ కృష్ణ వేడుకుంటుంది.

Nuvvu nenu prema: కృష్ణ మోసం విక్కీకి తెలిసిపోతుందా.. అరవింద ప్రగ్నెంట్ కావడంతో షాక్ అవుతున్న కృష్ణ..
కృష్ణ మాటలను మౌనంగా వింటున్న భవానికి లోలోపల అగ్నిపర్వతాలు బద్దలవుతున్నంత బాధ ఉంటుంది. ఇక వెంటనే రివాల్వర్ తీసుకొని కృష్ణ తలకి గురిపెడుతుంది. ఆ వెంటనే ముకుందా అంటూ పెద్దగా అరుస్తుంది భవాని అరుపుకు ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా అక్కడికి చేరుకుంటారు. వాళ్లు కూడా కృష్ణ తలకి భవాని గన్ పెట్టడం చూసి షాక్ అవుతారు. మీరు ఏం చేస్తున్నారు అత్తయ్య నందిని గౌతమ్ ని కలిపినందుకు కృష్ణప్రాణాలు తీయాలనుకుంటున్నారా ఇది సరైన నిర్ణయం కాదు అని ముకుందా అంటుంది. చూస్తూ చూస్తూ ఇలా ఎలా చేస్తారు. అత్తయ్య కావాలంటే తనని ఇంట్లో నుంచి పంపించండి అని ముకుందా మొదటిసారి కృష్ణ కోసం భవానికి ఎదురు తిరిగి మాట్లాడుతుంది. నీ చేత నేను చెప్పించుకునే స్థాయిలో లేను అని భవాని ముకుందకు సమాధానం ఇస్తుంది.

ఈరోజు ఈ అమ్మాయిని చంపితే కానీ నా కోపం చల్లారదు అని భవాని అంటుంది. మీరు నా ప్రాణాలను తీసేముందు ఒక్క విషయం మీతో చెప్పాలి అత్తయ్య. మీరు నన్ను చంపినా పర్వాలేదు. నన్ను చంపేసినా తరువాత మీరు ఏసీబీ సార్ ని క్షమిస్తానంటే నేను ప్రశాంతంగా మీ చేతుల్లో చచ్చిపోవడానికి ఒప్పుకుంటాను. అలా కాకుండా మీరు నన్ను చంపేసి ఏసిపి సార్ ని క్షమించకపోతే మాత్రం నా ప్రాణాలు తీసే హక్కు మీకు లేదు అని కృష్ణ అంటుంది. ఆ వెంటనే భవాని రివాల్వర్ ట్రిగ్గర్ నొక్క పోతుండగా.. మురారి వెళ్లి కృష్ణను వెనక్కి లాగి భవాని ఎదురుగా మురారి నిలబడతాడు. ముందు కృష్ణని కాదు పెద్దమ్మ, నన్ను కాల్చు.. మా పెద్దమ్మ ఒక నిండు ప్రాణాన్ని తీయాలని అనుకుంటుందా.. అంత కోపం, ద్వేషం ఉంటే ముందు నాతోనే అది కూడా మొదలవ్వని అని మురారి అంటాడు. ఇక మురారిని చూడగానే భవాని రివాల్వర్ ను కిందకు దించుతుంది. ఆ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక గదిలోకి వచ్చిన మురారి ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు.

Brahmamudi ఏప్రిల్ 25: స్వప్న రాహుల్ గురించి బయట పెడుతుందా? కావ్య జీవితం మారబోతుందా..
మురారి కృష్ణ ఒకరినొకరు చూసుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఏసీబీ సార్ నన్ను క్షమించండి ఈరోజు మీరు బాధపడడానికి నేనే కారణం నా వల్లే మీకు ఇంత పెద్ద శిక్ష అని అంటుంది. అయినా నన్ను కాల్చేటప్పుడు మీరు ఎందుకు అడ్డం వచ్చారు అని కృష్ణ అడుగుతుంది అదేంటి కృష్ణ చూస్తూ చూస్తూ నా ముందు నీ ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకుంటానా అని మురారి అంటాడు. ఒకవేళ నిజంగానే నన్ను మీ పెద్దమ్మ కాల్చి ఉంటే అనే కృష్ణ అనగానే తన పెదాల మీద చేయి అడ్డు పెడతాడు మురారి ప్లీజ్ కృష్ణ అలా మాట్లాడకు అని మురారి అంటాడు. ఇక రేపటి ఎపిసోడ్లో భోజనానికి వెళ్దాం రమ్మని మురారి ని కృష్ణ పిలుస్తుంది వద్దు నేను రాను అని మురారి అంటాడు. ప్రకృతి ప్రతినిత్యం మారుతూనే ఉంటుంది అలాగే మీ పెద్దమ్మ కూడా మారుతుంది. భోజనానికీ రమ్మని చెబుతుంది. కృష్ణ ఇక కృష్ణ మాట కోసం మురారి కిందకు వస్తాడు వాళ్ళ పెద్దమ్మ టిఫిన్ చేస్తుండగా మురారి కృష్ణ వచ్చి కూర్చుంటారు. ఆ వెంటనే భవానీ లేచి నిలబడుతుంది. ఈ గొడవ ఇంకెంత దూరం వెళుతుందో చూడాలి.