Punganur (Chittoor): పుంగనూరు వద్ద బుధవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పుంగనూరు మండలం అరవపల్లి గ్రామం వద్ద చెట్టును కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన అతనిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తొంది. మృతులు పుంగనూరుకు చెందిన కుమార్, భాగ్యరాజ్, రవి గా గుర్తించారు.

సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు అతివేగంగా రావడం వల్ల అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టినట్లుగా చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. వారి కుటుంబాలకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.