21.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
Entertainment News సినిమా

2వ రోజే టార్గెట్ ఔట్‌.. బాక్సాఫీస్ వ‌ద్ద `బ్ర‌హ్మాస్త్ర` మాస్ బీభ‌త్సం!

Share

బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ‌బీర్ క‌పూర్ హీరోగా అయాన్ ముఖర్జీ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `బ్ర‌హ్మాస్త్ర‌`. ఇందులో ఆలియా భ‌ట్ హీరోయిన్‌గా న‌టిస్తే.. అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌని రాయ్, షారుఖ్ ఖాన్ తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

కరణ్ జోహర్, రణబీర్ కపూర్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం.. సెప్టెంబ‌ర్ 9న హిందీతో పాటు తెలుగు, త‌మిళ్‌, కన్న‌డ‌, మ‌ల‌యాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా తొలి షో నుంచే మిశ్ర‌మ స్పంద‌న ద‌క్కించుకున్నా.. అద్భుత‌మైన విజువల్స్, గ్రాఫిక్స్ హంగులు ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్స్‌కు ర‌ప్పిస్తున్నాయి.

brahmastra movie collections
brahmastra movie collections

ఈ నేప‌థ్యంలోనే వర‌ల్డ్ వైడ్‌గా ఎక్స్ లెంట్ క‌లెక్ష‌న్స్ తో దుమ్ముదులిపేస్తోంది. ముఖ్యంగా తెలుగులో బాక్సాఫీస్ వ‌ద్ద మాస్ బీభ‌త్సం సృష్టించి 2వ రోజే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను దాటేసింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 3.68 కోట్ల షేర్‌, రూ. 6.70 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఈ చిత్రం.. 2వ రోజు రూ. 2.62 కోట్ల షేర్‌, రూ.5.05 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను ద‌క్కించుకుంది. ఇక తెలుగులో ఏరియాల వారీగా బ్ర‌హ్మాస్త్ర రెండు రోజుల‌ టోట‌ల్ కలెక్ష‌న్స్ ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 3.17 కోట్లు
సీడెడ్: 0.72 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 0.66 కోట్లు
తూర్పు: 0.48 కోట్లు
పశ్చిమ: 0.31 కోట్లు
గుంటూరు: 0.49 కోట్లు
కృష్ణ: 0.25 కోట్లు
నెల్లూరు: 0.22 కోట్లు
————————————
ఏపీ+తెలంగాణ‌ మొత్తం= 6.30కోట్లు(11.75కోట్లు~ గ్రాస్)
————————————

కాగా, తెలుగు రాష్ట్రాల్లో రూ. 5 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 5.5 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే రెండో రోజే ఆ మార్క్‌ను క్రాస్ చేసిన బ్ర‌హ్మాస్త్ర‌.. ఇప్పుడు రూ. 80 ల‌క్ష‌ల లాభాల‌తో ముందుకు సాగుతోంది.


Share

Related posts

Major: పవన్ కొడుకు అకిరా నందన్ కి థాంక్స్ చెప్పిన హీరో అడవి శేష్..!!

sekhar

Pawan kalyan: పవన్ కళ్యాణ్ కోసం కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్న ఆర్ట్ డైరెక్టర్..!

GRK

Mahesh Babu: మహేష్ తర్వాత మరో స్టార్ హీరోని లైన్ లో పెట్టిన పరశురాం..??

sekhar