హెల్త్

తేనె వలన కలిగే ఆరోగ్యప్రయోజనాల గురించి మీకు తెలుసా..?

Share

తేనె పేరు చెబితే చాలు చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరు లోట్టలు వేసుకుని మరి తింటారు. ఎందుకంటే తేనె సహజ సిద్ధంగా దొరికే ఒక తియ్యని కమ్మని పదార్థం కాబట్టి అందరూ తేనెను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. తినడానికి తియ్యగా రుచికరంగా ఉంటుంది.చ‌క్కెర‌ కన్నా రెండు రెట్లు ఎక్కువ తీపిగా ఉండే ఈ తేనె క్రిమి సంహారక గుణాల‌ను కలిగి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ తేనెకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు.తేనెలోని ఫ్లావనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కొన్ని రకాల క్యాన్సర్లను పూర్తిగా నివారిస్తాయి.

తేనె వలన కలిగే ఆరోగ్యప్రయోజనాలు :

Honey

అలాగే ఉద‌యాన్నే గోరువెచ్చ‌ని నీటిలో తేనెను కలిపి తాగితే బరువు కూడా సులభంగా తగ్గుతారు.అలాగే తేనె తినడం వలన శ‌రీరానికి ఎన్నో ఉప‌యోగాలు క‌లుగుతాయి. స్వచ్ఛమైన తేనెలో ఎంజైమ్‌లు అధికంగా ఉంటాయి. అలాగే విటమిన్లు, ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. హానికరమైన బాక్టీరియా నుండి మ‌న‌ శరీర‌ వ్యవస్థను రక్షించడంలో తేనె కీల‌క పాత్ర పోషిస్తుంది. తేనెను తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగనిరోధ‌క వ్య‌వ‌స్థ కూడా బలపడుతుంది.

తేనె మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతుందంటే..?

Honey and hot water

తేనెలో యాంటిసెప్టిక్,యాంటీ బయాటిక్,విటమిన్ బి 1, విటమిన్ బి 6 కూడా సమృద్ధిగా ఉంటాయి. తేనె తాగితే కంటి చూపు పెరుగుతుంది.మలబద్దకం, అజీర్ణం, కడుపునొప్పి ఇలా అనేక స‌మ‌స్య‌ల‌కు తేనె ఒక చ‌క్క‌ని ఔష‌ధంగా చెప్పవచ్చు.అలాగే ప్రమాదాల్లో గాయాలు తగిలినప్పుడు,కాలిన గాయాలు అయినప్పుడు అవి త్వరగా మానడానికి తేనె బాగా సహాయపడుతుంది.శరీరంలో మంచి బ్యాక్టీరియాను పెంచేందుకు మరియు చర్మం మరింత ఆకర్షణీయంగా,అందంగా కనిపించేలా చేయడంలో తేనె ఎంతగానో సహాయపడుతుంది.


Share

Related posts

హైదరాబాద్ వాసులు దీని తో సెల్ఫీ దిగితే ప్రాణాలకే ప్రమాదం!!

Naina

ప్రతి ఇంటిలో ఉండవలిసిన మెడికల్ గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకోండి!!

Kumar

Relationship tips ఈ  రెండిటి పై దృష్ఠి పెడితే శృంగారం లో మిమ్మల్ని ఎవరు ఆపలేరు !!

Kumar