Guntur Kaaram: ఈ సంక్రాంతి పండుగకు అతిపెద్ద సినిమాగా “గుంటూరు కారం” విడుదలయ్యింది. జనవరి 12వ తారీకు రెండో తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అయిన సినిమా. జనవరి 12 అర్థరాత్రి ఒంటిగంట నుంచే షోలు పడ్డాయి. ఈ క్రమంలో మిక్స్డ్ టాక్ రావటం జరిగాయి. ప్రేక్షకులు నుండి నెగిటివ్ రెస్పాన్స్ మరియు సోషల్ మీడియాలో క్రిటిక్స్ నుంచి నెగిటివ్ రివ్యూలు రావడం జరిగింది. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా లాగా లేదని చాలామంది ధియేటర్ నుండి ప్రేక్షకులు వస్తూ మైక్స్ ముందు గోల చేశారు. సినిమాలో మహేష్ బాబు పాత్ర మరియు శ్రీలీల డ్యాన్స్ మినహా చెప్పుకోవడానికి ఏమీ లేవని చాలామంది తమ అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. కానీ సినిమా కలెక్షన్ల పరంగా చూసుకుంటే మొదటి రోజే 94 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
కానీ ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం 80 కోట్ల గ్రాస్ మాత్రమే.. రాబట్టినట్లు తెలుస్తోంది. దాదాపు ఏడాదిన్నర తర్వాత పైగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ మూడో సినిమా కావటంతో… పెళ్లిరోజు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రావటం జరిగాయి. మరి రెండవ రోజు నుంచి కలెక్షన్ ఎలా ఉంటాయనేది .. వేచి చూడాలి. మరోవైపు ఇదే సమయంలో “హనుమాన్” చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే రెండో రోజు గుంటూరు కారం నిర్మాత నాగ వంశీ సినిమా డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ రాత్రి ఒంటిగంటకు ప్రదర్శించిన బెనిఫిట్ షోలు మరియు ప్రీమియర్స్ షోలు అయిపోయిన తర్వాత మిక్సెడ్ టాక్ వచ్చిందన్నది వాస్తవమే. నేను కూడా సోషల్ మీడియాలో యావరేజ్ అని ఇంకా నెగిటివ్ వీలు చూడటం జరిగింది. కానీ రియాల్టీ వచ్చేసరికి ప్రతి షోకి టాక్ మారుతుంది. డైరెక్టర్ త్రివిక్రమ్ డైలాగులు మరియు మహేష్ పాత్రకి ఆడియన్స్ నుండి బాగా రెస్పాన్స్ రావడం జరిగింది.
ఈవినింగ్ షోలు ప్రారంభమయ్యేసరికి టాక్ మరింత మారింది. గతంలో నెగిటివ్ టాక్ తో మొదలై బ్లాక్ బస్టర్స్ అయినా సినిమాలు చాలా ఉన్నాయని అన్నారు. నెగిటివ్ మైండ్ తో సినిమా చూస్తే ఆ రకంగానే అనిపిస్తుంది. బయట ఏమి పట్టించుకోకుండా సినిమా చూడాలని దిల్ రాజు సూచించారు. “గుంటూరు కారం” ఏ రేంజ్ సినిమా అనేది పండగ తర్వాత లెక్కలు బట్టి తెలుస్తుందని తెలిపారు. ఇదే సమయంలో సంక్రాంతి అనేది ఇండస్ట్రీలో బిజినెస్. ఇక్కడ ఎవరికీ ఎవరు శత్రువులు కాదు అదే విధంగా మిత్రువులు కూడా కాదు అని పేర్కొన్నారు. ఏ సినిమా అయినా రిజల్ట్ ఎలా చూడాలంటే ఆ హీరో కి సంబంధించి గత సినిమాల కలెక్షన్స్ మరియు ఇప్పుడు విడుదలైన సినిమా కలెక్షన్స్ ఏమైనా పెరిగాయ అన్న విధంగా తేడా చూడాలి. “గుంటూరు కారం” ప్రతి షోకి టాక్ మారుతోంది. అదేవిదంగా మంచి నంబర్స్ వస్తున్నాయి అని దిల్ రాజు స్పష్టం చేశారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!