NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa January 13 2024 Episode 125: అభికి స్వర మీద కోపం పెంచుతున్న పరిస్థితులు..

Paluke Bangaramayenaa Today Episode January 13 2024 Episode 125 Highlights

Paluke Bangaramayenaa January 13 2024 Episode 125:  ఏంటి స్వర అని యశోద అంటుంది. ఏమీ లేదు ఆంటీ చందన గారు కూరగాయలు తెమ్మన్నారు తీసుకువస్తే ఇప్పుడేమో కోప్పడుతున్నారు అని స్వర అంటుంది. ఏమైంది చందన ఈ మధ్య ఇలా ప్రవర్తిస్తున్నావ్ ఎందుకు అని యశోద కూరగాయలు తీసుకొని లోపలికి వెళుతుంది. చందన గారు ఏమైంది అని స్వర అడుగుతుంది. ఏదో నేను ఇంట్లోకి వెళ్తుంటే నువ్వు కనిపించావు ఇంత తొందరగా వచ్చావా అని అడిగాను దానికి ఇంత సీన్ చేస్తావ్ ఏంటి అని చందన కోపంగా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, చందన వైజయంతికి ఫోన్ చేసి మేడం ఏమైంది స్వర ఇంటికి వచ్చేసింది అని అడుగుతుంది.

Paluke Bangaramayenaa Today Episode January 13 2024 Episode 125 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 13 2024 Episode 125 Highlights

 

ఆ విశాల్ ని నమ్ముకుంటే కిడ్నాప్ చేయలేకపోయాను చందన ఈసారి  బయట కాకుండా ఇంట్లో పూజ అని చెప్పి ప్లాన్ చెయ్యి అప్పుడు ఎవరికి అనుమానం రాకుండా మేము తీసుకెళ్లి పోతాం అది నీ మీదకి రాకుండా నేను చూసుకుంటాను అని వైజయంతి అంటుంది . అలాగే మేడం మా కుటుంబం బాగుండాలని పూజ చేయిస్తాను మా అన్నయ్య జీవితంలో నుంచి స్వర వెళ్ళిపోవాలి అని చందన అంటుంది. మీ కుటుంబం బాగుండాలని పూజ బాగా చేయించు చందన ఎంత డబ్బు అయినా పర్వాలేదు అని వైజయంతి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode January 13 2024 Episode 125 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 13 2024 Episode 125 Highlights

అలాగే మేడం మీరు మాత్రం ఈసారి మిస్ చేయకండి మళ్లీ ఇలాంటి అవకాశం మనకు రాకపోవచ్చు అని చందన ఫోన్ కట్ చేస్తుంది. ఈ మాత్రం చాలు నువ్వు సపోర్ట్ చేస్తే దాన్ని ఏమైనా చేస్తాను అని వైజయంతి అనుకుంటుంది. కట్ చేస్తే,నాయుడు స్వర గురించి బాధపడుతూ ఉంటాడు. ఈరోజు ఎలాగైనా ఆర్యని నీలకంఠాన్ని నిలదీసి అడగాలి అక్కడ స్వర ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఏమో అని నాయుడు అనుకుంటాడు. ఇంతలో ఆర్య వచ్చి ఏంటి నాన్న పిలిచారు అంట అని అడుగుతాడు. అభి వాళ్ళ ఇంట్లో స్వర హ్యాపీ ఉందా లేదంటే బాధపడుతున్న మీరు నాకు చెప్పడం లేదా అని నాయుడు అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode January 13 2024 Episode 125 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 13 2024 Episode 125 Highlights

నాన్న నీకు నిజం చెప్పకుండా ఎందుకు అబద్ధం చెప్తాను చెప్పు అక్క అక్కడ బాగానే ఉంది మీరేం బాధపడకండి నేను చూసి వచ్చాను కదా అని అంటాడు.అవును సార్ ఇప్పుడు అంటే అభి సార్ కోపంలో ఉన్నారు కాని ఆయన గురించి నిజాయితీ గురించి మీకు తెలుసు కదా కచ్చితంగా మార్పు వస్తుంది,స్వరని బాగా చూసుకుంటాడు సార్ మీరు ఏం టెన్షన్ పడకండి అని నీలకంఠం అంటాడు. ఇప్పుడు నా మనసు కుదుటపడింది  అని నాయుడు అనుకుంటాడు. కట్ చేస్తే, స్వర నిన్ను చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందో తెలుసా నువ్వే మా వదిన అయితే బాగుండు అని కీర్తి అంటుంది. అలా నీకు ఎందుకు అనిపించింది ఇప్పుడు నాకు సార్ మీద అలాంటి ఉద్దేశం లేదు సార్ ఎప్పుడు ఝాన్సీ మేడంని ఇష్టపడుతున్నాను అని చెప్పాడో అప్పుడే నా మనసు విరిగిపోయింది మీ అన్నయ్యను మార్చడమే  అంటుంది. కట్ చేస్తే, అభి బయటికి వెళుతూ ఉండగా స్వర వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు ఆగండి అని అడుగుతుంది.

Paluke Bangaramayenaa Today Episode January 13 2024 Episode 125 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 13 2024 Episode 125 Highlights

ఏంటి వద్దంటున్నా సరే పదేపదే నన్ను విసిగిస్తున్నావ్ ఎందుకు నా వెంటపడుతున్నావ్ ఇంకా ఏం మిగిలింది నా జీవితం నాశనం చేసావు కదా అని అభిషేక్ అంటాడు. నేనేం చేశాను సార్ అంతలా అరుస్తున్నారు అని స్వర అంటుంది. అభి స్వర చేసిన తప్పు సరిదిద్దుకుందామనుకుంటుంది తనకు ఒక అవకాశం ఇవ్వరా అని వాళ్ళ బామ్మ అంటుంది. బామ్మ ఈ స్వరను నువ్వు వెనకేసుకురాకు తన వల్లనే కదా నేను చేరుకోవాలనుకున్న గమ్యాన్ని చేరుకోలేకపోయాను నా ఉద్యోగం పోయింది ఇప్పుడు లంచం ఇస్తే కానీ నేను ఉద్యోగం చేయలేను అలాగని లంచం ఇచ్చి నా సిన్సియారటిని కొనుక్కోనా దీనికంతటికి కారణం ఎవరు తను కాదా అని అభిషేక్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode January 13 2024 Episode 125 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 13 2024 Episode 125 Highlights

అన్నయ్య దానికి ఎందుకు అంతలా బాధపడతావ్ ఎంత డబ్బు కట్టాలో చెప్పు వాళ్ళకి కట్టేసి మనం జాబ్ తెచ్చుకుందాం అని చందన అంటుంది. చూసావా నీవల్ల ఇంట్లో వాళ్ళందరికీ చులకన అయిపోయాను అని అభిషేక్ కోపంగా బయటికి వెళ్ళిపోతాడు. చందన నీ దగ్గర అంత డబ్బు ఎక్కడిది అని బామ్మ అడుగుతుంది. నా దగ్గర డబ్బులు ఎక్కడివి బామ్మ ఏదో అన్నయ్యను ఓదార్చడానికి అలా అన్నాను అని చందన వెళ్ళిపోతుంది. ఇది ఏదో చేస్తుంది లేకపోతే ఆ కిరాణా షాప్ అతనికి డబ్బులు ఎలా కట్టింది అని  ఆలోచిస్తుంది. కట్ చేస్తే, అభి సార్ మళ్లీ ఉద్యోగం చేయాలంటే ఏదో ఒకటి చేయాలి తను లంచం ఇవ్వకుండా తన సిన్సియారిటీని చూసి ఉద్యోగం ఇవ్వాలి అని స్వర ఆలోచిస్తూ ఉంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N