NewsOrbit
Cinema Entertainment News రివ్యూలు సినిమా

Hanuman Review: సంక్రాంతి ఫస్ట్ హిట్..థియేటర్ లో హనుమాన్ భక్తులకు పూనకాలే.. “హనుమాన్” మూవీ రివ్యూ..!!

Hanuman Review: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన తేజ సజ్జా అందరికీ సుపరిచితుడే. చిత్ర పరిశ్రమలో చిరంజీవి, జగపతిబాబు, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ సినిమాలలో నటించడం జరిగింది. చాలా చిన్న వయసులోనే తేజ సజ్జా సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. దీంతో “హనుమాన్” సినిమాతో ఇప్పుడు హీరోగా మారడం జరిగింది. నేడే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రశాంత్ వర్మ కథ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 11 అర్థ రాత్రి నుండి తెలుగు చలనచిత్ర రంగంలో రిలీజ్ అయిన మొట్టమొదటి సినిమా. మరి “హనుమాన్” సినిమా రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం.

సినిమా పేరు: హనుమాన్
నటీనటులు: తేజ సజ్జ, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్,వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను తదితరులు
సంగీతం: అనుదీప్ దేవ్, గౌరహరి,కృష్ణ సౌరబ్
సినిమాటోగ్రఫీ: దాశరధి శివేంద్ర
ఎడిటర్: సాయిబాబు తలారి
రచన, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
నిర్మాత: నిరంజన్ రెడ్డి
బ్యానర్: ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్
విడుదల తేదీ: జనవరి 12, 2024

పరిచయం:

చైల్డ్ ఆర్టిస్ట్ గా చిన్నతనంలోనే ఇండస్ట్రీకి పరిచయమైన “తేజ సజ్జా” హనుమాన్ సినిమాతో హీరోగా మారాడు. ఈ క్రమంలో సంక్రాంతి ఇలాంటి పెద్ద పండుగ అందులోనూ పెద్ద పెద్ద సినిమాలు విడుదలవుతున్నాగాని “హనుమాన్” స్క్రిప్ట్ మీద ఉన్న నమ్మకం బట్టి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద బరిలోకి దింపారు. చిన్న వయసులోనే సినిమా ప్రేక్షకుల హృదయాల్లో తేజ సజ్జా స్థానం సంపాదించడంతో “హనుమాన్” సినిమా కోసం ఓ రేంజ్ లో సినిమా ఆడియన్స్ ఎదురు చూశారు. మరి ముఖ్యంగా జాంబిరెడ్డి తర్వాత ప్రశాంతవర్మ ఈ సినిమా చేయటంతో అందరిలోనూ అంచనాలు భారీగా నెలకొన్నాయి. మరి హనుమాన్ ప్రేక్షకులను ఎలా అలరించిందో తెలుసుకుందాం.

Full review of Hanuman movie directed by Prashant Varma starring Teja Sajja as hero

స్టోరీ:

అంజనాద్రి అనే ఓ చిన్న గ్రామం సముద్రతీరా ప్రాంతంలో ఉంటుంది. అదే ప్రాంతంలో అంజనాద్రి పర్వతాలు ఉంటాయి. ఆ గ్రామంలో హనుమంతు (తేజ సజ్జా) గురి గమ్యం లేకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతుంటాడు. గ్రామంలో ఉంటూ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు. హనుమంతు అక్క అంజమ్మ (వరలక్ష్మి శరత్ కుమార్). తమ్ముడు హనుమంత్ అంటే అంజమ్మకి పంచప్రాణాలు. ఆ కారణంగానే తమ్ముడుని చూసుకోవడానికి పెళ్లి కూడా చేసుకోద్దు. ఇక అదే ఊరిలో మీనాక్షి (అమృత అయ్యర్)నీ హనుమంతు ప్రాణంగా ప్రేమిస్తాడు. ఒకసారి బందిపోటుదొంగలు నుండి మీనాక్షిని కాపాడే ప్రయత్నంలో హనుమంతు సముద్రంలో పడిపోతాడు. అయితే సముద్రంలో పడిన హనుమంతుకి… హనుమాన్ శక్తులు లభిస్తాయి. ఆ పవర్స్ తో కొండనైనా పిండి చేసే అంత రీతిలో అత్యంత బలవంతుడిగా మారతాడు. ఈ క్రమంలో చిన్న నాటి నుంచి గొప్ప సూపర్ మాన్ అవ్వాలని మైఖేల్(వినయ్ రాయ్) అనే వ్యక్తి కలలు కంటాడు. ఈ మైఖేల్ చిన్న వయసులోనే తన తల్లిదండ్రులను చంపేస్తాడు. అటువంటి మైఖేల్ (వినయ్ రాయ్) హనుమంతు కోసం అంజనాద్రి గ్రామం వస్తాడు. హనుమంతుకి హనుమాన్ శక్తులు లభించాయని తెలుసుకుంటాడు. దీంతో సూపర్ హీరో పవర్ కోసం మైకేల్ ఏం చేశాడు…? ప్రమాదంలో సముద్రంలో పడినప్పుడు హనుమంతుకి హనుమాన్ శక్తులు ఎలా వచ్చాయి..? సూపర్ హీరో పవర్ కోసం మైఖేల్ ఎలాంటి ప్రయత్నాలు చేసాడు..? హనుమంతునీ నడిపించిన శక్తి ఏమిటి..? ఇవన్నీ తెలియాలంటే థియేటర్ లో సినిమా చూడాల్సిందే.

Full review of Hanuman movie directed by Prashant Varma starring Teja Sajja as hero

విశ్లేషణ:

దేశవ్యాప్తంగా అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం కార్యక్రమం వాతావరణం ఎమోషన్ గా ఉంది. ఈ క్రమంలో పాన్ ఇండియా నేపథ్యంలో విడుదలైన “హనుమాన్” కి అన్నిచోట్ల పాజిటివ్ టాక్స్ రావడం విశేషం. బాలీవుడ్ క్రిటిక్ అయినా తరుణ్ ఆదర్శ్… హిందీ బెల్టులో “హనుమాన్” అదుర్స్ అని 3.5 రేటింగ్ ఇచ్చారు. దేశంలోనే అటువంటి క్రిటిక్ సినిమాకి అంత మంచి రేటింగ్ ఇవ్వడం విశేషం. థియేటర్ లో ప్రేక్షకుడికి  “హనుమాన్” సినిమా మొదటినుండి ఒక కొత్త ఫీల్ కలిగిస్తాది. ఆడియాన్స్ కి మెల్లమెల్లగా హనుమంతుడికి కథలో.. ఉన్న ప్రాధాన్యం తెలియజేస్తూ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాని నడిపించిన విధానం హైలెట్. అసలు స్టొరీకి సోల్ మాదిరిగా ఆంజనేయుడిని.. ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో దర్శకుడు నూటికి నూరుపాళ్ళు సక్సెస్ సాధించాడని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఆంజనేయుడు రూపమైన వానరానికి తేజ సజ్జాకి మధ్య జరిగే సంభాషణ చాలా హైలెట్ గా చిత్రీకరించారు. ఫస్టాఫ్ లోనే కొన్ని గుస్ బాంప్స్ ఎపిసోడ్స్.. సరైన టైంలో ప్రేక్షకుడిని ఆశ్చర్యపరిచేలా పెట్టడం జరిగింది. మొదటి భాగంలో సింపుల్ లవ్ స్టోరీతో పాటు హీరోకి సూపర్ పవర్స్ వచ్చే ప్రక్రియను.. దర్శకుడు చాలా సింపుల్ గా చూపించేశాడు. అక్క తమ్ముళ్లుగా వరలక్ష్మి తేజ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ప్రేక్షకులను అలరిస్తాయి. టోటల్ గా ఫస్ట్ ఆఫ్ లో అన్ని రకాలుగా ప్రేక్షకులను సినిమాకి కనెక్ట్ అయ్యేలా ఎక్కడా కూడా బోర్ లేకుండా.. కథకి తగ్గ సన్నివేశాలతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాని నడిపించాడు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి స్టార్టింగ్ లో కొన్ని సాగదీత సన్నివేశాలు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. అయితే కథలో ఎమోషన్ కి తగ్గట్టుగానే ఎలివేషన్స్ దర్శకుడు ప్రశాంత్ వర్మ చాలా చక్కగా డీల్ చేశాడు. VFX షాట్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తుంది. చాలా రియల్స్టీగా ఉన్నాయి. సినిమా మొత్తంలో సముద్రఖని ఎపిసోడ్ అప్పుడు వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి థియేటర్ లో ఆంజనేయ స్వామి భక్తులకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ప్రధానంగా సినిమా క్లైమాక్స్ నాన్ స్టాప్ గుస్ బంప్స్ అని చెప్పవచ్చు. క్లైమాక్స్ ఎపిసోడ్ లో హనుమాన్ సీక్వెల్ కి లీడ్ ఇచ్చిన విధానం కూడా బాగుంది.

Full review of Hanuman movie directed by Prashant Varma starring Teja Sajja as hero
టెక్నికల్ మరియు నటీనటుల పనితీరు:

దర్శకుడు ప్రశాంత్ వర్మ.. సూపర్ హీరోస్ కాన్సెప్ట్ తో తనకున్న లిమిటెడ్ బడ్జెట్ లో ఈ సినిమాకి న్యాయం చేశారని చెప్పవచ్చు. హీరోగా తేజ సజ్జా కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ సీన్స్ లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ప్రధానంగా సముద్రఖని క్యారెక్టర్ తో దర్శకుడు ఈ సినిమాని పూర్తిగా మార్చేశాడు. హీరోకి సూపర్ పవర్స్ వచ్చిన లెక్క ఒక ఎత్తు అయితే సముద్రఖని క్యారెక్టర్ మరో ఎత్తు. ఇక కామెడీ ట్రాక్ పరంగా వెన్నెల కిషోర్, గెటప్ శీను, సత్య రోహిణి బాగానే నవ్వించారు. గ్రాఫిక్స్ వర్క్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ప్రేక్షకుడిని సినిమా కథనంతో కనెక్ట్ చేయడంలో ప్రముఖ పాత్ర పోషించాయి. సినిమా ఆటోగ్రాఫీ వర్క్ కూడా హైలెట్. అన్నిటికంటే ముఖ్యంగా నిర్మాత నిరంజన్ రెడ్డి సాహసానికి హ్యాట్సాఫ్ చెప్పవచ్చు. సూపర్ హీరోస్ స్క్రిప్ట్ నీ నమ్మటం దానిని అద్భుతమైన హైటెక్నికల్ వాల్యూస్ తో నిర్మించి.. సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు మధ్యలో విడుదల చేయటం ఒక సాహసమే అని అనాలి.

చివరిగా: ఈసారి సంక్రాంతికి బాక్సాఫీస్ ని హనుమంతుడు గట్టిగా కొట్టాడని చెప్పవచ్చు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu