పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ఉన్న బిగ్గెస్ట్ ప్రాజెక్టులలో `సలార్` ఒకటి. కేజీఎఫ్ సినిమాతో ఇండియా వైడ్ గా పాపులర్ అయిన ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా శ్రుతిహాసన్ నటిస్తోంది. జగపతిబాబు కీలక పాత్రను పోషిస్తున్నారు.
హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ కిరాగందుర్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అన్నీ అనుకుంన్నట్లు జరుగుంటే ఈ చిత్రం 2022 ఏప్రిల్ 14న విడుదల అయ్యుండేది. కానీ షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల వచ్చే ఏడాది సెప్టెంబర్ 28కు పోస్ట్ పోన్ చేశారు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ చిత్రం నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యే ఓ గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే ఈ సినిమా టీజర్ లాంఛ్‌కు మేకర్స్ డేట్ లాక్ చేశారట. సెప్టెంబర్ 23న సలార్ టీజర్ బయటకు వదిలెందుకు ప్లాన్ చేస్తున్నారట.
సెప్టెంబర్ 23న ప్రభాస్ బర్త్‌డే అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన బర్త్‌డే కానుకగా టీజర్‌ను వదలాలని సలార్ టీమ్ నిర్ణయించారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన సైతం రానుందని అంటున్నారు. ఇదే నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయం అవుతుంది.
https://newsorbit.com/cinema/prabhas-about-salaar-movie.html
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!