NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu February 10 2024 Episode 996: అప్పు పేరుతో శైలేంద్ర వేసిన ప్లానును వసుధార ఎలా ఎదుర్కొంటుంది.

Guppedantha Manasu Today Episode February 10 2024 Episode 996 Highlights

Guppedantha Manasu February 10 2024 Episode 996: మహేంద్ర అనుపమ ఇద్దరూ ఇంటికి వస్తారు. అనుపమ చూసావా మహేంద్ర వసుధారని చూడు ఎంతగా బాధపడుతుందో చాలా నిరసించి పోయింది. నేను వంట చేసి టేబుల్ మీద పెట్టాను నువ్వు వెళ్లి వసుధారకు నచ్చచెప్పి భోజనానికి తీసుకుని రా మహేంద్ర అని అంటుంది. మహేంద్ర వసుధార దగ్గరికి వెళ్లి తన పక్కన కూర్చొని మనసులో అమ్మ వసుధారా రిషి లేడని విషయాన్ని నేనే జీర్ణించుకోలేకపోతున్నాను కానీ నువ్వు మాత్రం ఎలా తట్టుకోగలుగుతావు నాకు నేనే నచ్చ చెప్పుకోలేక పోతున్నాను కానీ నిన్ను చూస్తుంటే నీ బాధ కింద నా బాధ తక్కువే అనిపిస్తుంది అందుకే నిన్ను ఎలాగైనా ఈ బాధ నుండి బయటికి తీసుకురావాలి అది మామగారు నా బాధ్యత అనుకొని అమ్మ వసుధార భోజనం చేద్దాం పదమ్మ అని అంటాడు.వసుధార వద్దు మామయ్య నాకు ఆకలిగా లేదు మీరు వెళ్లి తినండి అని అంటుంది. మహేంద్ర అదేంటమ్మా నువ్వు లేకుండా మేము ఎలా తినగలుగుతాం చెప్పు అందుకే అందరం కలిసి తిందాం పదమ్మ అని అంటాడు. వసుధార లేదు మామయ్య నాకు ఆకలిగా లేదు మీరు వెళ్ళండి అని అంటుంది.

Guppedantha Manasu Today Episode February 10 2024 Episode 996 Highlights
Guppedantha Manasu Today Episode February 10 2024 Episode 996 Highlights

అనుపమ అదేంటి వసుధారా అలా మాట్లాడితే ఎలా చెప్పు ఇప్పటికే నువ్వు చాలా నీరసించి పోయావు ఎలా ఉన్నావు ఒకసారి చూసుకో అందరేమో రిషి చనిపోయాడు అని అంటున్నారు కానీ నువ్వు మాత్రం రిషి బ్రతికే ఉన్నాడు అని చెబుతున్నావ్ నువ్వు ఇలా తినకుండా ఉంటే ఎక్కడ ఉన్న రిషికి బాధ అనిపించదా అలాగే నువ్వు ఇలా ధైర్యం కోల్పోయి కూర్చుంటే రాబందు లాంటి ఆ శైలేంద్ర గోతి కాడి నక్కలాగా ఆ రాజు నువ్వు ఎప్పుడు దొరుకుతావా అంటూ నిన్ను దెబ్బ కొట్టడానికి వాళ్లు ఎంతకైనా తెగిస్తారు మరి అలాంటి వాళ్లకి నువ్వు ఇలా తిండి తిప్పలు మానేసి కూర్చుంటే ఎలా సమాధానం చెప్పగలుగుతావు వసుధారా అందుకే నేను చెబుతున్నాను కదా రిషి బ్రతికే ఉండే ఇంటికి తిరిగి వస్తాడు లేదంటే నువ్వు ఈ నిజాన్ని నువ్వు నమ్మి తీరాలి కాబట్టి నీ మాట ప్రకారమే మేము రిషి ఉన్నాడు అని అనుకుంటాము రిషి బ్రతికే ఉంటే కచ్చితంగా నీకోసం తిరిగి వస్తాడు నువ్వు అప్పటివరకు జాగ్రత్తగా ఉండాలి కదా పద అందరం కలిసి భోజనం చేద్దాం అని అంటుంది. మహేంద్ర కింద పడి ఉన్న పూలదండను చూసి అమ్మ వసుధార ఇంటికి ఎవరైనా వచ్చారా ఆ పూల దండ ఏంటి అని అడుగుతాడు. వసుధార అవును మామయ్య వచ్చారు అని అంటుంది. మహేంద్ర ఎవరమ్మా వచ్చింది అని అడుగుతాడు. వసుధారా తండ్రి చక్రపాణి వచ్చాడు బావగారు ఒక దుర్మార్గుడు వచ్చాడు వాడు ఎవడంటే రాజువ్ వసుధారణ మళ్లీ నీకు నేను తోడుగా ఉంటాను అని వాడు చాలా పిచ్చి పిచ్చి వాగుడు వాగి వెళ్ళాడు బావగారు అని చెబుతాడు.

Guppedantha Manasu Today Episode February 10 2024 Episode 996 Highlights
Guppedantha Manasu Today Episode February 10 2024 Episode 996 Highlights

కట్ చేస్తే రాజీవ్ శైలేంద్ర సీక్రెట్ గా ఒక దగ్గర కలుసుకొని మాట్లాడుకుంటారు. శైలేంద్ర ఏంటి రాజువ్ నువ్వు అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆ వసుధార దగ్గరికి వెళ్ళదు నువ్వు కొన్నాళ్లు అండర్ గ్రౌండ్ లో ఉండు అని చెప్పాను కదా అంటాడు. రాజీవ్ అలా ఎలా ఉండగలుగుతాను బ్రో నా మరదలు భర్త చనిపోయాడు అంటే నాకు మాత్రం సంతోషంగా ఉండదా మరి తనను ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఎదురుచూస్తున్న నాకు ఇది చాలా మంచి అవకాశం కాదా ఏంటి అందుకే నా మరదల్ని పలకరించి అలాగే తనకి కొంచెం దగ్గరవుదామని వెళ్లాను కానీ వర్క్ అవుట్ అవ్వలేదు మా మామగాడు నా మరదలు పిల్ల చాలా కోపంగా నన్ను తిట్టి పంపించేశారు అని అంటాడు. శైలేంద్ర చాలా సంతోషం ఏడ్చావులె గాని ఇంకాసేపు ఉంటే లాగిపెట్టి కొట్టేది వసుధారా అని అంటాడు. రాజీవ్ అంత సీన్ లేదులే బ్రో సరే కొడితే కొట్టని ఎందుకంటే నా మరదలే కదా తనను తగ్గించుకోవడానికి నేను ఎన్ని దెబ్బలైనా తింటాను తనకి రిషి మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పదో నాకు నా మరదలు పిల్ల మీద ఉన్న ప్రేమ అంతకంటే గొప్పది అందుకే భరిస్తాను అని అంటాడు. శైలేంద్ర మనసులో ఒరేయ్ వెధవ అది ప్రేమ కాదురా కామం నీకు వసుధార మీద ఉన్నది కామం అని అనుకుంటాడు మనసులో.రాజువ్ సరే బ్రో నేను వెళతాను నువ్వు చెప్పినట్లే ఇక బయటికి రాను కానీ పొరపాటున నీ ఎండి సీటు కోసం నా మరదలుకి ఏదైనా అపాయం తలపెట్టాలని చూసావనుకో నేను నిన్ను చంపడానికైనా వెనకాడను బ్రో ఓకేనా అది గుర్తుపెట్టుకుని చాలా జాగ్రత్తగా డీల్ చేసి నీ ఎండి సీటు నువ్వు త్వరగా తీసేసుకొని నా మరదలు పిల్లని ఆ కాలేజీ నుంచి బయటికి వచ్చేలా చేస్తే నేను పువ్వుల్లో పెట్టి నా ఇంటికి తీసుకువెళ్లి పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. శైలేంద్ర అలాగే బ్రో నువ్వు చెప్పినట్లే చేస్తాను నీ మరదలికి ఎలాంటి అపాయం తలపెట్టను ఇక నువ్వు బయలుదేరు ఎప్పటికీ బయటికి రాకు అని అంటాడు.

Guppedantha Manasu Today Episode February 10 2024 Episode 996 Highlights
Guppedantha Manasu Today Episode February 10 2024 Episode 996 Highlights

కట్ చేస్తే వసుధార కాలేజీకి వస్తుంది ఎవరు గుర్తు తెలియని వాళ్ళు బ్యాంక్ ఎంప్లాయర్స్ కాలేజీకి వస్తారు. వసుధారా ఎవరండీ మీరు చెప్పండి ఏం కావాలి అని అడుగుతుంది. వాళ్లు మేడం నా పేరు ప్రమోద్ ఇతని పేరు లక్ష్మణ్ అని చెబుతారు. వసుధార ఓకే కూర్చోండి చెప్పండి ఏ పని మీద వచ్చారు అని అడుగుతుంది. ప్రమోద్ మేడం రిషి సార్ కి అలా జరగడం మేము నమ్మలేకపోతున్నాం మేడం అని అంటాడు.వసుధార ఏంటండీ ఏం జరిగింది అలా మాట్లాడుతున్నారు అని అంటుంది.ప్రమోద్ అదే మేడం రిషి సార్ చనిపోయారని తెలిసింది అని అంటాడు. వసుధర లేదండి సార్ చనిపోలేదు మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని అంటుంది. లక్ష్మణ్ లేదు మేడం మేము పక్కాగా తెలుసుకుని వచ్చాము కొన్నాళ్ల ముందు రిషి సార్ మా దగ్గరికి వచ్చి కాలేజీ నడవడం చాలా కష్టంగా ఉంది నలబై కోట్లు మనీ కావాలి అని మమ్మల్ని అడిగారు అంత పెద్ద మనిషి మా దగ్గరికి వచ్చి డబ్బు అడగడంతో మేము కాదనలేకపోయాం పక్క ప్రూఫ్ లు పెట్టుకొని రిషి సార్ కి అప్పు ఇచ్చాము ఇదిగోండి ఈ డాక్యుమెంట్స్ చూడండి అని ఇస్తాడు. వసుధార ఆ డాక్యుమెంట్స్ ని చూసి లేదు ఇది నేను నమ్మలేను ఇది అబద్ధం సార్ అలా చెయ్యరు అని అంటుంది. ప్రమోద్ లేదు మేడం రిషి సారే మా దగ్గరకు వచ్చి అప్పు తీసుకున్నారు మీ ముందే ప్రూఫ్ లు ఉన్నాయి కదా ఇంకా నమ్మను అంటారేంటి అని అంటాడు.

Guppedantha Manasu Today Episode February 10 2024 Episode 996 Highlights
Guppedantha Manasu Today Episode February 10 2024 Episode 996 Highlights

వస్తదారా ప్రూఫ్ లు ఇలాంటివి ఎన్నో పుట్టించొచ్చు అలా అని సార్ మీ దగ్గర అంత డబ్బు తీసుకున్నారు అంటే నేను నమ్మను అంటుంది.లక్ష్మణ్ లేదు మేడం మా పరిస్థితి ఏమీ బాగోలేదు ఇప్పుడు మాకు మా డబ్బులు కావాలి ఎలాగైనా మీరు ఆ డబ్బులు ఇప్పించగలిగితే వెళ్ళిపోతాం లేదంటే కాలేజీని మా ఆధీనంలోకి తీసుకుంటాం అని అంటాడు. వసుధార నేను తర్వాత మాట్లాడతాను మీరు వెళ్ళండి అని అంటుంది. ప్రమోద్ సరే మేడం మీరు ఇప్పుడే కాలేజ్ బోర్డ్ మీటింగ్ ఏర్పాటు చేయండి అని అంటాడు. వసుధార సరే మీరు వెళ్ళండి నేను తర్వాత పిలుస్తాను అని అంటుంది.వాళ్లు వెళ్లిపోతారు వసుధార మహేంద్ర కు ఫోన్ చేస్తుంది. మహేంద్ర హలో ఏంటమ్మా వసుధార చెప్పు అని అంటాడు. వసుధార మామయ్య మీరు ఎక్కడున్నారు త్వరగా కాలేజీకి రండి అనుపమ మేడం మీరు ఇద్దరు త్వరగా కాలేజీకి రండి అని అంటుంది.

Guppedantha Manasu Today Episode February 10 2024 Episode 996 Highlights
Guppedantha Manasu Today Episode February 10 2024 Episode 996 Highlights

మహేంద్ర ఎందుకమ్మా ఏం జరిగింది అని అంటాడు. వసుధార మామయ్య ఎవరో ఇద్దరు వచ్చి రిషి సార్ వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నారు అని ఏవో ప్రూఫులు చూపిస్తున్నారు. నేను అది అబద్ధమని నేను చెప్పాను కానీ వాళ్ళు మాకు ఇప్పుడు డబ్బు కావాల్సిందే మీరు బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయండి అని వాళ్ళు బయటే ఉన్నారు మామయ్య అని చెబుతుంది. మహేంద్ర అలాగే అమ్మ నేను ఎప్పుడె బయలుదేరి వస్తున్నాను అంటూ మహేంద్ర కాలేజీకి వస్తాడు. బోర్డు మీటింగ్ ఏర్పాటు చేశారు బోర్డ్ మెంబర్స్ అందరూ ఆ ఫైల్స్ చూసి అవును ఇది రిషి సార్ సంతకాలె ఇవి సార్ అలా చేయడం ఏంటి సార్ నిజంగానే డబ్బు తీసుకున్నట్లు ఈ ప్రూఫ్ లు ఉన్నాయి అని అంటారు. మహేంద్ర లేదు రిషి ఎప్పటికీ అలా చేయడు. రిషి కి ఈ కాలేజ్ అంటే ప్రాణం తన ప్రాణమైన వదులుకుంటాడు కానీ కాలేజీని మాత్రం తాకట్టుపెట్టడు కాలేజీలో కొన్ని వేల మంది పిల్లల భవిష్యత్తు దాగి ఉంది అలాంటి భవిష్యత్తును నా కొడుకు ఎప్పటికీ తాకట్టు పెట్టడు డబ్బు తీసుకోలేదు ఇవి ఇలాంటి ప్రూఫ్ లు ఎన్నైనా పుట్టించొచ్చు కానీ మా రిషి డబ్బు తీసుకోలేదు ఇవన్నీ ఫేక్ అని అంటాడు.ప్రమోద్ ప్లీజ్ సర్ మీరు డబ్బు కట్టకపోతే మేము కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది అని అంటాడు. మహేంద్ర వెళ్లండి మేము కూడా కోర్టులోనే తేల్చుకుంటాం అని అంటాడు

Related posts

Operation Valentine: వరుణ్ తేజ్ “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా చిరంజీవి..!!

sekhar

టాలీవుడ్ డైరెక్ట‌ర్ వీఎన్‌. ఆదిత్య‌కు అమెరికా జార్జ్ వాషింగ్ట‌న్ వ‌ర్సిటీ గౌర‌వ డాక్ట‌రేట్‌..!

Saranya Koduri

Bhimaa Trailer: మాస్…యాక్షన్…డివోషనల్ తరహాలో గోపీచంద్ “భీమా” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Naga Panchami February 24 2024 Episode 288: భార్గవ్ కి వరుణ్ కి విడాకులు ఇస్తామంటున్న జ్వాలా చిత్ర..

siddhu

Mamagaru February 24 2024 Episode 144: గంగకి నిజం చెప్పిన గంగాధర్, ఇంట్లో వాళ్లకి నిజం చెప్పేస్తా అంటున్న సిరి..

siddhu

Kumkuma Puvvu February 24 2024 Episode  2113: అంజలికి శాంభవి నిజస్వరూపం తెలియనుందా లేదా.

siddhu

Mahesh Babu: మహేష్ పై కన్నేసిన బందర్ నాని.. అరే ఏంట్రా ఇదీ..!

Saranya Koduri

Madhuranagarilo February 24 2024 Episode 296: రాధకి శ్యామ్ కి శోభనం జరగకుండాద ని రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Malli Nindu Jabili February 24 2024 Episode 581: నా భర్తను చంపిన ఈ చేతులతోటే నన్ను చంపేయండి అంటున్నాం మాలిని..

siddhu

Guppedantha Manasu February 24 2024 Episode 1008: రవీంద్ర మహేంద్ర తో చెప్పబోతున్న సీక్రెట్ ఏంటి.

siddhu

Jagadhatri February 24 2024 Episode 162: యువరాజుని అరెస్టు చేసిన జగదాత్రి, కేదార్ సుధాకర్ కొడుకుని తెలిసిన వైజయంతి ఏం చేయనున్నది..

siddhu

Vijay devarakonda: ఫ్యాన్ గర్ల్ మూమెంట్..విజయ్ రాకతో షాక్ అయినా ఆశిష్ వైఫ్.. వీడియో…!

Saranya Koduri

Trinayani February 24 2024 Episode 1172: ఉలోచిని కాటు వేసిన పెద్ద బొట్టమ్మ, ఉలొచిని నైని కాపాడుతుందా లేదా?..

siddhu

Paluke Bangaramayenaa February 24 2024 Episode 160: సెక్షన్ల గురించి మాట్లాడి లాయర్ ని బెదిరించిన స్వరా, వైజయంతిని చూసి షాక్ అయిన విశాల్…

siddhu