NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu January 09 2024 Episode 968: రిషి వసుధార దగ్గరే ఉన్నాడని భద్ర కు తెలుస్తుందా లేదా.

Guppedantha Manasu Today Episode  January 09 2024 Episode 968 Highlights

Guppedantha Manasu January 09 2024 Episode 968:మహేంద్ర ఏమో అమ్మ ఆ భద్ర కి ఎలా తెలిసిందో నేను కనుక్కుంటాను నువ్వు ఏమి టెన్షన్ పడకు అంటాడు మహేంద్ర. వసుధార అలాగే మామయ్య అంటుంది.
వసుధార తండ్రి అదేంటమ్మా వసుధారా అతన్ని ఎందుకు అలా బెదిరించావు అని అడుగుతాడు. వసుధార అవును నాన్న ఇప్పుడు మేమున్న పరిస్థితిలో ఎవరికి మేము ఇక్కడ ఉంటున్నామని నిజం తెలియకూడదు అలా తెలిస్తే నాకంటే ఎక్కువ రిషి సార్ కి ప్రమాదం పొంచి ఉంది అందుకే నేను ఎవరిని నమ్మడం లేదు అని అంటుంది. భద్ర ఇంటికి వెళతాడు. మహేంద్ర భద్రని చూసి ఏ భద్ర నువ్వు ఎక్కడికి వెళ్లావు ఎక్కడినుంచి వస్తున్నావ్ అని కాలర్ పట్టుకుని అడుగుతాడు మహేంద్ర. భద్ర అదేంటి సార్ నేను ఎక్కడికి వెళ్తాను మీరు ఎందుకు అలా అడుగుతున్నారు అని అంటాడు భద్ర.

Guppedantha Manasu Today Episode  January 09 2024 Episode 968 Highlights
Guppedantha Manasu Today Episode  January 09 2024 Episode 968 Highlights

మహేంద్ర నేను అడిగిందానికి సూటిగా సమాధానం చెప్పు నువ్వు ఎక్కడికి వెళ్లావు? ఎక్కడినుండి వస్తున్నావు చెప్తావా లేదా అని గట్టిగా అడుగుతాడు.భద్ర అవును సార్ నేను వసుధారం మేడం దగ్గరికి వెళ్లాను అక్కడి నుండే వస్తున్నాను అని చెబుతాడు. మహేంద్ర నీకు వసుధారా అక్కడ ఉందని ఎలా తెలుసు ఎవరు చెప్పారు చెప్తావా లేదాఅని అడుగుతాడు మహేంద్ర భద్ర అదేం ప్రశ్న సార్ నన్ను వస్తాను కార్ డ్రైవర్ గా పెట్టారు మరి అలాంటప్పుడు మేడం ఎక్కడికి వెళ్లారు ఏం చేస్తున్నారు అనేది నాకు పట్టి ఉండదా చెప్పండి మేడం కనిపించడం లేదని టెన్షన్లో వెతుక్కుంటూ వెళ్లాను అంటాడు.

Guppedantha Manasu Today Episode  January 09 2024 Episode 968 Highlights
Guppedantha Manasu Today Episode  January 09 2024 Episode 968 Highlights

మహేంద్ర నువ్వు అబద్దం చెబుతున్నావ్ భద్ర చెప్పు నిజం చెబుతావా లేదా అని అడుగుతాడు. భద్ర నాకు కాలేజీలో అందరూ అనుకుంటుంటే తెలిసింది సార్ అందుకే వెళ్లాను అని చెబుతాడు భద్ర. మహేంద్ర అంతేనా ఇంకేమైనా అబద్ధం ఆడుతున్నావా అని అడుగుతాడు మహేంద్ర. భద్ర ఏంటి సర్ మీరు నన్ను అనుమానిస్తున్నారా నన్ను అనుమానించిన చోట ఒక్క క్షణం కూడా ఉండను అని మీకు ముందే చెప్పాను కదా చెప్పండి మీరు నన్ను అనుమానిస్తున్నారా అని అడుగుతాడు. మహేంద్ర అదేం లేదు భద్ర నీకు వసుధార విషయం ఎలా తెలిసిందా అని అడుగుతున్నాను అంతే ఇవన్నీ ఏమి మనసులో పెట్టుకోకు వెళ్లి పని చేసుకోకు అంటాడు.

Guppedantha Manasu Today Episode  January 09 2024 Episode 968 Highlights
Guppedantha Manasu Today Episode  January 09 2024 Episode 968 Highlights

కట్ చేస్తే ధరణి ఈ వసుధార కనిపించకుండా పోయింది అని అన్నారు కానీ ఇప్పుడు వాళ్ళ నాన్న ఇంటి దగ్గర ఉందని మామయ్య గారు చెబుతున్నారు నేను ఒకసారి వెళ్లి అక్కడ ఉన్న వసుధారను చూసి వస్తే బాగుంటుంది ఒకవేళ రిషి కూడా అక్కడే ఉన్నాడేమో ఒకవేళ రిషి ఉంటే రిషి ని కూడా చూడక చాలా రోజులు అవుతుంది పాపం ఈ నా మొగుడు శైలేంద్ర ఏ ముహూర్తాన ఈ ఇంట్లో కాలు పెట్టాడో గాని రిషి ఇంటికి దూరమై పోయాడు కుటుంబం విడిపోయింది ఎవరికి వాళ్ళు బ్రతికేలా అయిపోయింది నా భర్త శైలేంద్ర వల్ల రిషి ఎన్ని బాధలు పడుతున్నాడో ఇప్పుడు అసలు రిషి ఎలా ఉన్నాడో ఏంటో ఒకసారి వెళ్లి వస్తే బాగుంటుంది అని అనుకొని ధరణి మహేంద్ర వాళ్ల ఇంటికి వెళుతూ ఉంటుంది. శైలేంద్ర ఏంటి ఈ ధరణి ఎన్నడూ లేనిది తను ఒక్కతే అది ఏమి తీసుకోకుండా చేతులో ఎలాంటి క్యారీ బ్యాగ్ లేకుండా ఊపుకుంటూ వెళ్తుంది ఎటు వెళ్తుంది తనను ఫాలో అవ్వాలి తను ఎటు వెళ్తుందో తెలుసుకోవాలి అనుకుంటూ శైలేంద్ర ధరణి వెనకాలే ఫాలో అవుతూ వెళతాడు.

Guppedantha Manasu Today Episode  January 09 2024 Episode 968 Highlights
Guppedantha Manasu Today Episode  January 09 2024 Episode 968 Highlights

కట్ చేస్తే భద్ర ధరణిని చూసి రండి మేడం ఏంటి ఇలా వచ్చారు ఏం తీసుకుంటారు కాఫీ టీ అని అడుగుతాడు. ధరణి నాకు అంత తీరిక లేదు నీకు అంత తీరిగ్గా ఉంటే నువ్వే తాగు ఆ కాఫీ టీ అంటూ ఇంట్లోకి వెళ్లి మామయ్య గారు చిన్న మామయ్య గారు ఎక్కడున్నారు ఒకసారి ఇలా రండి అని పిలుస్తుంది.భద్ర మేడం మహేంద్ర సార్ ఇంట్లో లేరు తన ఫోటో వెళ్లారు అని చెబుతాడు.ధరణి అవునా చిన్న మామయ్య ఎటు వెళ్లారు నీకు ఏమైనా తెలుసా అని అడుగుతుంది. భద్ర ఏమో తెలీదు మేడం బయటికి వెళ్లారు అంతే అని చెబుతాడు భద్ర అవును మేడమ్ మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతాడు.ధరణి ఏమీ లేదు వసుధర వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్దామని వచ్చాను నాకు వల్ల ఇంటి అడ్రస్ తెలీదు అందుకే చిన్న మామయ్యను అడిగి తెలుసుకుందామని వచ్చాను అని చెబుతుంది. భద్ర నాకు అడ్రస్ తెలుసు అని చెబితే ధరణి మేడే డౌట్ పడుతుందేమో వద్దు ఎందుకు తను అడగక ముందుకి నేను ఎందుకు చెప్పాలి చెప్పొద్దు అని ఆగిపోతాడు భద్ర. ధరణి సరే భద్ర చిన్న మామయ్య వచ్చాక నేను వచ్చి వెళ్ళాను అని చెప్పు అని చెబుతుంది. భద్ర అలాగే మేడం చెబుతాను అంటాడు. ధరణి ఏమండీ మీరు నా వెనకాలే నన్ను ఫాలో అవుతూ వచ్చారని నాకు తెలుసు మీరు ఎంతసేపని అలా దొంగలాగా ఆ గదిలోనే ఉంటారు డోర్ తీసి బయటికి వచ్చేయండి అంటుంది శైలేంద్రను. శైలేంద్ర ఈ ధరణి నన్ను కనిపెట్టినట్టుంది అనుకుంటూ బయటికి వస్తాడు అదేంటి ధరణి నువ్వు ఎప్పుడు వచ్చావు అని ఏమీ తెలియనట్లు అడుగుతాడు. ధరణి ఏంటండీ మీ ఆటలు నా దగ్గరే చూపిస్తున్నారా మీరు నన్ను ఫాలో అవుతూ నా వెనకాల వచ్చారని నాకు తెలుసు కానీ ఏం చేయను పెద్ద మామయ్య గారిమో నువ్వు ఎటు వెళ్తున్నావు నువ్వు ఎలా ఉంటున్నావు నిన్ను కనిపెట్టమని నాకు పని అప్పు చెప్పాడు ఎందుకు మామయ్య గారు నేను అడిగితే లేదమ్మా ఆ శైలేంద్ర ఒక ముద్దు ఒక వెధవ ఒక పనికిరాని సన్నాసి తను చదువుకున్నా సన్నాసి తన బుర్రలో బ్రెయిన్ లేదు తను ఇలాంటి చెడ్డ పనులు చేయకుండా చూసుకోమని చెప్పారు.కానీ నువ్వే నన్ను ఫాలో అవుతూ ఉన్నావని మామయ్య గారికి చెప్పేయమంటారా అని అంటుంది ధరణి.

Guppedantha Manasu Today Episode  January 09 2024 Episode 968 Highlights
Guppedantha Manasu Today Episode  January 09 2024 Episode 968 Highlights

శైలేంద్ర చూడు ధరణినేనేమీ నిన్ను ఫాలో అవుతూ రాలేదు నేను క్యాజువల్ గా వచ్చాను అంతే అంటాడు.సరే ఇంటికి వెళ్దాం రండి అంటుంది శైలేంద్ర కోపంగా చూస్తాడు అదేంటండి అంత కోపంగా చూస్తున్నారు అసలు మిమ్మల్ని కోపంగా చూడాల్సింది నేను ఎందుకంటే నాకు తెలియకుండా నన్ను ఫాలో అవుతూ ఇక్కడ వరకు వచ్చారు కదా మీరు ఎందుకు వచ్చారు అని మీకెళ్ళి నేను చూడాలి అలా కోపంగా కానీ మీరే నన్ను బెదిరిస్తూ చూస్తున్నారు సరే ఈ విషయం అంతా పెద్ద మామయ్య గారికి చెప్పేస్తాను అని అంటుంది ధరణి. శైలేంద్ర చూడు ధరణి నువ్వు ఈ విషయం నాన్నగారికి చెప్పకు నేను క్యాజువల్ గానే చూస్తున్నాను నీ వైపు కోపంగా ఏమీ చూడటం లేదు సరేనా అంటూ శైలేంద్ర తన కోపాన్ని దిగమింగుకుంటూ ధరణి చెప్పినట్లుగా తన వెంట వెళ్ళిపోతాడు శైలేంద్ర. భద్ర శైలేంద్ర సార్ ఏంటి నాతో ఏమైనా మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాడా ధరణి మేడమ్ ని చూసి నాతో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారా ఏంటి లేదంటే నిజంగానే మేడంని ఫాలో అవుతూ తన వెనుకాలే వచ్చారా? ఏమీ అర్థం కావడం లేదే అని అనుకుంటాడు భద్ర.

 

 

Related posts

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Pushpa 2 lyrical Video Response: 24 గంటల్లోనే యూట్యూబ్ ను మోత మోగిస్తున్న పుష్ప రాజ్.. ఏకంగా అన్ని దేశాల్లో ట్రెండింగ్..!

Saranya Koduri

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 4th 2024 Episode: కొడుకును ఈడ్చి కొట్టిన అనసూయ.. కార్తీక్‌, దీపకి అక్రమ సంబంధం అంటూ నీచంగా మాట్లాడిన నరసింహ..!

Saranya Koduri

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Mamagaru: గంగాధర్ ని ఆ పొజిషన్లో చూసి గంగను తిట్టిన చంగయ్య..

siddhu

Brahmamudi May 4 2024 Episode 401:రుద్రాణి నే బురిడీ కొట్టించి కోటి కాజేసిన స్వప్న.. రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ అని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Naga Panchami: సిద్ధాంతి గారు చెప్పినట్లుగా పంచమి జ్వాలా మధ్యలో గొడవలు మొదలవుతాయా లేదా.

siddhu

Nuvvu Nenu Prema May 4 Episode 615 :అరవింద సమక్షంలో దండలు మార్చుకున్న విక్కీ పద్మావతి.. కృష్ణ నిజస్వరూపం అరవింద కు తెలియనుందా?

bharani jella