NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili January 09 2024 Episode 542: మల్లి కి ఇవ్వమని మీరాకి డబ్బులు ఇస్తున్న అరవింద్,మల్లి చూసి టెన్షన్ పడుతున్న ప్రీతి..

Malli Nindu Jabili Today Episode January 09 2024 Episode 542 Highlights

Malli Nindu Jabili January 09 2024 Episode 542: అన్నయ్య కానీ అమ్మ గాని ఎవరిని బాధ పెట్టింది లేదు కానీ నేను చాలా బాధ పెడుతున్నారు నేను అర్థం చేసుకున్నట్టు అన్నయ్య అమ్మ ఎప్పుడు నిన్ను అర్థం చేసుకుంటారొ ఇంకా ఎన్ని మాటలు పడాల్సి ఉంటుందో అని నీలిమ అంటుంది. నేను తప్పు చేశాను అని అంటున్నారు ఆ ఆనందానికి నన్ను తిట్టడం లేదు కదా మీ అన్నయ్య నాకు చూపించిన జీవితంతో పోల్చుకుంటే ఇవేమీ పెద్దవి కాదు ఇన్ని రోజులు ఆయన చూపించిన ప్రేమ ముందు ఈ ద్వేషం చాలా చిన్నదిగా కనపడుతుంది అని మల్లి జ్యూస్ చేసుకుని తీసుకువెళ్తుంది. కట్ చేస్తే, జ్యూస్ తీసుకోండి అని మల్లి గౌతమ్ కి ఇస్తుంది. గౌతమ్ కోపంగా చూస్తాడు. మీ రుణం ఇలాగైనా తీర్చుకుంటున్నాను అని అనుకుంటున్నాను అలాగనే మన మధ్య ఉన్నది రుణానుబంధం కాదు నాకు నా క్వాలిఫికేషన్ తో ఎలాగైనా జాబ్ సంపాదించి మిమ్మల్ని బాగా చూసుకుంటాను అని మల్లి వెళ్ళిపోతుంది.

Malli Nindu Jabili Today Episode January 09 2024 Episode 542 Highlights
Malli Nindu Jabili Today Episode January 09 2024 Episode 542 Highlights

దాని మాటలకేం కానీ నువ్వు జ్యూస్ తాగు అని కౌసల్య అంటుంది. కట్ చేస్తే, మల్లి ప్రీతి దగ్గరికి వస్తుంది. ఏంటి మేడం ఇలా వచ్చారు అని ప్రీతి అంటుంది. మినిస్టర్ ధర్మారావు గారి మీద ప్రింట్ అయిన ఆ పేపర్ వల్ల మా జీవితాలు తారుమారు అయిపోయాయి అని మల్లి అంటుంది.ఆ విషయంలో నా మీద మీకు డౌట్ ఉండొచ్చు కానీ నేనేమీ చేయలేదు మేడం అని ప్రతి అంటుంది. నేను ఆ విషయం మాట్లాడడానికి రాలేదు పర్సనల్ విషయాలు మాట్లాడదామని వచ్చాను ఇంతకాలం నా భర్త సంపాదనతో కూర్చొని తిన్నాను ఇప్పుడు నా జీతంతొ ఇల్లు గడిచే  పరిస్థితి వచ్చింది ఎందుకంటే నా భర్తకి యాక్సిడెంట్ అయింది అని మల్లి అంటుంది. గౌతమ్ సార్ కి యాక్సిడెంట్ అయింది ఎప్పుడు జరిగింది మేడం ఇప్పుడు ఎలా ఉన్నారు గౌతమ్ సార్ అని ప్రీతి అంటుంది.

Malli Nindu Jabili Today Episode January 09 2024 Episode 542 Highlights
Malli Nindu Jabili Today Episode January 09 2024 Episode 542 Highlights

అయినా నడవలేని పరిస్థితిలో ఉన్నారు నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే జాబ్ కోసం రిక్వెస్ట్ చేయవా అని మల్లి అంటుంది. తప్పకుండా మేడం మీకు జాబ్ వచ్చేలా చేస్తాను అని ప్రీతి అంటుంది. మల్లి వెళ్ళగానే ప్రీతి వసుంధర కి ఫోన్ చేసి మల్లి మేడం నా దగ్గరికి వచ్చింది ఏదైనా జాబ్ ఇప్పించమని నాకు చెప్పింది అని ప్రీతి అంటుంది. మొగుడు వీల్ చేరుకు పరితమయ్యాడు కదా అందుకని జాబ్ కోసం గడపగడప ఎక్కుతుందన్నమాట అని వసుంధర నవ్వుతుంది. పాపం మేడం అలా వెళ్తూ ఉంటే నాకు జాలి అనిపించింది అని ప్రీతీ అంటుంది. వాళ్లకు సంబంధించిన విషయాలు ఇలాగే నాకు ఫోన్ చేసి చెప్తూ ఉండు అని వసుంధర అంటుంది. అలాగే మేడం అని ప్రీతి ఫోన్ కట్ చేయగానే మల్లి ఎదురుగా నిలబడుతుంది. మల్లి నీ చూసిన ప్రీతి ఈవిడ మళ్లీ వచ్చింది తొందరపడి మేడమ్ కి ఫోన్ చేశానా అని టెన్షన్ తొ భయపడుతుంది. మల్లి ప్రీతి దగ్గరికి వచ్చి మినిస్టర్  ధర్మారావు గారి గురించి ప్రింట్  అయినా దాని గురించి ఏదైనా ఆధారాలు దొరికితే నాకు ఫోన్ చెయ్ ఈ విషయం చెప్పడానికి వచ్చి వెళ్ళిపోయాను అని మల్లి వెళ్ళిపోతుంది. హమ్మయ్య అని ప్రీతి ఊపిరి పీల్చుకుంటుంది.

Malli Nindu Jabili Today Episode January 09 2024 Episode 542 Highlights
Malli Nindu Jabili Today Episode January 09 2024 Episode 542 Highlights

కట్ చేస్తే, ఒకతను వచ్చి అరవింద్ కి డబ్బు ఇచ్చి వెళ్లిపోతాడు. అరవింద్ డబ్బు తీసుకోవడం చూసి మాలిని తన వెనుకాల ఫాలో అవుతుంది. డబ్బులు తీసుకొని అరవింద్ మీరా దగ్గరికి వెళ్లి, అత్తయ్య నేను డబ్బు ఇస్తే మల్లి వద్దని నన్ను అనరాని మాటలు అంటుంది అందుకే మీరు వెళ్లి ఆ డబ్బు ఇచ్చేసి రండి తనకు నా మీద కోపం ఉండొచ్చు కానీ నాకు తనమీద ఎప్పటికీ ప్రేమే ఉంటుంది  అని అరవింద్ అంటాడు.నా కూతురు అన్న మాటలు మనసులో పెట్టుకోకుండా వాళ్ళ కుటుంబానికి సహాయం చేస్తున్నారు చాలు బాబు అని మీరా కన్నీళ్లు పెట్టుకుంటుంది.నేను ఎంత చెప్పినా నువ్వు వినవ కానీ అరవింద్ చూడు ఏం చేస్తున్నాడు మీ డాడీ నేమో తల్లి తంనుకుపోయింది అరవింద్ నేమో తన కూతురు తనకు పోవాలనుకుంటుంది ఇప్పట్లో వాళ్లని వదిలించుకోవడం కుదరదేమో మాలిని ముందు ముందు నీ కాపురం ఎలా ఉంటుందో అని వసుంధర వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, అరవింద్ ఎక్కడికి వెళ్లావు అని మాలిని అడుగుతుంది.

Malli Nindu Jabili Today Episode January 09 2024 Episode 542 Highlights
Malli Nindu Jabili Today Episode January 09 2024 Episode 542 Highlights

తెలిసిన ఫ్రెండ్ వస్తే మాట్లాడడానికి వెళ్లాను అని అరవింద్ అంటాడు. నిజమా అని మాలిని అంటుంది. అవును నువ్వు రెస్ట్ తీసుకో అని అరవింద్ అంటాడు. మాలిని అబద్ధం చెప్పాడని ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే, మల్లి దేవుడికి దండం పెట్టుకొని ఈ ఉద్యోగం నాకు చాలా అవసరం నా కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి ఎలాగైనా సరే నాకు ఉద్యోగం దొరికేలా చేయి తండ్రి అని మల్లి భగవంతుడికి దండం పెట్టుకుంటుంది. ఏమండీ నేను జాబుకు వెళ్తున్నాను నన్ను ఆశీర్వదించండి అని మల్లి అంటుంది. ఇప్పుడు వీల్ చైర్ లో కూర్చున్నాను శాశ్వతంగా మంచంలో పడుకోబెట్టాలి అనుకుంటున్నావా కాళ్ల దగ్గర నిలబడ్డావు అని గౌతమ్ కోపంగా అంటాడు. నేను జాబ్ కోసం వెళ్తున్నానండి నన్ను ఆశీర్వదించమని నిలబడ్డాను అలా ఎందుకు చేస్తాను అని మల్లి అంటుంది.

Malli Nindu Jabili Today Episode January 09 2024 Episode 542 Highlights
Malli Nindu Jabili Today Episode January 09 2024 Episode 542 Highlights

నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇకనుంచి వెళ్ళిపో అని గౌతమ్ కోపంగా ఉంటాడు. నీకు ఆల్ ద బెస్ట్ చెప్పడం కూడా ఇష్టం లేదు అని మల్లి బయటికి వస్తుంది. కట్ చేస్తే, మీరా డబ్బులు తీసుకువచ్చి మల్లి ఇస్తుంది. అమ్మ నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు ఈ డబ్బులు చూసిన నిన్ను చూసిన ఆయన ఊరుకోరు మా అత్తయ్య గారు బయటకి రాకముందే నువ్వు వెళ్ళిపో అమ్మ అని మల్లి అంటుంది. అలా అనకమ్మ మల్లి నీ పరిస్థితి చూసి ఈ మాత్రం సాయం కూడా చేయలేమా అంత పాపిష్టి వాళ్ళమా అని మీరా బాధపడుతుంది. అమ్మ మీరు ఇక్కడికి వచ్చినట్టుగాని ఈ డబ్బు తెచ్చినట్టుగాని ఆయనకు తెలిసిందంటే నాకు కాపురం కూలిపోతుంది నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇక్కడికి రా వద్దని నేను నా కుటుంబాన్ని పోషించుకోగలను అత్తయ్య చూడకముందే నువ్వు ఇకనుంచి వెళ్ళిపో అని మల్లి మీరాని బయటికి నెట్టేస్తుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

 

Related posts

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

bharani jella

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N