ప్రముఖ హీరోయిన్ హన్సిక పెళ్లి పీట లెక్కబోతోందని గత కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా హన్సిక పెళ్లికి డేట్ లాక్ చేశారని అంటున్నారు. డిసెంబర్ 4న రాజస్థాన్ జైపూర్‌లోని 450 ఏళ్ల పురాతన రాచకోట `ముందోతా ఫోర్ట్ ప్యాలెస్`లో హన్మిక వివాహం అంగరంగ వైభవంగా జరగబోతోందని తెలుస్తోంది.
పెళ్లి కార్యక్రమాలు డిసెంబర్ 2న మొదలవుతాయని, అదే రోజు సుఫీ నైట్, తర్వాతి రోజు మెహెందీ, సంగీత్ కార్యక్రమాలు ఉంటాయని తెలుస్తోంది. అలాగే హన్సిక పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారట.
అయితే ఇంతకీ హన్సికను పెళ్లాడబోయే వరుడు ఎవరో తెలుసా..? సోహాల్ కతూరియా అనే ముంబై వ్యాపారవేత్త అని సమాచారం. గతంలో సోహాల్, హన్సిక కలసి బిజినెస్‌ను ప్రారంభించారట. ఆ సమయంలో వీరి ఆలోచనలు, అభిరుచులు కలవడంతో.. స్నేహం కాస్త ప్రేమగా మారిందట. ఇప్పుడు పెళ్లి వరకు వారి బంధాన్ని తీసుకొచ్చారని అంటున్నారు.
కాగా, సినిమాల విషయానికి వస్తే.. హన్సిక తెలుగు తెరపై కనిపించి చాలా కాలమే అయింది. అయితే ఎన్నో ఏళ్ల తర్వాత హన్సిక తెలుగులో `105 మినిట్స్`, `మై నేమ్ ఇస్ శృతి` చిత్రాకు సైన్ చేసింది. అలాగే మరోవైపు తమిళంలో ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో పుల్ బిజీగా గడుపుతోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!