Rana: హీరో దగ్గుబాటి రానా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు అందరికీ తెలిసిన హీరో. ఆరడుగుల కటౌట్ కలిగిన బాడీతో ఇటువంటి పాత్రలైనా చేసే సత్తా కలిగిన నటుడు. బాహుబలిలో బల్లాలదేవ పాత్రలో రానా నటన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. పాజిటివ్ మరియు నెగిటివ్ పాత్రలు చేస్తూ అన్ని రకాలుగా అలరిస్తున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో డానియల్ శేఖర్ పాత్రలో కూడా అద్భుతంగా విలన్ పాత్రలో కనిపించడం జరిగింది.
సినిమాలపరంగా మాత్రమే కాదు బుల్లితెరపై ఇంకా ఓటిటి రంగంలో కూడా విజయవంతంగా రాణిస్తున్నాడు. అటువంటి రానా తాజాగా ట్విట్టర్ వేదికగా ఇండిగో విమాన సంస్థ యాజమాన్యంపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఆ సంస్థ యాజమాన్యం తీరు హీరో రానాకి అసహనం కలిగించింది. తన లగేజ్ మిస్ అయిందని.. సమస్త ఉద్యోగులు దాన్ని వెతికి పట్టుకోలేకపోయారని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. అంతేకాదు ఇలాంటి అనుభవం తనకు ఎప్పుడు ఎదురు కాలేదని వరస్ట్ ఎయిర్ లైన్స్ అంటూ… ఎందుకో విమాన సంస్థ అధికార ట్విట్టర్ ఎకౌంటును ట్యాగ్ చేయడం జరిగింది.
రానా ట్విట్ కి ఆ విమాన సంస్థ నుండి ఎటువంటి స్పందన లేదు. ఇదిలా ఉంటే రానా తాను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు అనేది ట్విట్టర్ లో వెల్లడించలేదు. ప్రస్తుతం రానా ఓటిటి లలో వెబ్ సిరిస్ లు చేస్తున్నే మరొకపక్క సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎప్పుడు లేని రీతిలో ట్విట్టర్ లో విమాన సంస్థ పై సీరియస్ కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!