హీరోయిన్ సమంత కరోనా రాకముందు వరకు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. నాగచైతన్య తో పెళ్లి అయినా గాని సినిమాలు చేస్తూ.. తనకున్న క్రేజ్ జాగ్రత్తగా కాపాడుకుంది. అయితే గత ఏడాది కరోనా సెకండ్ వేవ్ కంప్లీట్ అయిన తర్వాత అక్టోబర్ మాసంలో సమంత నాగచైతన్యతో విడిపోయినట్లు ప్రకటించడం తెలిసిందే. దీంతో సమంత కెరియర్ డేంజర్ జోన్ లో పడినట్లే అనే టాక్ వచ్చింది. కానీ తాజా పరిస్థితి చూస్తే సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సమంత సత్తా చాటుతుంది.
సినిమాలు ఒకటే కాదు మరోపక్క వెబ్ సిరీస్ లు, ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తూ తనకు తిరుగులేదు అని నిరూపించుకుంటుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న హీరోయిన్ అందరిలో ఎక్కువ సినిమాలు సమంత చేతిలోనే ఉండటం విశేషం. దాదాపు పది సినిమాలు సామ్ చేతిలో ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.
యశోద, శకుంతలం, ఖుషి, సిటడెల్, అరేంజ్మెంట్ ఆఫ్ లవ్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్, తాప్సి ప్రొడక్షన్ లో సినిమా, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రాజెక్ట్, తలపతి విజయ్ 67వ సినిమా, ఇంకా శివ కార్తికేయ సినిమా. మొత్తంగా చూసుకుంటే దాదాపు పది సినిమాలు సమంత చేతిలో ఉన్నాయి. ఇంకా పలు వెబ్ సిరీస్ లు కూడా చేయటానికి రెడీ అవుతుంది. అంతేకాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ తో కూడా మరో కీలక ప్రాజెక్ట్ సమంత చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా సమంత సౌత్ లో మాత్రం ఎక్కువ లేడీ ఓరియెంటెడ్ కథలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంది.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!