Thandel: అక్కినేని నాగచైతన్య కొత్త సినిమా “తండేల్” టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలయ్యింది. డైరెక్టర్ చందు మండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చైతు సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. తాజాగా ‘ఎసెన్స్ ఆఫ్ తండేల్’ గ్లింప్స్ అంటూ వీడియో విడుదల చేయడం జరిగింది. దాదాపు రెండు నిమిషాల 11 సెకండ్స్ నిడివి కలిగిన ఈ టీజర్ లో సినిమాలో నాగచైతన్య చాపల జాలరిగా నటించినట్లు చూపించడం జరిగింది. అంతేకాదు చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్ దేశం జైలులో అరెస్ట్ అయినట్లు.. చూపించారు. పాకిస్తాన్ జైలులో నాగచైతన్య.. మా నుండి ఓడిపోయిన ఒక ముక్క, మీకే అంత ఉంటే, ఆ ముక్కని ముష్టేసినా మాకు ఎంత ఉండాలి.. అంటూ భారీగా నాగచైతన్య డైలాగులు వేశారు. తండేల్ రాజా పాత్రలో నాగచైతన్య నటిస్తున్నారు. ‘ఎసెన్స్ ఆఫ్ తండేల్’ గ్లింప్స్ అంటూ రిలీజ్ అయిన వీడియో.. చివరిలో నాగచైతన్య కోసం ఎదురుచూస్తున్నట్లు సాయి పల్లవిని సముద్రపు ఒడ్డున చూపించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ‘ఎసెన్స్ ఆఫ్ తండేల్’ గ్లింప్స్ వీడియో జనవరి 5వ తారీఖున విడుదల కావాల్సింది.
కానీ కొన్ని కారణాలవల్ల జనవరి 6వ తారీకు రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. ముందుగా ప్రకటించిన దాని ప్రకారం జనవరి 5 సాయంత్రం ఐదు గంటలకు రిలీజ్ కావాల్సి ఉండగా.. ఆఖరి నిమిషంలో వాయిదా పడి సాయంత్రం 7 గంటలకి విడుదల చేస్తున్నట్లు మరో ప్రకటన చేశారు. అయితే సాయంత్రానికి కూడా ‘ఎసెన్స్ ఆఫ్ తండేల్’ గ్లింప్స్ వీడియో రిలీజ్ చేయలేకపోయారు. దీంతో అక్కినేని అభిమానులు ఫుల్ ఆగ్రహం చెందారు. ఆ తర్వాత వెంటనే జనవరి ఆరవ తారీకు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఊహించని సాంకేతిక కారణాలవల్ల అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోయామని వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో నేడు చెప్పిన సమయానికి ఉదయం 11 గంటలకు ‘ఎసెన్స్ ఆఫ్ తండేల్’ గ్లింప్స్ వీడియో విడుదల చేయడం జరిగింది.
యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం.. లవ్ స్టోరీ తో పాటు దేశభక్తి నేపథ్యం కలిగిన కంటెంట్ అని ‘ఎసెన్స్ ఆఫ్ తండేల్’ గ్లింప్స్ వీడియో బట్టి తెలుస్తోంది. ఇప్పటివరకు నాగచైతన్య తన కెరియర్ లో ఎన్నడు టచ్ చేయని జోనర్ “తండేల్” లో టచ్ చేయడం జరిగింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో గతంలో నాగచైతన్య నటించిన “100% లవ్” బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఆ సినిమాకి కూడా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పుడు అదే బ్యానర్ లో నాగచైతన్య “తండేల్” చేయటం సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించడంతో సెంటిమెంట్ పరంగా హిట్ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!