Guppedantha Manasu:గుప్పెడంత మనసు సీరియల్ లో హీరో తల్లి క్యారెక్టర్ అయినా జగతి పాత్రలో నటిస్తున్న జ్యోతి రాయ్. జగతి ఒరిజినల్ పేరు జ్యోతి రాయ్ ఈమె కన్నడ నటి. ఒకప్పుడు కన్నడంలో హీరోయిన్ గాను,కొన్ని కన్నడ సీరియల్స్ లోను నటించి మెప్పించింది. ఈ సీరియల్ లో గుండెల్ని పిండేసే నటనతో మెప్పించింది అని చెప్పొచ్చు. కన్నడలో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జ్యోతి,మొదట్లో ఈమెకి మోడలింగ్ మీద ఇంట్రెస్ట్ తో ఆ కెరియర్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తన సోషల్ మీడియాలో వచ్చే ఫొటోస్ అన్నిటికీ తనే మోడలింగ్ డ్రెస్ ని డిజైన్ చేసుకుంటుంది.ఈమె “బందే బరాటవ కాలా “అనే సీరియల్ లో నటిగా మారింది. 20 కి పైగా సీరియల్స్ లో నటించింది. ఈమె తులు, కన్నడ,తమిళం తెలుగు భాషలో నటించింది. అలాగే సీతారామ కళ్యాణం గాంధాడ్, గుడి, 99, దియా,వర్ణ పాటల, ఇలా కొన్ని సినిమాలలో కూడా సహాయ పాత్రలు చేసింది. ఈమె తెలుగులో కన్యాదానం అనే సీరియల్ లో పదేళ్ల క్రితమే ఎంట్రీ ఇచ్చింది కానీ బాగా పాపులర్ అయింది మాత్రం గుప్పెడంత మనసుతోనే,ఈమె గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగ దగ్గర అయిందని చెప్పొచ్చు. కస్తూరిబా నివాస్ అనే కన్నడ సీరియల్ ఈమెకి బాగా పేరు తెచ్చి పెట్టింది.

ఈమెని బుల్లెతర శృతి అని పిలుస్తుంటారు కన్నడ అభిమానులు.ఈమె పర్సనల్ విషయానికొస్తే ఈమెకు 20 ఏళ్ళ వయసులోనే పద్మనాభ అనే ఒక ఇంజనీర్ తో, పెళ్లయింది.వీరికి ఒక బాబు కూడా ఉన్నారు. మరి ఏమైందోఏమో కానీ అతనికి దూరంగా ఉంటుంది జగతి. కొంతకాలంగా సుకు పూర్వాజ్ అనే యంగ్ డైరెక్టర్ తో రిలేషన్ లో ఉంటుంది. ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉన్న ఫొటోస్ ను సోషల్ మీడియాలో స్వయంగా తన ఇంస్టాగ్రామ్ లో ఈమె పోస్ట్ చేస్తోంది. ఇక అందరికీ అర్థమైంది ఈమె ఆ డైరెక్టర్ ని పెళ్లి చేసుకోబోతుంది అని కన్ఫామ్ చేసుకున్నారు. ఎందుకంటే ఈ డైరెక్టర్ తన ఇష్టాలు పోస్ట్ చేసిన ఒక ఫోటోలో రింగ్ తో పాటు ఒక లవ్ బర్డ్ ఎమోజిని కూడా పెట్టారు. దీంతో వీళ్ళకి ఎంగేజ్మెంట్ కూడా జరిగినట్టు నెటిజన్లు ఫీల్ అవుతున్నారు. జగతి తన పర్సనల్ లైఫ్ ని అభిమానులతో పంచుకుంటూ వారికి దగ్గరగా ఉంటుంది.

ఇక సీరియల్ విషయానికొస్తే గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి క్యారెక్టర్ ని ఎండ్ చేశారు. దీనికి ప్రధాన కారణంగా ఈ మధ్య టీఆర్పి రేటింగ్ కాస్త తగ్గింది కాబట్టి, బ్రహ్మముడికి రేటింగ్ పెరగడంతో, ఇంట్రెస్టింగ్ కంటెంట్ తీసుకురావడం కోసం డైరెక్టర్ ఈ పని చేసి ఉండొచ్చు. లేదంటే జ్యోతి రాయ్ ఇప్పుడు కొత్తగా కొన్ని సినిమాలలో కూడా నటిస్తుంది. రీసెంట్ గా ఈమె ఒక వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా చేస్తుంది. పెర్టిగల్ అనే ఒక వెబ్ సిరీస్ ని రీసెంట్గా పోస్టర్ని రిలీజ్ చేసింది. వాటి వల్ల ఈమెకి కాల్ షీట్స్ లో ఏమన్నా ఇబ్బంది ఉండి, క్యారెక్టర్ ని తీసేసి ఉండవచ్చు. అభిమానులు మాత్రం ఈమె ఇంకొంత కాలం ఉండి ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు ఎందుకంటే ఈ సీరియల్ లో రిషి వసుధార క్యారెక్టర్స్ ఎంత ఇంపార్టెంట్ రోలు పే చేస్తాయో అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది జగతి. కొడుకు ప్రేమ పొందాలనుకున్న ఒక తల్లి పాత్రలో, స్టూడెంట్ కి సహాయం చేయాలన్న ఒక టీచర్ పాత్రల ద్వారా అందరికీ మంచి చేస్తే ఒక క్యారెక్టర్ని జగతి ఈ సీరియల్ లో అద్భుతంగా నటించింది. ఇక ఈ సీరియల్ లో తనతో పాటు మహీంద్రా క్యారెక్టర్ లో సాయికిరణ్ చాలా బాగా నటించాడు. ఇద్దరూ నిజంగా భార్యాభర్తల అన్నట్టుగా వీళ్ళ నటన ఉండేది. జగతి క్యారెక్టర్ లో చక్కటి చీర కట్టుతో అందరినీ మెప్పించింది జ్యోతి. విలక్షణమైన నటనతో అబ్బురపరిచింది అనే చెప్పవచ్చు. ఈ సీరియల్ లో ఆ పాత్రకి తగ్గట్టుగా ఉంటుంది. ఈ సీరియల్లో రిషికి జగతి మేడం తల్లిగా నటించింది కానీ అసలు రిషికి జగతికి వయసు వ్యత్యాసం 10 సంవత్సరాలు మాత్రమే, రిషికి 28 ఏళ్ల వయసు ఉంటే జగతికి 38 ఏళ్లు, 30 ప్లస్ ఏజ్ లో కూడా ఈమె చాలా అందంగా కనిపించేవారు.కారణం ఏదైనా జగదీపాత్రాన్ని తీసేయడానికి అభిమానులు ఒప్పుకోవడానికి కారణం ఆమె ఇక ముందు సీరియల్లో కనిపించదు ఆవిడ అందానికి ఫిదా ఈ సీరియల్ చూసేవాళ్ళు ఆవిడ నటనకు ఫిదా సీరియల్ చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ సీరియస్ అంటే ఆడవారు మాత్రమే చూస్తారు అనుకుంటారు కానీ ఒక సర్వేలో ఆడవారితో పాటు సమానంగా పురుషులు కూడా చూస్తున్నారు సీరియల్స్ అని తేలింది. ఇలాంటి క్యారెక్టర్స్ తో ఇలాంటి అందమైన భామలు సీరియల్స్ లో నటిస్తుంటే ఏ మగవాళ్ళు మాత్రం చూడకుండా ఉంటారు.

ఇక ఈ సీరియల్ లో నెగటివ్ క్యారెక్టర్ దేవయాని పాత్ర ద్వారా ఈమె ఇబ్బంది ఎదుర్కొనడం, దేవయాని కొడుకు అయినా సైలేంద్ర భూషణ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత నెగిటివ్ షేడ్ పెరగడం, ఇక జగతి తన మంచితనంతో కొడుకుకు దగ్గర అవడం, తన ప్రియ శిష్యురాలైన వసుధారతో ఈమె తన కొడుక్కి పెళ్లి చేయాలి అనుకోవడం, తన భర్త సహాయముతో రిషీ వసు లను కలపడం జరుగుతుంది. ఆ తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల రిషి ఇల్లు వదిలి వెళ్ళిపోవడం తరువాత వసుధార కూడా రిషి దగ్గరికి వెళ్లడం. కొన్ని నాటికి ఏ పరిమాణాల మధ్య చివరకు తన కొడుకుని కాపాడే ప్రయత్నంలో జగతి క్యారెక్టర్ ఎండ్ అవ్వడం జరుగుతుంది. జగతి క్యారెక్టర్ చివర్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ఈ సీరియల్ ని మళ్లీ టిఆర్పి రేటింగ్ లో దూసుకుపోయేటట్టు చేస్తున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు సీరియల్ కి మళ్ళీ కనెక్ట్ అయ్యారు.ఏది ఏమైనా ఈ సీరియల్ లో జ్యోతి రాయి తన నటనతో అద్భుతంగా అలరించిందని చెప్పవచ్చు ఈమె అప్కమింగ్ సీరియల్స్ సినిమాలకు ఆల్ ది బెస్ట్ మరికొన్ని తెలుగు సీరియల్స్ లో ఈమె నటించాలని కోరుకుందాం.