Malli Nindu Jabili:మళ్లీ నిండు జాబిలి, ఈ సీరియల్ లో మాలినీ క్యారెక్టర్ లో దీప జగదీష్ నటిస్తోంది. స్టార్ మా లో వచ్చే అన్ని సీరియల్స్ కన్నా ఈ సీరియల్మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సీరియల్ లో మాలిని క్యారెక్టర్ కొంచెం నెగిటివ్ రోల్ కొంచెం పాజిటివ్ ఉంటూ ఉంటుంది. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త తనకు తెలియకుండా ఇంకొక అమ్మాయి మెడలో తాళి కట్టాడు అని తెలుసుకున్న భార్య తన భర్తను దక్కించుకోవడం చేసే ప్రయత్నంలో కొంత నెగిటివ్ క్యారెక్టర్ మరియు తన భర్త దగ్గర ఎప్పుడూ ప్రేమని ప్రదర్శించే పాజిటివ్ క్యారెక్టర్ లో మాలిని అద్భుతంగా నటిస్తుందని చెప్పొచ్చు. ఇక ఈ మాలిని క్యారెక్టర్ లో దీపా జగదీష్ జీవించిందని చెప్పాలి. తనకోసం మాత్రమే అన్నట్టుగా ఈ క్యారెక్టర్ ఉంటుంది.

ఇక ఇదే సీరియల్ లో మళ్లీ భర్త క్యారెక్టర్ లో ఈమధ్య ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ అనే క్యారెక్టర్ లో ఆర్యన్ దీర్ కుమార్ నటిస్తున్నాడు. ఆర్యన్ చాలా చిత్రాల్లో మరియు సీరియల్స్ లో కన్నడంలో మంచి గుర్తింపు పొందిన హీరోగా మన తెలుగు ప్రేక్షకులకు ఈ సీరియల్ తో పరిచయమయ్యాడు. మాలిని, ఆర్యన్ ధీర్ కుమార్ ఇద్దరూ కూడా కన్నడలో మంచి నటులు, ఇప్పుడు వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఇంస్టాగ్రామ్ లో స్టెప్పులేసిన ఒక వీడియో ఇప్పుడునెట్ ఇంటి వైరల్ అవుతుంది.
రీసెంట్గా వచ్చిన జవాన్ మూవీలో చెలియా పాటకి ఆర్యన్ దీర్ కుమార్ మరియు దీపా జగదీష్ ఇద్దరు కూడడాన్స్ వేసి అలరించారు.హ్యాండ్సమ్ లుక్కుతో ఆర్యన్ దీర్ కుమార్ మరియు మెస్మరైజింగ్ పర్ఫామెన్స్ తో మన దీపా జగదీష్ ఇద్దరు కూడా ఈ పాటలో డాన్స్ వేసి మెప్పించారు. ఈ పాటలో వీళ్ళ కెమిస్ట్రీ కూడా అద్భుతంగా కుదిరింది.ఆర్యన్ స్వతహాగానే మంచి డాన్సర్ సినిమాల్లో నటిస్తున్నాడు కాబట్టి తన పర్ఫామెన్స్ చాలా బాగుంది ఇక మన దీపా కూడ అద్భుతంగా డాన్స్ వేసింది. పింక్ కలర్ శారీలో దీప జగదీష్ ని చూస్తే హీరోయిన్స్ కూడా కుళ్ళుకునేలా ఉంటుంది. బ్లాక్ షర్ట్ లో మన ఆర్యన్ కూడా అద్భుతంగా ఉన్నాడు. ఆర్య దీర్ కుమార్ ఈ వీడియోని తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో పోస్ట్ చేశాడు. ఆర్యన్ ఫ్యాన్స్ తో పాటు దీపాభిమానులు కూడా ఈ వీడియోని ఇప్పుడు లైక్ చేసి షేర్ చేసి వారి అభిమానాన్ని తెలుపుతున్నారు ఇప్పుడు ఈ వీడియోని మీరు కూడా చూసి అలరించండి