Liger: `ఇస్మార్ట్ శంకర్` వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చేస్తున్న చిత్రం `లైగర్`. టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఇందులో హీరోగా నటించగా.. బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే ఆయనకు జోడీగా చేస్తోంది. ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, ఛార్మీ కౌర్, అపూర్వ మెహతా, హిరూ యష్ జోహార్ మరియు పూరీ జగన్నాథ్ లు కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు.
ముంబైలోని ఓ ఛాయ్ వాలా ప్రపంచం గుర్తించే బాక్సార్ గా ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో విజయ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. అలాగే రమ్యకృష్ణ, ఇంటర్నేషన్ బాక్సర్ మైక్ టైసన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. 2020లో మొదలైన ఈ చిత్ర షూటింగ్ కు కరోనా మహమ్మారి కారణంగా వరుస బ్రేకులు పడ్డాయి. అయితే అన్ని అడ్డంకులను దాటుకుని ఫిబ్రవరి నాటికి షూటింగ్ ను కంప్లీట్ చేశారు.
దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం ఆగుస్టు 25న తెలుగుతో పాటు ఒకేసారి తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అవ్వబోతోంది. త్వరలోనే ప్రచార కార్యక్రమాలు కూడా మొదలు కానున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ టాక్ బయటకు వచ్చింది. అదేంటంటే.. `లైగర్` మళ్లీ సెట్స్ మీదకు వెళ్లబోతోందట. షూటింగ్ పూర్తైందని అన్నారుగా.. ఇప్పుడీ ట్విస్ట్ ఏంటీ అని ఆలోచిస్తున్నారా..? అయితే చిత్రీకరణ మొత్తం పూర్తైంది.. కానీ, ఒకే ఒక్క సాంగ్ మాత్రం ఇంకా బ్యాలెన్స్ ఉందట.
ఇప్పుడు ఆ లాస్ట్ సాంగ్ షూటింగ్ కోసమే మేకర్స్ సిద్ధం అవుతున్నారట. విజయ్ మరియు అనన్య లపై ఈ సాంగ్ ఉంటుందని, ముంబైలో దీనిని షూట్ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. కాగా, `లైగర్` విడుదల అవ్వక ముందే పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండతో మరో చిత్రాన్ని పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. అదే `జనగణమన`. ఇందులో విజయ్ ఓ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా, అందాల భామ పూజా హెగ్డే ఆయనకు జోడీగా చేస్తోంది. ఈ మధ్యే ముంబైలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది.
Shriya Saran: అందాల భామ శ్రియ సరన్ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…
Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగర్`. డాషింగ్ అండ్ డైనమిక్…
Udaipur Murder: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య కుమార్ ను దారుణంగా హత్య చేసిన నిందితులపై జైపూర్…
Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ఇటీవల `సర్కారు వారి పాట`తో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న…
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, అందాల భామ రాశి ఖన్నా జంటగా నటించిన తాజా చిత్రం `పక్కా…