Cinnamon: సుగంధ ద్రవ్యాల్లో ఒకటి అయిన దాల్చిన చెక్కకు మన భారతీయ వంటకాల్లో ఎంతో ప్రత్యేకమైన పేరు ఉంది.వంటలకు మంచి సువాసన,రుచి రావడం కోసం దాల్చిన చెక్కను వంటల్లో విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ దాల్చిన చెక్కను వంటల్లో వాడటం వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
ఈ దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దాల్చిన చెక్కలో శరీరానికి కావాల్సిన ఫైబర్ , కాల్షియం, ఐరన్ తదితర పోషకాలు నిండుగా ఉంటాయి.అలాగే దాల్చిన చెక్కలో పాలిఫినాల్స్ అనబడే ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా బరువు తగ్గాలని భావించే వారికి దాల్చిన చెక్క మంచి ఆప్షన్ అనే చెప్పాలి.
ఇది శరీరంలో చెడు కొలస్ట్రాల్ ని తొలగించి మంచి కొలస్ట్రాల్ ను పెరిగేలా చేస్తుంది. దాల్చిన చెక్కను రోజువారీ ఆహారంలో భాగంగా వాడితే ఇది కొవ్వు కణాలను విచ్చిన్నం చేసి కొవ్వును తగ్గిస్తుంది.దాంతో శరీరంలో పేరుకుపోయిన చెడు కొలస్ట్రాల్ తగ్గుతుంది.మరి దాల్చిన చెక్కను ఎలా తీసుకోవాలో అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ముందుగా కొద్దిగా దాల్చిన చెక్కను తీసుకుని మిక్సిలో వేసి మెత్తని పొడిలా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయ రసాన్ని పిండి అందులో ఒక స్పూన్ తేనె, అర స్పూన్ స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలపాలి.ఇలా ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఉదయం పూట పరగడుపున తాగుతూ ఉండాలి.క్రమం తప్పకుండా మూడు నెలల పాటు ఇలా దాల్చిన చెక్క నీటిని తాగుతు ఉండాలి.
మధుమేహం ఉన్నవారికి దాల్చిన చెక్క చాలా మేలును కలిగిస్తుంది. దాల్చిన చెక్కలో ఉండే సమ్మేళనాలు అలనిన్ అనే ఎంజైమ్ ను శరీరంలో బ్లాక్ చేస్తుంది. ఇది ఆహారం తిన్న తర్వాత గ్లూకోజ్ ను గ్రహించకుండా చేస్తుంది. అందుకే దాల్చిన చెక్క ద్రావణం మధుమేహం పేషంట్స్ కు చాలా మంచిది. రక్తంలో గ్లూకోజ్ పెరగకుండా తగ్గిస్తుంది.. మధుమేహం ఉన్నవారు నిత్యం ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడిని తీసుకుంటుంటే మధుమేహం తగ్గుతుంది
దాల్చిన చెక్క టీ త్రాగటం వలన కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది..దాల్చిన చెక్కతో తయారు చేసిన నూనెను మర్దన చేయడం వల్ల కూడా కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.దాల్చిన చెక్కతో చేసిన టీ తాగటం వలన జలుబు మరియు దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు.ప్రతీ రోజూ దాల్చిన చెక్కను ఆహారంలో చేర్చడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.దాల్చిన చెక్కలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు దంత సమస్యలను, నోటి దుర్వాసనను అరికడతాయి. చిన్న దాల్చిన చెక్క ముక్కను బుగ్గన పెట్టుకొని నమిలితే చాలు నోటి దుర్వాసనను దూరం చేయవచ్చు.ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే దాల్చిన చెక్కను రోజులో కొంత పరిణామంలో మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ మొత్తంలో తీసుకోకూడదు.
Prabhas: పాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటుతున్న టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ వరుస భారీ చిత్రాలతో ఎంత బిజీగా…
Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…
Shriya Saran: అందాల భామ శ్రియ సరన్ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…
Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగర్`. డాషింగ్ అండ్ డైనమిక్…
Udaipur Murder: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య కుమార్ ను దారుణంగా హత్య చేసిన నిందితులపై జైపూర్…