Srinidhi Shetty: శ్రీనిధి శెట్టి.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ 2015లో మిస్ కర్ణాటక, మిస్ బ్యూటీఫుల్ స్మైల్, 2016లో మిస్ సుప్రనేషనల్ ఇండియా టైటిల్స్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత `కేజీఎఫ్` వంటి భారీ ప్రాజెక్ట్‌లో అవకాశాన్ని కొట్టేసింది.
కన్నడ రాక్‌స్టార్ యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం.. రెండు పార్టులుగా విడుదలై ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేశాయో ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన అసవరం లేదు. ఫస్ట్ మూవీతోనే నేషనల్ వైడ్‌గా పాపులర్ అయింది శ్రీనిధి శెట్టి.
ఈ మూవీ అనంతరం ఆమె దశ తిరిగినట్టే అని అందరూ భావించారు. అందుకు తగ్గట్లుగానే శ్రీనిధి శెట్టికి వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. కానీ, ఆమె భారీ రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేస్తూ వచ్చిన ఆఫర్లన్నీ చేతులారా వదులుకుంటోంది. `కేజీఎఫ్` హిట్ లో ఆమె పాత్ర కూడా చాలా తక్కువే.
అయినా ఆమె తన పారితోషికాన్ని ఒక రేంజ్ లో పెంచడంతో నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారట. `కేజీఎఫ్` అనంతరం ఆమె నుంచి ఒక్క కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ రాకపోవడానికి అదే కారణమని అంటున్నారు. మరి ఇప్పటికైనా శ్రీనిధి రెమ్యునరేషన్ విషయంలో మారి వెనక్కి తగ్గకుంటే కెరీర్ క్లోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.
Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…
Hero Ram: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ గత కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…
AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…
Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…
Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…
Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…