Intinti Gruhalakshmi: అభి ఏమైందిరా అని నందు అడుగుతాడు. ఏమో డాడీ ఇంట్లో ఎవరూ కనిపించడం లేదు అని అభి అంటాడు. సరే అయితే నేనే వెళ్లి నాన్నని విష్ చేసి సర్ప్రైజ్ చేస్తాను అని అంటాడు. నందు వాళ్ల నాన్న రూమ్ లోకి వెళ్లి హ్యాపీ బర్త్డే నాన్న అంటూ దుప్పటి తీస్తాడు. తీరా చూస్తే అక్కడ వాళ్ళ నాన్న ఉండడు.. అభి కోపంగా అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతాడు..
సామ్రాట్ తులసి కళ్ళు మూస్తూ నీకు ఒక సర్ప్రైజ్ అని అన్నాడు. సర్ప్రైజ్ ఏంటో చెప్పొచ్చు కదా అని తులసి అడిగింది. ఒకవేళ నేను నిన్ను మోసం చేస్తే అని సామ్రాట్ అంటాడు. మీరు ఎప్పటికీ నన్ను మోసం చేయలేరు. మీకు మోసం చేయడమే రాదు అని తులసి అంటుంది. తులసి కళ్ళు మూసి పరంధామయ్య బర్త్డే సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసిన చోటకి సామ్రాట్ తీసుకువెళ్తాడు.
ఆ సెలబ్రేషన్స్ చూసి తులసి సంతోషపడుతుంది. నిజంగా మావయ్య గారు ఎక్కడికి వచ్చి ఉండుంటే ఇంకా సంతోషంగా ఉండేది అని అనుకుంటుంది. అందుకే మీకోసం పరంధామయ్య గారు మీకోసం వచ్చారు.. అదిగో అంటూ సామ్రాట్ చూపిస్తాడు.. అక్కడ వాళ్ళ మామయ్యా ను చూసి చాలా సంతోషిస్తుంది. కాళ్లకు దండం పెట్టుకుంటుంది. ఇక ఆయనతోపాటు అందరూ అక్కడికి వచ్చేస్తారు.. వాళ్ళందరిని చూసి తులసి చాలా సంతోషిస్తుంది.
సామ్రాట్ బాబు నీకు నిజంగా చాలా ధన్యవాదాలు. మా తులసికి పాతిక సంవత్సరాల క్రితమే గ్రహణం పట్టుకుంది. అది ఇప్పటికీ వదలడం లేదు. నువ్వే ఇకనుంచి తన కళ్ళల్లో ఆనందం కలిగేలాగా చేయాలి అని పరంధామయ్య అంటాడు. ఇక తులసి చేతుల మీదగా పరంధామయ్య పుట్టినరోజు వేడుక జరుగుతుంది. ఇంట్లో నుంచి బయలుదేరిన అభి తులసి వాళ్ళింటికి వస్తాడు. వాళ్ళందరూ హ్యాపీగా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడం చూస్తూ కోపంగా ఉంటాడు. పరంధామయ్య తులసిని జాగ్రత్తగా చూసుకోవాలని సామ్రాట్ తో చెబుతున్న మాటలను వింటూ ఉంటాడు.
సరే అమ్మ తులసి మేము ఇక్కడి నుంచి వెళ్తాము అని పరంధామయ్య అంటాడు. వాళ్ళు బయటికి రావడం గమనించిన అభి గబగబా పక్కకు వెళ్లి దాక్కుంటాడు. పరంధామయ్య వాళ్ళు వెళ్ళిపోగానే అభి లోపలికి వెళ్తాడు. ఆంటీ నేను ఎప్పుడైనా ఇంటికి రావచ్చా అని అంకిత అడుగుతుంది. ఇది నీ ఇల్లు అమ్మ నువ్వు ఎప్పుడైనా రావచ్చు అని తులసి ఉంటుంది. ఎవ్వరూ ఈ ఇంటికి రారు అని అభి కోపంగా అంటాడు.
ఇంట్లో జరిగే శుభకార్యానికైనా ఆ శుభకార్యానికైనా సరే ఎవ్వరూ రారు అని అభి కోపంగా అంటాడు అభి. ఏం మాట్లాడుతున్నావ్ రా ఈరోజు మనందరికీ పండుగ రోజు మీ తాతయ్య పుట్టినరోజు. ఇప్పటివరకు అందరం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాం. నువ్వు కూడా వస్తావేమో అని అనుకున్నాను కానీ నువ్వు రాలేదు అని తులసి సాఫ్ట్ గా చెబుతుంది.
అందరూ అమ్మలు చాలా హద్దుల్లో ఉంటారు. కానీ మా అమ్మ మాత్రం హద్దులు దాటి ప్రవర్తిస్తుంది అని అభి అంటాడు. ఆ మాటలకు కోపం వచ్చిన సామ్రాట్ అభి మీదకు చేయి ఎత్తుతాడు. మీరెవరు నన్ను కొట్టడానికి అని తులసి ఉండే సామ్రాట్ ను నిలదీస్తాడు అభి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!