నందమూరి కళ్యాణ్ రామ్.. ఈయన గురించి పరిచయాలు అవసరం లేదు. కెరీర్ ఆరంభంలో వరుస హిట్లతో యమా జోరు చూపించిన ఈయన.. స్టార్ హీరో స్థాయికి ఎదుగుతారని అందరూ అంచనా వేశారు. అయితే అంతలోనే వరుస ఫ్లాపులు పడటంతో అందరి అంచనాలు తారుమారు అయ్యాయి. ఇకపోతే కెరీర్ పరంగా మళ్లీ పుంజుకునేందుకు కళ్యాణ్ రామ్ ప్రయత్నిస్తున్నాడు.
ఇందులో భాగంగానే `బిండిసార` వంటి క్రేజీ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించాడు. కళ్యాణ్ రామ్ కెరీర్లో తెరకెక్కుతున్న తొలి ఫాంటసీ అండ్ అడ్వెంచర్ ఫిల్మ్ ఇది. వశిష్ఠ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో కేథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్, వరీనా హుస్సేన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ .కె నిర్మిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడెక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగష్టు 5 అట్టహాసంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఇటీవల ట్రైలర్ ను బయటకు వదలగా.. అది విశేషమైన ఆదరణ పొందడమే కాదు సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. ట్రైలర్ చూసిన నందమూరి అభిమానులు ‘బింబిసార’తో కళ్యాణ్ కు సాలిడ్ హిట్ ఖాయమని ఫిక్స్ అయిపోయారు.
మొత్తానికి ట్రైలర్ క్రియేట్ చేసిన హైప్ కారణంగా విడుదలకు నెల రోజుల ముందే `బింబిసార`కు దిమ్మతిరిగే రీతిలో థియేట్రిక్ బిజినెస్ జరుగుతోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు రూ.15 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగిందట. కళ్యాణ్‌రామ్ గత రెండు మూడు చిత్రాలు రూ. 12 కోట్లకు పైగా దాటలేదు. ఈ సారి ఏకంగా రూ.15 కోట్లకు ధర పలికాయంటే విశేషం అనే చెప్పాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!