NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: కృష్ణా మురారి లని విడగొట్టడానికి ముకుంద ప్రయత్నం, ఫలించినట్టేనా..

Krishna Mukunda Murari 22 June 2023 today 190 episode highlights

Krishna Mukunda Murari: స్టార్ మా ఛానల్ లో అత్యంత ఆదరణ దక్కించుకుంటున్న డైలీ సీరియల్స్ లో ఒకటి ‘కృష్ణ ముకుందా మురారి’. విజయవంతంగా 189 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ఇప్పుడు 190 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది.

Krishna Mukunda Murari 22 June 2023 today 190 episode highlights
Krishna Mukunda Murari 22 June 2023 today 190 episode highlights

నిన్నటి ఎపిసోడ్ లో,ముకుంద అంతా నిజం తెలుసుకొని, రేవతి తో, నేనే మీకు కోడల్ని కృష్ణ కాదు ఇదే ఎప్పటికైనా జరుగుతుంది. అని సవాల్ చేస్తుంది. నా ప్రేమ కోసం నేను ఎక్కడ దాకైనా వెళ్తాను అని రేవతికి చెప్పేస్తుంది. రేవతి ముకుంద నుండి కృష్ణ మురారి లని ఎలాగైనా కాపాడాలి అని అనుకుంటుంది.

Krishna Mukunda Murari 22 June 2023 today 190 episode highlights
Krishna Mukunda Murari 22 June 2023 today 190 episode highlights

Nuvvu Nenu Prema: విక్కీ చెప్పిన మాటలకు కుచల మనసు మారిందా.. అరవింద ను చంపడానికి కృష్ణ ప్లాన్..

ఈరోజు ఎపిసోడ్ లో, ముకుందని కలవడానికి గీతిక వస్తుంది. గీతికను కృష్ణ ఆపి ఎక్కడికి వెళ్తున్నావ్ అని అంటుంది. ముకుందని కలవడానికి అని గీతిక చెప్తుంది. నేను నిన్ను ఒక ప్రశ్న అడగాలి అని అంటుంది కృష్ణ. అడుగు అని గీతిక అనగా, నువ్వు నిజమే చెప్పాలి అని అంటుంది కృష్ణ. గీతికా మనసులో అమ్మో ఇప్పుడు ఏం అడుగుతుందో కృష్ణ నేనేం చెప్పాలో చెప్తే ముకుంద పరిస్థితి ఏమిటి? అని సైలెంట్ గా అనుకుంటూ ఉంటుంది. మురారి నీకు ఎప్పటి నుంచి తెలుసు అని గీతికని అడుగుతుంది. ఇప్పుడు నేను నిజం చెప్పకూడదు అని గీతిక మనసులో అనుకోని, ముకుందా ఆదర్శ్ పెళ్లి అయినప్పటినుండే తెలుసు అని అంటుంది. కానీ కృష్ణ కి గీతిక అబద్ధం చెపుతున్న విషయం అర్థం అవుతుంది. ఇంకేమైనా అడగాలా కృష్ణ అని అంటుంది గీతిక. ఏమీ అవసరం లేదు నువ్వు వెళ్ళొచ్చు అని అంటుంది. గీతిక వెళ్ళిపోగానే కృష్ణ అందరూ అబద్ధం చెప్పే వాళ్లే నాకు, గీతిక కూడా అబద్ధం చెప్తుంది అంటే ముకుంద కూడా నా దగ్గర ఏదో దాచిపెడుతుంది. మురారి, అత్తయ్య,ముకుంద ముగ్గురు నా దగ్గర ఏదో దాస్తున్నారు. వెంట్రుక దొరికిన వదిలిపెట్టను కొండ మొత్తాన్ని లాగుతాను. ఎప్పుడోకప్పుడు దొరక్కుండా పోరు నిజం తెలియకుండా పోదు అని అనుకుంటుంది కృష్ణ.

Krishna Mukunda Murari 22 June 2023 today 190 episode highlights
Krishna Mukunda Murari 22 June 2023 today 190 episode highlights

Brahmamudi Serial జూన్ 21st 128 ఎపిసోడ్: స్వప్న కి గర్భం లేదనే విషయాన్నీ రాజ్ కి చెప్పే ప్రయత్నం చేసిన కావ్య..తర్వాత ఏమైందంటే! 

గీతికతో కలిసి ముకుంద ప్లాన్…

ముకుంద రూమ్ కి గీతిక వెళుతుంది. వచ్చావా గీతికా నీకోసమే ఎదురు చూస్తున్నాను అర్జెంట్ నీతో మాట్లాడాలి. ఏమైంది ముకుందా ఏం మాట్లాడాలి అని అంటుంది. మా అమ్మకు ఎలా ఉంది అని అడుగుతుంది ముకుంద. ఇప్పుడు బానే ఉన్నారు చెప్పు అని అంటుంది. మీ నాన్నగారి ఇంట్లోనే ఉన్నారా అని అంటుంది. ఏదో రాజకీయాల పనిమీద ఢిల్లీ వెళ్లారు. ఆయనతో ఏమైనా పని ఉందా అని అంటుంది గీతిక. అవును ఆయన నాకు ఒక హెల్ప్ చెయ్యాలి. ముకుంద, గీతికకి వాళ్ళ నాన్నతో ఏం చేయించాలో చెప్తుంది. అది చాలా రహస్యంగా బయటికి వినపడకుండా చెప్తుంది. సరే నువ్వు చెప్పింది అంతా నాకు అర్థమైంది ఇప్పుడు ఇదంతా అవసరం అంటావా అని అంటుంది గీతిక. అవసరమే నేను నీకు ఇది ఫోన్ లో అయినా చెప్పొచ్చు కానీ నా బాధ నీకు అర్థం అవ్వాలని ఇంటికి పిలిచి మరీ చెప్తున్నాను నాకు ఈ హెల్ప్ చెయ్యి. సరే అయితే నేను నాన్నతో మాట్లాడుతాను అని గీతిక అంటుంది. వచ్చేముందు కృష్ణ నన్ను ఆపి ఒక ప్రశ్న అడిగింది. ఏం అడిగింది నువ్వేం చెప్పావు అని అంటుంది ముకుందా, నిజం చెప్పేసావ అని అంటుంది. నిజం చెప్పలేదు చెప్తే నీకు ఎక్కడ ప్రాబ్లం అవుతుందో అని చెప్పలేదు. మురారి నీకు ఎప్పటి నుంచి తెలుసు అని అడిగింది. నిజం చెప్పేయాల్సింది మొత్తం కృష్ణ కి తెలియాలి. ఈసారి ఎప్పుడైనా అడిగితే, మొత్తం నిజం చెప్పేసేయ్ కృష్ణకు తెలిస్తే తన ఫీలింగ్స్ ఏంటో నాకు తెలియాలి అని అంటుంది ముకుంద గీతికతో, సరే ఈసారి అడిగితే నిజం చెప్తానులే అని అంటుంది గీతిక.

Krishna Mukunda Murari 22 June 2023 today 190 episode highlights
Krishna Mukunda Murari 22 June 2023 today 190 episode highlights

కృష్ణ ప్రశ్నలు..

మురారి ఫోన్లో గేమ్ ఆడుతూ ఉంటాడు. కృష్ణ వైట్ బోర్డు మీద నాలుగు ప్రశ్నలు రాసి, వాటికి సమాధానాన్ని అడుగుతుంది మురారిని. మొదటిది, వారసుడు, రెండవది మెట్టెలు, మూడోది హోమం, నాలుగోది దిష్టి. ఇవన్నీ అత్తయ్య మన చేత ఎందుకు చేయించింది అని అడుగుతుంది మురారిని. ఏమో ఎందుకు చేయించిందో అని మురారి గేమ్ ఆడుతూ అంటాడు. ఎసిపి సార్ ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు అని అంటుంది. అవునవును కృష్ణ అని అంటాడు. కృష్ణ ఫోన్ లాక్కొని ఇప్పుడు నేను ఏమి అడిగాను అని అంటుంది. అవును ఇప్పుడు ఏమి అడిగావు అని అంటాడు మురారి. అంటే మీరేం వినలేదు అన్నమాట అని అంటుంది. ఎందుకు వినలేదు విన్నాను అని అంటాడు. వింటే నేనేమన్నాను చెప్పండి అని అంటుంది. అమ్మ ఇవన్నీ ఎందుకుచేయిస్తుంది అని అడుగుతున్నావ్, అవును ఏ సి పి సార్ ఎందుకు చేయిస్తుంది అని అంటుంది కృష్ణ. ఎందుకు చేయిస్తుందో నాకు తెలుసు కృష్ణ అని అంటాడు. తెలిస్తే చెప్పండి అని అంటుంది. చెప్తాను కూర్చో అని ఎందుకంటే, ఎందుకంటే, నాకు కూడా తెలియదు కాబట్టి అని అంటాడు. ఏసిపి సార్ తెలుసని, తెలీదని ఇట్లా చెప్పకుండా ఉండడం పద్ధతి కాదు. అని ఇద్దరు గొడవ పడుతూ ఉండగా, రేవతి వస్తుంది రూమ్ లోకి, ఏంట్రా మీ ఇద్దరి గోల అని అంటుంది. బోర్డు మీద రాసి ఉన్న ప్రశ్నలను చూస్తుంది రేవతి. ఏంటి ఇప్పుడు వీటన్నిటికీ మీకు సమాధానం కావాలా అని అడుగుతుంది. అవును అని ఇద్దరు తల ఊపుతారు.

Krishna Mukunda Murari 22 June 2023 today 190 episode highlights
Krishna Mukunda Murari 22 June 2023 today 190 episode highlights

కృష్ణా మురారి లను బయటకి వెళ్ళమన్నా రేవతి..

ఈ ప్రశ్నలకు సమాధానంగా, బోర్డు మీద ఒక లవ్ సింబల్ బొమ్మ వేస్తుంది రేవతి. ఆ సింబల్ చూసి ఇప్పుడైనా అర్థమైందా అని అంటుంది. ఏమీ అర్థం కాలేదు అంటుంది కృష్ణ. అందుకే నేను తింగరి దానా అనేది అని అంటుంది రేవతి. అదే టైం కి అలేఖ్య రూమ్ బయటనుంచి వెళ్తూ వీళ్ళ ముగ్గురిని చూస్తుంది. ఏంటి రేవతత్తయ్య మళ్ళీ కృష్ణా మురారిల గదిలో ఉంది ఏదో ప్లాన్ వేస్తుంది అని అనుకుంటుంది. ఏం ప్లాన్ వేస్తుందో విందామని రూమ్ బయట నిలబడి మధు ని కూడా పిలుస్తుంది. ఇక రేవతి ఒకసారి మీ మెయిల్ చెక్ చేసుకోండి అని అంటుంది మురారితో, మురారి,కృష్ణ ఇద్దరు మెయిల్స్ చెక్ చేసుకుంటారు. అందులో వన్ వీక్ లీవ్ శాంక్షన్ అయినట్టుగా ఉంటుంది. ఇదేంటి కమిషనర్ గారి నుండి లీవ్ ఎలా తీసుకున్నావు అని అంటాడు మురారి. ఒక్క గంట లేటుగా వెళ్తేనే అరుస్తారు హాస్పటల్లో అట్లాంటిది, ఒక వారం రోజులపాటు సెలవా, అది నా పనులన్నీ గౌతమ్ సార్ చూసుకుంటారని మేడం చెప్పడం. ఏంటి అత్తయ్య ఇదంతా అని అడుగుతుంది కృష్ణ. మిమ్మల్ని ఇద్దరిని ఒక వారం రోజులు పాటు ఇంట్లో నుంచి బయటికి పంపిస్తున్న, అని అంటుంది రేవతి.మేమేం తప్పు చేశాం మమ్మీ బయటికి పంపించడానికి అని అంటాడు మురారి. ఏం తప్పు చేశారో మీకు తెలియదా అంటుంది రేవతి. కృష్ణ వామ్మో అగ్రిమెంట్ గురించి తెలిసిందా ఏంటి ఈవిడకి అని అనుకుంటుంది మనసులో, ఏం తప్పు చేసావ్ అత్తయ్య మీరే చెప్పండి అని అంటుంది. అన్ని నేనే చెప్పాలన్నమాట మీరేం చెప్పరు, నేనుఏం అడిగాను మిమ్మల్ని,ఏం అడిగారు అని అంటుంది కృష్ణ.వారసుని అడిగాను ఆ విషయం గురించే మాట్లాడుతున్న, హమ్మయ్య ఈవిడ కి అగ్రిమెంట్ తెలియలేదు.అని మనసులో అనుకుంటుంది కృష్ణ.మీరు రేపు ఉదయం కల్లా రెడీ అయ్యి మన ఫామ్ హౌస్ కి వెళ్ళాలి అని అంటుంది. ఫామ్ హౌస్ కి ఎందుకు మమ్మీ అని అంటాడు. మిమ్మల్ని వారం రోజులు పాటు అక్కడ ఉంచాలనుకుంటున్నాను. ఎందుకుఅంటుంది కృష్ణ. మా వంశాచారం ఇది మీ తాతయ్య,నాయనమ్మ, నేను మీ నాన్న, ఇప్పుడు నువ్వు,కృష్ణ,అక్కడ ఒక వారం రోజులు గడిపి రావాలి రేపు మీ పిల్లలు కూడా, ఏం వెళ్ళరా అని అంటుంది రేవతి. అయ్యో ఎందుకు వేల మమ్మీ ఇప్పుడే వెళ్లిపోతాం అని అంటాడు. అంత ఓవరాక్షన్స్ వద్దు. రేపు ఉదయం కల్లా రెడీగా ఉండండి. అక్కడ, ఫామ్ హౌస్ పనులు చేయిస్తున్నాను ఆ పనులన్నీ మీరేం చూడక్కర్లే ప్రశాంతంగా ఒక వారం ఉండి రండి. ఎన్ని రోజులు ఉండాలి అత్తయ్య అని అంటుంది కృష్ణ. కపుల్ ఆఫ్ డేస్, కపుల్ ఆఫ్ డేస్ అంటే కృష్ణ వెళ్దాం అని అంటాడు మురారి. రేపు ఉదయం కల్లా రెడీగా ఉండండి ఇందులో ఏ మార్పు లేదు అని రేవతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. బయట నుండి ఇదంతా వింటూ ఉంటారు అలేఖ్య మధు.

Krishna Mukunda Murari 22 June 2023 today 190 episode highlights
Krishna Mukunda Murari 22 June 2023 today 190 episode highlights
కృష్ణా మురారిల ఫామ్ హౌస్ గురించి ముకుందకు తెలియడం..

ముకుందా, గీతికతో వాళ్ళ నాన్నకి ఫోన్ చేయిస్తుంది. వాళ్ల నాన్నతో గీతిక ముకుందకు హెల్ప్ చేయమని అడుగుతుంది. వాళ్ల నాన్న సరే అమ్మ అని అంటారు. గీతిక నేను ఒక కాన్ఫరెన్స్ కాల్ లో ఉన్నాను. ఈ ఫోన్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం అని, తప్పకుండా ముఖం దగ్గర నేను హెల్ప్ చేస్తాను అని మాట ఇస్తాడు గీతిక ఫాదర్, గీతిక ముకుందతో మా నాన్న చెప్పిన మాటలు విన్నావు కదా ఇంక నేను బయలుదేరుతాను అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది అని చెప్తుంది. సరే అని గీతికని డ్రాప్ చేయడానికి కిందకి వస్తుంది, ముకుంద. అప్పుడే అక్కడ మధు అలేఖ్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అలేఖ్య ఇప్పుడు అత్తయ్య ఉన్నట్టుండి కృష్ణ మురారి లను ఎందుకు కలపాలనుకుంటుంది. ఏదో జరుగుతుంది అని అంటుంది మధు తో, నేను అదే ఆలోచిస్తున్నాను అని అంటాడు మధు. ఇప్పుడు ఉన్నఫలంగా వీళ్లిద్దరినీ ఫామ్ హౌస్ కి ఎందుకు పంపిస్తుంది అని అంటుంది అలేఖ్య. ఆ మాట ముకుంద వినేస్తుంది. ఏంటి అత్తయ్య వీళ్లిద్దరినీ ఫామ్ హౌస్ కి పంపిస్తుందా, అంటే మురారిని నా నుంచి దూరం చేయాలని బాగా బలంగా అనుకుంటుంది రేవతి అత్తయ్య. చూస్తాను మీ ఆటలు ఎలా సాగుతాయో అని అనుకుంటుంది ముకుందా, మధు మనం కూడా ఫామ్ హౌస్ కి వెళ్దామా అక్కడ వెకేషన్ చాలా బాగుంటుంది. అని అలేఖ్యని అడుగుతాడు. వాళ్ళేదో సరదాగా వెళ్దాం అనుకుంటే మనం ఎందుకు అని అంటుంది అలేఖ్య. అయినా నువ్వు ఇంటి వరస్ట్ వేగా నిన్ను ఎవరైనా వెళ్లమని చెప్పారా అనిఅంటుంది అలేఖ్య. వద్దు ఇప్పుడు నువ్వు నన్ను రెచ్చగొట్టడం నేను మా నాన్న దగ్గరికి వెళ్లి తిట్లు తినడం ఇవన్నీ ఏమీ వద్దు. మనం ఫార్మాస్ ప్రోగ్రాం క్యాన్సిల్ చేద్దాం సరేనా అని అంటాడు మధు.

Krishna Mukunda Murari 22 June 2023 today 190 episode highlights
Krishna Mukunda Murari 22 June 2023 today 190 episode highlights
రేవతి ఎత్తుకి ముకుందపై ఎత్తు…

ఈ మాటలన్నీ విని రూమ్ లోకి వెళ్లి ఆలోచిస్తూ ఉంటుంది. రేవతి అత్తయ్య మీరు పాతకాలం పద్ధతులు, ఉపయోగించి వాళ్ళిద్దర్నీ కలపాలి అనుకుంటున్నారు. కానీ నేను అలా కాదు న్యూ జనరేషన్, నా తెలివితేటలతో మిమ్మల్ని ఎలాగా ఇరికిస్తాను చూడండి.మీరు ఆట బానే ఆడుతున్నారు అనుకుంటున్నారు ఇప్పుడు ఆట నేను మొదలు పెడతాను.అష్టదిగ్బంధనం చేస్తాను.కలపడానికి పాములు కూడా ఉండవు.నా ప్రేమ గురించి మీకు అంతా చెప్పినప్పుడు,మీరు నన్ను అర్థం చేసుకొని ఉన్నట్లయితే,మనిద్దరం ది బెస్ట్ అత్త కోడలు, అయ్యుండే వాళ్ళమ్. కానీ మీరు, నా ప్రేమని అర్థం చేసుకోకుండ అట మొదలుపెట్టారు. మీరు వాడేది ఆట కాదు అత్తయ్య,యుద్ధం, ఈ విధంగా నేను రణ రంగాన్ని సృష్టించబోతున్నాను.
ఇక కృష్ణ మురారి ఇద్దరు నిద్ర పట్టక, ఒకేసారి లేచి కూర్చుంటారు. ఏంటి కృష్ణ నీకు నిద్ర పట్టట్లేదు అంటాడు మురారి. అవును ఏ సి పి సార్ మీకు కూడా నిద్ర పట్టట్లేదా అని అంటుంది కృష్ణ. నా దగ్గర ఒక వైద్యం ఉంది చిన్న ఉల్లిపాయను తీసుకొచ్చి దిండు కింద పెట్టనా అని అంటుంది. ఇప్పుడు అవన్నీ చేస్తే తెల్లారిపోతుంది కృష్ణ ముందు నాకు నిద్ర కావాలి. సరే నేను మిమ్మల్ని నిద్రపుచ్చుతాను.హిప్నటైజ్ చేస్తాను. నాకు సైకాలజీ తెలుసు కదా అని అంటుంది. సరే అని అంటాడు మురారి. రేవతి అత్తయ్య చెప్పిన మాటలన్నీ, నేను చెప్పిన మాటల్ని మర్చిపోండి అని అంటుంది.అమ్మ చెప్పిన మాటలు మర్చిపోకు గాని నీ మాటలు ఎలా మర్చిపోతాను కృష్ణ అని అంటాడు. మీరు నన్ను ప్రేమిస్తున్నారా నా తింగరి తనాన్ని ప్రేమిస్తున్నారా అని మనసులో అనుకుంటుంది కృష్ణ.

Krishna Mukunda Murari 22 June 2023 today 190 episode highlights
Krishna Mukunda Murari 22 June 2023 today 190 episode highlights

రేపటి ఎపిసోడ్ లో, కృష్ణ మురారి ఇద్దరు ఫామ్ హౌస్ కి వెళ్తారు. వాళ్లకు తెలియకుండా ముకుంద కూడా అక్కడికి వెళుతుంది. కృష్ణ ఫామ్ హౌస్ చూసి చాలా బావుంది ఎసిపి సార్. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పనా అని అంటుంది.మంచి టైం చూసుకొని,నేనే నీకు ఒక విషయం చెప్తాను కృష్ణ అని అనుకుంటాడు మనసులో మురారి. ఇదంతా దూరం నుండి ముకుంద వీడియో తీస్తూ ఉంటుంది. చూడాలి ముకుంద ఏం చేయనుందో…

 

Krishna Mukunda Murari: ముకుంద తన పగతో రేవతిని కూడా భయపెట్టిందా…

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella