Krishna Mukunda Murari: మురారి మనసులో మా పెద్దమ్మ నందినికి నా చేతుల మీదుగా పెళ్లి చేయమని చెప్పింది. ఆ విషయం నేను నీకు ఇప్పుడే చెప్పను కృష్ణ తర్వాత చెబుతాను. ఆ విషయం నీకు సర్ప్రైజ్ ఇస్తుంది అని మురారి మనసులో అనుకుంటాడు. ఇక కృష్ణ కూడా తన మనసులో నందిని గౌతమ్ సార్లకి పెళ్లి చేయాలి. ఆ విషయాన్ని నేను ఇప్పుడే చెప్పలేను నన్ను క్షమించండి అని కృష్ణ మనసులో అనుకుంటుంది. ముర్రి కిట్టి అంటూ కృష్ణ మురారి ముద్దుగా పిలుచుకున్న మాటలు తో ఒకరికొకరు మురిసిపోతూ ఉంటారు.. అంతలో గౌతమ్ అక్కడికి వస్తాడు.

మీరు ఇద్దరి మేజర్ లకు పెళ్లి చేయాలని చెప్పాను కదా.. ఆ మేజర్లలో ఒకరే గౌతమ్ సార్ అని చెప్పి తనని పరిచయం చేస్తుంది. ఇక మురారి కృష్ణ గౌతమ్ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా ప్రేమను గెలిపించాలి. అవతల పక్కన ఎలాంటి బ్యాగ్రౌండ్ ఉన్న సరే ప్రేమవైపే ఉండాలి అని మురారి కొటేషన్స్ మీద కొటేషన్స్ చెబుతాడు. అయ్యో ఏసీబీ సర్ ఆ బ్యాగ్రౌండ్ ఉన్న అమ్మాయి మన నందిని అని తెలిస్తే మీరేమవుతారో అని అనుకుంటుంది. రేపు ఆదివారం తిధి , వారం, బలం, ముహూర్తం అన్ని బాగున్నాయని మురారి ముహూర్తం కూడా చెప్పేస్తాడు.. మీ ఇద్దరి పెళ్లి చేసే బాధ్యత నాది మురారి మాట ఇస్తాడు. అలాగే నాకు మా పెద్దమ్మ ఇంకొక పని అప్పు చెప్పింది అది చూసుకుంటాను అని మురారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

భవాని వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉండగా రేవతి వాళ్లకి వెళ్లి కాఫీ ఇస్తుంది. అంతలో ఆ మాటలన్నీ మాట్లాడడం ఆపేయడంతో ఏం జరుగుతుంది. ఇంట్లో నాకు చెప్పండి అని రేవతి ఈశ్వరుని నిలదీస్తుంది. నేను మీ భార్యను అండి నాకైనా నిజం చెప్పండి అంటూ అరుస్తుంది ఏం లేదు అని అంటారు. ఈ ఇంట్లో ఏదో చేస్తున్నారు నా కోడలికి ఏదైనా జరిగితే నేను ఊరుకోను అని రేవతి అంటుంది.
మురారి వచ్చావా నేను నీతో చాలా విషయాలు మాట్లాడాలి రా పద బయటికి వెళ్దామని ముకుందా మురారిని బయటకు తీసుకోవాలని అడుగుతుంది. ఎందుకు అని అడగగానే నందిని పెళ్లి విషయం గురించి మాట్లాడాలి కదా అని అంటుంది. ఇంతకీ నందిని పెళ్లి ఎప్పుడు అని అడగగా ఈ ఆదివారం రోజే ఫిక్స్ చేశారు అని ముకుందా చెబుతుంది. అదేంటి ఆదివారం నేను గౌతమ్ కి ఫిక్స్ చేసింది కూడా అదే రోజు కదా అని మురారి మనసులో అనుకుంటాడు. ఇక ముకుందా మురారితో తను ఏవేవి పనులు చేయించుకోవాలనుకుంటుందో అవన్నీ చేయించుకుంటుంది.

ఇక రేపటి ఎపిసోడ్ లో కృష్ణ హాస్పిటల్ నుంచి తిరిగి రాగానే నువ్వు అనుకున్నది ఏమీ జరగవు అని భవాని అంటుంది ఇప్పుడిప్పుడే చిన్న చిన్న ఆపరేషన్లు కూడా చేయడం మొదలు పెట్టాను అత్తయ్య ఆపరేషన్ కచ్చితంగా సక్సెస్ అవుతుంది అని కృష్ణ భవానీతో చెబుతుంది ఆ మాటలకు ముకుందా కూడా షాక్ అవుతుంది అసలు ఏంటి ఈ మేటర్ నందిని విషయంలో ఎందుకు భవాని అత్తయ్య ఎంతగా కంగారుపడుతుంది కృష్ణుని చూసి అని అనుకుంటుంది. ఒక ఆపరేషన్ కూడా స్టార్ట్ చేశానని అది సక్సెస్ అవుతుంది అని భవానితో సూటిగా స్పష్టంగా చెబుతోంది. కృష్ణ ఏదో సీక్రెట్ ప్లాన్ చేస్తుందని భవానికి అర్థం అవుతుంది. ఇక ఏం జరుగుతుందో చూడాలి మరి.