NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: ముకుంద ప్లాన్ గోవిందా.. రేపటికి సూపర్ ట్విస్ట్..

Krishna Mukunda Murari Today Episode November 25 2023 Episode 323 Highlights

Krishna Mukunda Murari: కృష్ణ ఇంటికి నందు వస్తుంది. కృష్ణ గురించి తెలుసుకోవడానికి భవాని కూడా అక్కడికి చాటుగా వస్తుంది. కృష్ణ ఆలోచనా ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటుంది. నందు కి కృష్ణ బ్రెడ్ మీద పచ్చడి రాసి ఇస్తుంది. తిను నందు బాగుంటుంది అని అంటుంది. ఏంటి తినకుండా ఆలోచిస్తున్నావు అంటే నీ గురించే, మురారి అమెరికా వెళితే నువ్వు ఏమైపోతావు అని అంటుంది. ఏసిపి సార్ అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటే గతం గుర్తుకు వస్తుంది. అప్పుడు నన్ను వదిలి ఉండలేరు నా దగ్గరకు వచ్చేస్తారు అని కృష్ణ అంటుంది. ఇదంతా భవాని చాటుగా వింటుంది. నాకు ముకుంద గురించే బెంగ అంతా, అవ్వని వాటి గురించి తన లైఫ్ స్పాయిల్ చేసుకుంటుంది అని అంటుంది. తన పక్కన మా అమ్మ ఉంది, తన సపోర్ట్ ఉంది అదే నా భయం అని నందు అంటుంది. భవాని బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నువ్వు ఇంకొంచెం తిను అని నందుకి బ్రెడ్ తినిపిస్తుంది కృష్ణ.

Krishna Mukunda Murari Today Episode November 25 2023 Episode 323 Highlights
Krishna Mukunda Murari Today Episode November 25 2023 Episode 323 Highlights

వేణి గారు ఏంటి నా మీద కోపం వచ్చిందా లేదంటే నేనేమైనా తప్పు చేశానా అని మురారి కృష్ణ ఆటో ఎక్కబోతుంటే అడుగుతాడు. ఏంటి వేణి గారు మీరు ఆటోలో వెళ్ళడం ఎందుకు. నాతో చెబితే నేను కార్ లో దింపుతాగా అని అంటాడు. పదండి పదండి నేను మిమ్మల్ని తీసుకు వెళతాను అంటాడు. ఇదంతా భవాని మేడ మీద నిలబడి చూస్తూ ఉంటుంది. కృష్ణ మనసులో నేను మా చిన్నాన్న దగ్గరకు వెళ్తున్నాను , అక్కడ ఆయన ఏమైనా నోరు జారితే మీరు బాధపడతారు అని అనుకుంటుంది. పదండి పదండి నేను కూడా మీతో పాటు వస్తాను అని మురారి అంటాడు. వద్దులేండి ఏసిపి సర్ నేను హాస్పటల్లో అర్జెంటు కేసు విషయమై వెళ్తున్నాను మీరు వచ్చిన అక్కడ నా కోసం ఎదురు చూస్తూ ఉండాలి. నేను వచ్చిన తర్వాత మీ దగ్గరికి వస్తాను అని కృష్ణ మురారి కి సర్ది చెబుతుంది. సరేనా సార్ అనగానే, ఓకే అని అంటాడు.
ఇదంతా భవాని చూస్తూనే ఉంటుంది.

Krishna Mukunda Murari Today Episode November 25 2023 Episode 323 Highlights
Krishna Mukunda Murari Today Episode November 25 2023 Episode 323 Highlights

భవాని కృష్ణ మాట్లాడిన మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ముకుంద అక్కడికి వస్తుంది. మీ మాట ఈ ఇంట్లో ఎవ్వరూ వినడం లేదని ముకుందా చాడీలు చెప్పడానికి ప్రయత్నిస్తుంది అవును వాళ్ళందరూ కృష్ణ మురారి కలవాలని అనుకుంటున్నారు ఆ నిర్ణయాన్ని నువ్వు నేను కూడా గౌరవిద్దాం అని భవాని అంటుంది ఆ మాట వినగానే ముకుంద షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అని అంటుంది నేను చెప్పే మాట వినాల్సింది నువ్వు కాదు ఆ కృష్ణ అందుకే తనని బ్రేక్ఫాస్ట్ కి రమ్మని పిలిచాను అని భవాని అంటుంది. అప్పుడు నా నిర్ణయం చెబుతాను అని అంటుంది. ముకుంద బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

Krishna Mukunda Murari Today Episode November 25 2023 Episode 323 Highlights
Krishna Mukunda Murari Today Episode November 25 2023 Episode 323 Highlights

ముకుంద కొత్త చూసి మధు ఆశ్చర్యపోతాడు కారణం ఏంటి ముకుందా అని మధు అడుగుతాడు ఈ డ్రెస్ కనుక చాలా ఆచంచలమైన ప్రేమ అనురాగం ఆప్యాయత ఉన్నాయి అని ముకుందా అంటుంది. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా మురారి నీకు ఎప్పటికీ సొంతం కాడు. మురారి కృష్ణకు మాత్రమే సొంతం అని మధు ముకుంద కి స్ట్రాంగ్ గా చెబుతాడు. ఇక ఇంట్లో వాళ్ళందరూ ఎందుకు కృష్ణుని భవాని అక్క టిఫిన్ కి పిలిచిందా అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే మధు వచ్చి తిక్క తిక్క సమాధానాలు అన్ని చెప్పి అందరి మూడు స్పాయిల్ చేస్తాడు.

Krishna Mukunda Murari Today Episode November 25 2023 Episode 323 Highlights
Krishna Mukunda Murari Today Episode November 25 2023 Episode 323 Highlights

ముకుంద ను చూసి మురారి నీకోసమే వెయిట్ చేస్తున్నా అంటాడు. సిక్స్ మంత్స్ పట్టొచ్చు సిక్స్ ఇయర్స్ పెట్టొచ్చు అయితే ఇప్పుడు ఏంటి అని ముకుందా మురారిని నిలదీస్తుంది. అమ్మో ఆరు నెలలు కృష్ణవేణి నిన్ను చూడకుండా ఉండాలా అని మురారి మనసులో అనుకుంటాడు. అన్ని రోజులు ఈ ఇంటిని చూడకుండా ఎలా ఉండాలి అని మురారి అంటే నువ్వు ఒక్కడికే కాదు కదా, నీతో పాటు నేను కూడా ఉంటాను కదా అని ముకుందా అంటుంది. చూడు మురారి నీ బాధ ఏంటో నాకు అర్థమైంది దూరం పెట్టవలసిన వాళ్ళని దగ్గర చేసుకుంటే.. ఇలాగే ఉంటది అని ముకుందా అంటుంది. పదేపదే ఇలా చిన్నపిల్లాడిలా చెప్పించుకోడానికి నీకు ఎలా ఉందో నాకు తెలియదు అని ముకుందా అనగానే.. మురారి సీరియస్ అవుతూ అవును చిన్న పిల్లాడినే మీరు ఏం చెప్పినా గొర్రె లాగా తలుపుతున్నాను కదా అని అంటాడు. అంటే మేము అబద్దం చెబుతున్నావా అని ముకుందా అడుగగా నేను అబద్ధం అనను కానీ నాకెందుకో నమ్మబుద్ధి కావడం లేదు అని మురారి అంటాడు. మురారి ఆరు రోజులు అవ్వచ్చు ఆరునెలలు మనం దేనికైనా సిద్ధమయ్యే వెళ్తున్నాం కదా అని ముకుందా అంటుంది. మురారి నేను చాలా హర్ట్ అయ్యాను అని ముకుందా టాపిక్ డైవర్ట్ చేస్తుంది. పెద్దమ్మ నిన్నేమైనా అన్నారంటే అత్తయ్య నన్ను ఎందుకు అంటారు అని ముకుందా అనగానే.. అవును నువ్వు పెద్దమ్మకి చాలా ఇష్టం అని అనగానే నేనే కాదు నువ్వంటే కూడా చాలా ఇష్టం అని ముకుందా అంటుంది. అవును మురారి అందుకే మీ కేరింగ్ అంతా నాకే అప్పగించారు. పెద్దత్తయ్యకు మనిద్దరం అంటే అంత ఇష్టం.

Krishna Mukunda Murari Today Episode November 25 2023 Episode 323 Highlights
Krishna Mukunda Murari Today Episode November 25 2023 Episode 323 Highlights

మరి నాకేంటి ఇంట్లో ఎవరి మీద అంత ఇష్టం లేదు. ఒక్క వేణి గారిని పదేపదే చూడాలని అనిపిస్తుంది, ఎందుకిలా అని మురారి మనసులో అనుకుంటాడు. అవును ఇందాక ఎందుకు హర్ట్ అయ్యాను అన్నావు అనే అడిగితే చూడు నేను నీకోసం మోడ్రన్ డ్రెస్ వేసుకున్నాను. కనీసం బాగుంది అని కూడా చెప్పలేదు అని ముకుందా అంటుంది. నీకు మోడల్ డ్రెస్ బాగోలేదు, సారీస్ మెయింటైన్ చెయ్ చాలా బాగుంటుంది అని మురారి అంటాడు. ఫస్ట్ ఈ గెటప్ చేంజ్ చేసుకో సారీ కట్టుకో అని మురారి చికాకుగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ముకుంద షాక్ అవుతుంది. మొత్తానికి ముకుంద మోడ్రన్ డ్రెస్ ప్లాన్ గోవిందా మురారి చిరాకు బోనస్గా ముకుంద కి ఇచ్చాడు. నేటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో ప్రస్తుతానికి సస్పెన్స్.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu