Kumkuma Puvvu November 6 episode 2019: ఇక ఆశ మాత్రం హాస్పిటల్లో ఉన్న బంటీ ని చంపడానికి వస్తూ అటు ఇటు చూస్తూ బంటీ ఉన్న రూంలోకి వెళ్లి పూర్ బంటి కాసేపట్లో నా చేతుల్లో చావబోతున్నావు అని అనుకుంటుంది ఆశ. నువ్వు బ్రతికితే నేను చస్తాను నేను బ్రతకాలంటే నువ్వు చావాల్సిందే అని అనుకుంటుంది ఆశ. ఆశ వెడ్స్ బంటి అని పెళ్లి శుభలేఖలు వేయించుకొని నీతో తాళి కట్టించుకుని నిన్ను నా రక్షణ కవచంగా వాడుకుందాం అని చూస్తే కానీ,పెళ్లికి ముందే నీకు నా గురించి నిజం తెలిసిపోయి ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు కానీ, ఇప్పుడు ఏం పర్వాలేదు నా గురించి నిజం తెలిసినందుకు నువ్వు చావాల్సిందే తప్పదు అని మనసులో అనుకుంటుంది ఆశ.జాలిగా నాతో హనీమూన్ కి రావలసిన వాడివి కానీ ఇప్పుడు సోలో గా హాస్పిటల్ లో పడి ఉన్నావు అని అంటుంది ఆశ.అయితే ఇప్పుడు సోలోగానే చావు బంటి ఓకే బాయ్ హ్యాపీ డెత్ జర్నీ అంటూ బంటి ముక్కుకు ఉన్న మాస్కుని తీసి చూస్తూ ఉంటుంది ఆశ.

అదే సమయంలో అరుణ్ కుమార్ అమృత ఇద్దరూ బంటి నుదుటున ఎలాగైనా,ఈ అమ్మవారి కుంకుమను పెట్టాలని బంటి దగ్గర ఎవరు అయినా ఉన్నారా లేదా అని చూసుకుంటూ, ఒకవేళ అక్క ఉంటే మాత్రం మనల్ని ఈ కుంకుమ బంటికి పెట్టనివ్వదు అని అనుకుంటూ ఎవరూ లేని సమయం చూసుకొని, అమృత అరుణ్ కుమార్ గారు బంటి గదిలోకి వస్తారు గదిలోకి వచ్చిన అమృత అరుణ్ కుమార్ ను ఆశ చూసి పక్కకు వెళ్లి దాచుకుంటుంది. అమృత అరుణ్ కుమార్ బంటి ముక్కుకు ఉన్న మాస్క్ పడిపోయి అతను ఆయాసంతో కొట్టు,కుంటూ ఉండగా అది చూసినా అమృత అరుణ్ కుమార్ గారు డాక్టర్ గారు డాక్టర్ గారు నర్స్ నర్సు అంటూ వారిని పిలిచి ఏంటి ఇలా జరిగింది చూసుకోవాలి కదా మీరు అని అంటారు. అప్పుడు నర్స్ వచ్చి అయ్యో నేను ఇప్పుడే బయటికి వెళ్లాను కానీ ఇది ఎలా జరిగిందో నాకు తెలియదు. ఇమీడియట్గా ఇప్పుడు అతనికి యాంటీ బయటిక్ ఇంజక్షన్ ఇవ్వాలి అని అంటూ నర్సు బంటి కి ఇంజక్షన్ ఇస్తూ ఉండగా అమృత అరుణ్ కుమార్ టెన్షన్తో అతని వైపు చూస్తూ ఉండగా ఆశ మాత్రం వారి వెనుక తప్పించుకొని చ మిస్ అయ్యాడు అనుకుంటూ బయటికి వెళ్లిపోతుంది ఆశ.

ఇక అమృత అరుణ్ కుమార్ వాళ్ళు బయటికి వస్తారు అదే సమయంలో కావేరి,కావేరి భర్త నడుచుకుంటూ వస్తూ ఉంటారు వాళ్లని చూసి అరుణ్ కుమార్ గారు బావ ఎక్కడికి వెళ్లారు అక్క ఎక్కడికి వెళ్లారు అని అడుగుతారు.అప్పుడు కావేరి కునుకు పాట్లు పడ్డ కంటికి కనుక్కుపడితే కదా అని అంటుంది కావేరి. అప్పుడు కావేరి భర్త ఏమీ లేదు బామ్మర్ది కాసేపు అలా బయటికి వెళ్లొద్దాం పద కాఫీ అన్న తాగుదామని మీ అక్కని నేనే బలవంతంగా తీసుకువెళ్లాను. కానీ ఇంతలోపు ఇలా జరుగుతుందని అనుకోలేదు అయినా గాని నర్సులు ఎమర్జెన్సీలో ఉన్న పేషంట్లకి ఎప్పుడు ఏమీ అవసరం ఉంటుందో చూసుకుంటారు కదా.నర్స్ ఎటు వెళ్ళింది అని అడుగుతాడు అప్పుడు.అప్పుడు అరుణ్ కుమార్ గారు ఏం టెన్షన్ లేదు బావ నర్సు వచ్చింది చూసింది ఏమి పర్వాలేదు బావ అని అంటాడు అరుణ్ కుమార్. అప్పుడే ఆశ కూడా నడుచుకుంటూ వచ్చి ఆంటీ ఏమైంది అని కావేరి అని అడుగుతుంది.అప్పుడు కావేరి ఆశ ఏమీ లేదమ్మా బంటి ముక్కుకు ఉన్న మాస్క్ పడిపోయిందట అని చెబుతుంది అయ్యో అయితే వెళ్లి చూద్దాం పదండి ఆంటీ అని అంటుంది

ఆశ అప్పుడు అమృత మాత్రం ఏం అక్కర్లేదు ఇప్పుడు మేము వెళ్లి చూసి వచ్చాము. అయినా మేము గుడికి వెళ్లి అమ్మవారి కుంకుమ తీసుకువచ్చి బంటి నుదుటన పెట్టాము బంటి ఎలాగైనా కోలుకుంటాడు ఏం పర్వాలేదు అని అంటుంది అమృత. అప్పుడు ఆశ దొంగ ఏడుపుతో ఆంటీ నాకు చచ్చిపోవాలని అనిపిస్తుంది. బంటి లేని జీవితం నాకు వద్దు అని దొంగ ఏడుపు ఏడుస్తూ ఉంటుంది ఆశ. అప్పుడు కావేరి ఆశని ఏడవకమ్మ బాధపడకు ఎలాగైనా బంటి నీకోసమైనా బ్రతుకుతాడు అని అంటుంది కావేరి. ఇక సాగర్ వాళ్ళ ఇంట్లో ఉన్న అంజలి మాత్రం ఏడుస్తూ, ఆ లక్ష్మీ ఫోటో వైపు చూస్తూ చూశావా లక్ష్మి నీకు ఇచ్చిన మాట ప్రకారం నీ కూతురికి తల్లి ప్రేమను అందించాను.కానీ ఆరోజు నీకు ఇచ్చిన మాట ప్రకారం నేను నీ కుటుంబాన్ని నిలబెట్టినందుకు నేను మాత్రం నా కుటుంబానికి దూరం అవుతూనే ఉన్నాను.నా భర్త చావు బతుకుల మధ్యలో ఉన్న కానీ,నేను అతని దగ్గర కి వెళ్లలేని పరిస్థితి కానీ సాగరం మాత్రం నా సహనాన్ని పరీక్షిస్తున్నాడు. సాగర్ మాత్రం ఇలాగే చేస్తే ఎంత కాలం ఓపిక పట్టను. నేను ఎంత కాలం సహించను తెగేదాకా లాగితే నా అజ్ఞాతవాసానికి ముగింపు చెప్పక తప్పదు అని లక్ష్మీ ఫోటో తో మాట్లాడుతూ ఉంటుంది అంజలి.ఐసీయూలో ఉన్న డాక్టర్స్ మాత్రం పేషెంట్ కండిషన్ ఏమాత్రం అర్థం కావడం లేదు తలకి అంత పెద్ద గాయం అయితే తగలలేదు.కానీ ట్రీట్మెంట్ కు ఎందుకు రెస్పాన్స్ ఇవ్వడం లేదు అర్థం కావడం లేదు అని డాక్టర్స్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు

అయితే షాక్ ట్రీట్మెంట్ ఇవ్వనా అని అంటాడు ఏమీ అవసరం లేదు అని ఇంకో డాక్టర్ అంటాడు కానీ బయట కూర్చుని ఉన్నా కావేరి అమృతవాళ్లు ఈ డాక్టర్స్ బయటికి వచ్చి ఇంకా ఏమి చెప్పడం లేదు ఏంటి అని అంటారు.ఇంతలోనే లోపల బంటీ మాత్రం మనసులో అంజలి అంజలి అనుకుంటూ అంజలిని తలుచుకుంటూ అంజలి పేరు పిలుస్తూ ఉండగా డాక్టర్స్ మాత్రం గుడ్ పేషెంట్ దారిలోకి వచ్చాడు. అయితే అంజలి పేరు పిలుస్తున్నాడు అంటే ఇతనికి అంత గుర్తుంది అని నర్స్ తో వాళ్లని లోపలికి రమ్మని చెప్పు అని నర్స్ ని పంపిస్తారు అప్పుడు నర్స్ వెళ్లి డాక్టర్ మిమ్మల్ని రమ్మంటున్నారు అని వాళ్ళని పిలుస్తారు కావేరి అమృత వాళ్ళు లోపలికి వెళ్లి బంటీ అని ఏడుస్తూ ఉండగా డాక్టర్ మాత్రం అతను మనసులో మాత్రం అంజలి అని పిలుస్తున్నాడు అంజలి ఎవరు అని అడుగుతారు డాక్టర్.

అయితే ఆ అంజలి నీ త్వరగా పిలిపించండి లేదంటే అతని ప్రాణాలకు ప్రమాదం అని అంటాడు డాక్టర్.ఇక కావేరి ఆశ మాత్రం అక్కర్లేదు అంజలిని తీసుకురావడానికి కుదరదు డాక్టర్ గారు అని అంటారు. అప్పుడు డాక్టర్ తప్పదమ్మ అంజలి రాకపోతే అతను కోమాల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది అని అంటారు అప్పుడు ఇక అమృత కావేరి వాళ్ళు బయటికి వచ్చి ఎలా అని మాట్లాడుకుంటూ ఉంటారు.అప్పుడు ఆశ ఎలాగైనా అంజలిని మాత్రం తీసుకురావద్దు అని మనసులో అనుకుంటూ ఉంటుంది.అమృత మాత్రం అరుణ్ కుమార్ మాత్రం అక్క ఎలాగైనా అంజలిని తీసుకువద్దం లేదంటే మన బంటి ప్రాణాలకి ప్రమాదం అంటున్నారు కదా డాక్టర్ అని అంటాడు. అప్పుడు కావేరి మాత్రం ఏమీ అవసరం లేదు మళ్లీ ఆ లక్ష్మిని తెచ్చి నెత్తిన పెట్టుకొని ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం తప్ప ఏమీ లేదు అని అంటుంది కావేరి.అప్పుడు ఆశ అవునండి కరెక్ట్ గా చెప్పారు అని అంటుంది. అప్పుడు కావేరి భర్త కావేరి ఒకసారి ఆలోచించు మన బంటి ని మనమే చంపుకుందామా అని అంటాడు కావేరి భర్త.