త్రివిక్ర‌మ్ సినిమాకు మ‌హేశ్ అన్ని కోట్లు అందుకుంటున్నాడా..?

Share

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు ఇటీవ‌లె `స‌ర్కారు వారి పాట‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈయ‌న త‌న త‌దుపరి చిత్రాన్ని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో చేయ‌బోతున్నాడు. వీరిద్ద‌రి కాంబోలో వ‌స్తోన్న హ్యాట్రిక్ చిత్ర‌మిది. ఇప్ప‌టికే వీరిద్ద‌రూ క‌లిసి అత‌డు, ఖ‌లేజా చిత్రాలు వ‌చ్చాయి.

ఇవి క‌మ‌ర్షియ‌ల్‌గా హిట్ అవ్వ‌క‌పోయినా.. ప్రేక్షకుల‌ను మాత్రం బాగానే అల‌రించాయి. దీంతో వీరి హ్యాట్రిక్ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితం కానున్న ఈ మూవీ ఆగ‌స్టు నెల నుండి సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతోంది. మ‌హేశ్‌కు ఇది 28వ ప్రాజెక్ట్ కావ‌డంతో.. `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ షూటింగ్‌ను స్టార్ట్ చేయ‌బోతున్నారు.

ఇందులో టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించ‌బోతోంది. ఇక‌పోతే ఈ మూవీకి మ‌హేశ్ బాబు అందుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అందుతున్న తాజా స‌మాచారం ప్ర‌కారం.. త్రివిక్ర‌మ్ సినిమాకు గానూ మ‌హేశ్ ఏకంగా రూ. 70 కోట్ల పారితోషికం అందుకుంటున్నార‌ట‌.

ఇంత‌కు ముందు ఒక్కో సినిమాకు రూ. 50 కోట్లు తీసుకునేవారు అన్న టాక్ ఉంది. కానీ, ఇప్పుడు ఇర‌వై కోట్లు పెంచి రూ. 70 కోట్లు డిమాండ్ చేశార‌ట‌. మ‌హేశ్ స‌క్సెస్ రేటు దృష్ట్యా అంత మొత్తం ఇచ్చేందుకు నిర్మాత‌లు ఓకే చెప్పార‌ని అంటున్నారు. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియ‌దు గానీ.. ఈ న్యూస్ మాత్రం నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. కాగా, త్రివిక్ర‌మ్ మూవీ అనంత‌రం మ‌హేశ్ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళితో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను ప‌ట్టాలెక్కించ‌నున్నాడు.


Share

Recent Posts

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

28 నిమిషాలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

31 నిమిషాలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

48 నిమిషాలు ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

1 గంట ago

నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గించే డ్రింక్స్..!

ప్రతి స్త్రీ యొక్క జీవితంలో పీరియడ్స్ రావడం అనేది సాధారణ ప్రక్రియ. అలాగే స్త్రీ యోక్క ఆరోగ్యం విషయంలో కూడా పీరియడ్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి…

2 గంటలు ago

“SSMB 28” ఆలస్యం కావడానికి కారణం అదేనట..??

"SSMB 28" వర్కింగ్ టైటిల్ తో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు ఈ ఏడాది…

2 గంటలు ago