Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం “గుంటూరు కారం” జనవరి 12వ తారీకు విడుదల కాబోతోంది. మహేష్ బాబు నుండి దాదాపు రెండు సంవత్సరాల తర్వాత సినిమా విడుదల కాబోతోంది. గతంలో 2022లో మే నెలలో “సర్కారు వారి పాట” విడుదల అయింది. ఆ సినిమా తర్వాత మరో సినిమా రిలీజ్ కాలేదు. మధ్యలో మహేష్ బాబు తన కుటుంబ సభ్యులను కోల్పోవడం జరిగింది. “సర్కారు వారి పాట” సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగానే “గుంటూరు కారం” సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. కానీ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్య సమయానికి సినిమా నుండి మొదట హీరోయిన్ అనుకున్న పూజ హెగ్డే మరి కొంతమంది టెక్నీషియన్స్ ప్రాజెక్ట్ మధ్య నుండే డ్రాప్ అయ్యారు.
ఆ తర్వాత హీరోయిన్ గా శ్రీలీలనీ తీసుకుని శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. మొదట గత ఏడాది ఏప్రిల్ నెలలో సినిమా రిలీజ్ చేయాలని భావించారు. కానీ అప్పటికే షూటింగ్ కనీసం సగం కూడా పూర్తికాలేదు. ఈ క్రమంలో దసరా పండుగకు విడుదలవుతుందని భావించారు. అప్పటికి కూడా షూటింగ్ పూర్తి కాకపోవడంతో చిరాకరికి సంక్రాంతికి ఫిక్స్ చేసి ఇప్పుడు… జనవరి 12వ తారీకు సినిమా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి జనవరి 9వ తారీకు ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో నిర్వహించడం జరిగింది. మహేష్ కుటుంబ సభ్యులు మరణించిన తర్వాత తొలిసారి అభిమానులతో పూర్తిస్థాయిలో ఇంట్రాక్ట్ అయిన ఈ కార్యక్రమం ఎమోషనల్ వాతావరణంతో నిండుకుంది.
మహేష్ బాబు ఇచ్చిన స్పీచ్ అభిమానులకు కంటనీరు పెట్టించింది. నా అభిమానులే ఇకనుండి నా తల్లిదండ్రులని మహేష్ చాలా ఎమోషనల్ గా స్పీచ్ ఇవ్వడం జరిగింది. గత సినిమా వేడుకలకు భిన్నంగా “గుంటూరు కారం” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ స్పీచ్ ఇవ్వటం జరిగింది. అయితే కార్యక్రమం ఊహించిన దాని కంటే విజయవంతం కావడంతో మరోసారి అభిమానులను ఉద్దేశించి ట్విట్టర్లో మహేష్ సంచలన పోస్ట్ పెట్టారు. “గుంటూరుకి ధన్యవాదాలు. నా సొంత ఊరిలో అంత మంది అభిమానుల మధ్యలో ఈవెంట్ జరుపుకోవడం నా చిరకాలం ఒక మంచి జ్ఞాపకంలా ఎప్పటికీ ఉండిపోతుంది. జై సమయంలో అభిమానులను ఉద్దేశించి మా సూపర్ ఫ్యాన్స్ నేను మరొక ముందడుగు వేస్తూ మిమ్మల్ని చూడటానికి రెడీగా ఉన్నాను. గుంటూరు కారంతో సంక్రాంతి ప్రారంభం కాబోతోంది. ఇదే సమయంలో గుంటూరు పోలీస్ శాఖకి… నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నిన్న జరిగిన కార్యక్రమానికి మీరు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేనిది” అంటూ..మహేష్ ట్వీట్ చేశారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!