Malli Nindu Jabili ఏప్రిల్ 26: మీకు మీరా కు పుట్టిన బిడ్డ గురించి తెలుసుకొని వొచ్చింది మాలిని అని శరత్ ను వసుంధర నిలదీయటం తో మల్లి నిండు జాబిలి ఏప్రిల్ 26 నేటి ఎపిసోడ్ 344 మొదలవుతుంది. క్రితం ఎపిసోడ్ లో మాలిని నేలకొండపల్లి రహస్యాలను తెలుసుకొని పట్నం లో ఉన్న తల్లి వసుంధర కు చెప్పేస్తుంది. దీనితో పూర్తి ఉగ్రరూపం దాల్చిన వసుంధరను మనం చూస్తాం… అంతే మల్లి ఇంకా అరవింద్ కూడా పట్నం లో ఉన్న అరవింద్ ఇంటికి చేరుకుంటారు. ఇక ఈ రోజు మల్లి నిండు జాబిలి ఎపిసోడ్ 344 లో ఏం జరిగిందో తెలుసుకుందాము.

సీతారాముల కళ్యాణం లో మాలిని అరవింద్ పేర్ల మీద పూజ చేయించాను అని మల్లి అరవింద్ కుటుంబానికి అబద్ధం చెప్తుంది. ఈ విషయం గురించి కంగారుపడుతూ తన తల్లి మీరా తో మాట్లాడదాం అని పెల్లెకు ఫోన్ కాల్ చేస్తుంది. మీరా ఫోన్ లో మాట్లాడుతూ…ఇంటికి చేరుకున్నావు కదా మల్లి, సీతారాముల కళ్యాణం నాడు ఇద్దరు పీటలమీద సక్కగా కూర్చున్నారు అది చూసి నా మనసంతా ఆనందం తో నిండిపోయింది అని అంటుంది … అప్పుడు మల్లి అమ్మ కల్పన టీచర్ పట్నం బయల్దేరిందా అని అడుగుతుంది. నా గురించి గాని అరవింద్ బాబు గురించి కానీ ఏమైనా అడిగిందా అని అరా తీస్తుంది మల్లి. నీ గురించి మొత్తం చెప్పేసాను కాదమ్మా ఇంక పంతులమ్మ అడగటానికి ఏముంది ఏదేమైనా పెద్ద గండం తప్పినాది అని అంటుంది మీరా.
Malli Nindu Jabili ఏప్రిల్ 26: బయటపడిన మల్లి ఆడిన అబద్ధం
ఇలా ఫోన్ లో మీరా తో మల్లి మాట్లాడటం వింటుంది రూప…కల్పన ఎవరు మల్లి అని అడుగుతే మా కాలేజీ టీచర్ అమ్మ అని చేబుతుంది మల్లి. నాకు నువ్వు ఎప్పుడు నిజం చెప్తావు అని అనుకుంటున్నా అని రూప అనడంతో మల్లి రూపకు నిజం చెప్పేస్తుంది. నాకు ఈ ఇంట్లో ఉన్నది మీరే అమ్మ గారు ఏదైనా మీతోటె మాట్లాడగలను. కల్పన అని పేరు మార్చుకొని మా ఉరి వొచ్చింది మాలిని అక్క… ఎందుకు అని అడిగితే ఏవో రహస్యాలు తెలుసుకోవటానికి అని చెప్పింది… సీతారాముల కళ్యాణం లో నేను పూజ చేయించింది అరవింద్ మాలిని గారికి కాదు నాకు అరవింద్ బాబు గారికి అని నిజం చెప్తుంది ఇంతలో అక్కడికి వొచ్చిన సుమిత్ర ఇదంతా వింటుంది. సుమిత్ర కోపంతో రగిలిపోతూ ఎంత మోసం చేసావే అని మల్లి చేయిపట్టుకుని లాక్కెళ్తుంది.

మల్లి గురించి నిజం అరవింద్ కుటుంబం తెలుసుకుందా
మల్లి కి రూప కి మధ్య జరిగిన సంభాషణ విన్న సుమిత్ర మల్లి లాక్కుని ఇంట్లో కింద మాట్లాడుకుంటున్న భార్గవరామ్ రామకృష్ణలు దెగ్గరికి తీసుకువెళ్లి కింద పడేస్తుంది. అప్పుడే అక్కడకు అరవింద్ తల్లి అనుపమ కూడా వొస్తుంది. ఏమైంది సుమిత్ర అని తన భర్త భార్గవరామ్ అడుగుతాడు… అప్పుడు సుమిత్ర ఇలా అంటుంది ‘పాముకి పాలు పోసి పెంచితే ఏనాటికైనా మనల్ని కాటేస్తుంది అని అంటారు కాదండి ఈ మల్లి కూడా అలానే చేసింది’. అనుపమ సుమిత్ర వొంక చూస్తూ ఎం చేసింది అక్క అని అడుగుతుంది. నమ్మకద్రోహం అని సుమిత్ర సమాధానం ఇస్తుంది.

మాలిని అరవింద్ పేర్ల మీద పూజ చేయించటానికి వెళ్ళాను అని చెప్పింది కదా, కానీ ఇది వెళ్ళింది అరవింద్ తో… మనకు చెప్పినట్లు అరవింద్ మాలిని పేర్లు మీద పూజ చేయించకుండ అరవింద్ తో కలిసి దీని పేరు మీద పూజ చేయించుకుంది. మన దెగ్గర ఇలాంటి అబద్ధాలు చెప్పిన దీనిని మనం ఎమ్ చేయాలి అని అడుగుతుంది సుమిత్ర.
Malli Nindu Jabili Serial ఏప్రిల్ 26: ఆవేశంలో అరవింద్ తల్లి అనుపమ
నా కొడుకుతో కలిసి పూజలు చేయించుకోవాల్సింది నా కోడలు మాలిని నువ్వు ఎమ్ సంబంధం ఉంది అని చేయించుకున్నావు అని మల్లి ని నిలదీస్తుంది అరవింద్ తల్లి అనుపమ. అది నేను కావాలని చేయలేదు అమ్మ గారు అక్కడ అనుకోకుండా అలా జరిగిపోయింది అని మల్లి సమాధానం ఇస్తుంది.
అనుకోకుండా ఎలా జరుగుతుంది మల్లి నిన్ను ఎవరైనా తాడుతో బంధించి పీటల మీద కూర్చోపెట్టారా? అని అరవింద్ తండ్రి రామకృష్ణ మల్లిని అడుగుతాడు. నీ గురించి మంచిగా ఆలోచించుకునే లోపే నువ్వు ఇలా క్షమించరాని పెద్ద తప్పులు చేస్తున్నావు, అసలు నీ ఉద్దేశం ఏంటి అని భార్గవరామ్ అడుగుతాడు.

Krishna Mukunda Murari: కృష్ణ తలకి గన్ గురి పెట్టిన భవాని.. మళ్ళీ ఏం చేసింది.!?
మల్లిని కొట్టబోయిన సుమిత్ర
నీలాంటి వాళ్లకు నోటితో చెప్తే సరిపోదే అంటూ మల్లిని చెంప మీద కొట్టబోతుంది సుమిత్ర… ఇంతలో రూప వొచ్చి తల్లి సుమిత్ర చేయి పట్టుకుని మల్లిని కొట్టకుండా ఆపేస్తుంది. ఈ మధ్య కాలంలో మల్లికి నీ సపోర్ట్ ఎక్కువై పోయిందే ఇలాంటి పనులు చేస్తున్న దాన్ని నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావ్? అంటూ కూతురిని తిడుతుంది సుమిత్ర. పూజ పీటల మీద పెళ్లి చేసుకున్నవారో లేదా పెళ్లి చేసుకోబోయేవారో కూర్చోవాలి కానీ ఎం అర్హత ఉందని మల్లి కూర్చుంటుంది అని అనుపమ రూపాను అడుగుతుంది.

ఏ అర్హతతో అంటే అని రూప చెప్పబోయేలోపే మల్లి అడ్డుపడి నాకు ఏ అర్హత లేదు అమ్మగారు తప్పు చేశాను అని ఏడుస్తూ నిజం బయటకి రాకుండా ఉండేలా ప్రయత్నిస్తుంది. ఇంతలో అరవింద్ కూడా అక్కడికి వొస్తాడు మరోవైపు వసుంధర తన ఇంట్లో శరత్ ని తాను మీరా గురించి తెసులుకున్న రహస్యం గురించి నిలదీస్తుంది. ఆ తరువాత ఎమ్ జరుగుతుందో తెలుసుకోవాలంటే మల్లి నిండు జాబిలి ఏప్రిల్ 26 E344 పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.