NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru March 21 2024 Episode 166: దేవమ్మకి అన్నం తిన పెడుతున్న చంగయ్య,ఆడవేషం వేసుకొని సంతోష పెడుతున్న పాండురంగ..

Mamagaru Today Episode March 21 2024 Episode 166 highlights

Mamagaru March 21 2024 Episode 166: గంగ వాళ్ళు ఇల్లంతా శుభ్రం చేసుకుంటారు. ఇంతలో మహేష్ అక్కడికి వచ్చి గంగ ఇది కొత్త ఇల్లులా ఉంది మీరే తయారు చేశారా అని మహేష్ అంటాడు. గంగ మీకోసం మా ఇంటి నుంచి పాలు కొన్ని కూరగాయలు తెచ్చాను ఈ పూటకి సర్దుకోండి అని మహేష్ వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతాడు. గంగ గంగాధర్ వంట చేస్తూ ఉంటారు. గంగ కూరగాయలు కట్ చేస్తూ వేలు తెగినట్టు నటిస్తుంది. అది చూసిన గంగాధర్ టెన్షన్ పడతాడు. ఊరికే జోక్ చేశానండి అని గంగ నవ్వుతుంది. వాళ్ళిద్దరూ అలా నవ్వుకుంటూ వంట చేసుకుంటూ ఉంటారు. కట్ చేస్తే,

Mamagaru Today Episode March 21 2024 Episode 166 highlights
Mamagaru Today Episode March 21 2024 Episode 166 highlights

అత్తయ్య మీరు అన్నం తినకుండా ఉంటే గంగాధర్ వెళ్లిన వాడు ఇంటికి తిరిగి వస్తాడా చెప్పండి అని వసంత అంటుంది.అమ్మ ఒక్కముద్ద అన్నం తిన్నావా నిన్ననే నీరసంగా ఉండి కళ్ళు తిరిగి పడిపోయావు అని సిరి అంటుంది. వాళ్ళు ఎంత బ్రతిమిలాడినా దేవమ్మ అన్నం తినదు. ఇంతలో చ0గయ్య అక్కడికి వచ్చి అన్నం తిను దేవమ్మ అని ముద్ద పెట్టబోతాడు. కొడుకు అక్కడ బాధలో ఉంటే నేను కడుపునిండా అన్నం తిని హాయిగా ఉండనా అని దేవమ్మ అంటుంది. నువ్వు అన్నం తినకపోతే వెళ్లిన వాడు తిరిగి వస్తాడా అని చెంగయ్య అంటాడు. మీరు వాడు వెళ్లలేదు మీరే వెళ్లగొట్టారు అని దేవమ్మ అంటుంది. అవును దేవామా నేనే వెళ్ళగొట్టాను దేవమ్మ నువ్వు ఇప్పుడు అన్నం తినకపోతే ఎవరితోటైనా గంగాధర్ కి ఫోన్ చేసి నువ్వు ఇక్కడ అన్నం తినట్లేదని చెప్పేస్తాను అప్పుడు అక్కడ వాడు కూడా అన్నం తినకుండా మానేస్తాడు తండ్రిది కొడుకు మీద సామాజికంగా ఎదుగుదల ఉండాలని కోరుకుంటాడు కానీ తల్లి కొడుకు సంతోషంగా ఉన్నాడా కడుపునిండా తిన్నాడా లేదా అని మాత్రమే చూస్తుంది అందుకని తల్లిది మాత్రమే తండ్రిది ప్రేమ వాళ్ళిద్దరిది ఒకటే రకం ప్రేమ కానీ లోకం తల్లిదే గొప్ప ప్రేమ అంటుంది తండ్రి మాత్రం ప్రేమ కాదా ఇప్పుడు నువ్వు అన్నం తినకపోతే నిజంగానే గంగాధర్ కి ఎవరి చేతనైనా ఫోన్ చేస్తాను తిను అని చంగయ్య దేవమ్మకి అన్నం పెడతాడు. దేవమ్మ బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ అన్నాన్ని చంగయ్య తినేస్తాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode March 21 2024 Episode 166 highlights
Mamagaru Today Episode March 21 2024 Episode 166 highlights

అంజమ్మ గంగ కి ఫోన్ చేసి ఎక్కడున్నారమ్మ అని అడుగుతుంది. ఇంకెక్కడ ఉంటాం అమ్మ మహేష్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము వాళ్ళు ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో తెలుసా మా కోసం చాలా వంటలు చేశారు అని గంగ చెబుతుంది. గంగ మీరు అక్కడ తిన్నారా లేదా అని నాకు చాలా బెంగగా ఉంది అమ్మ చాలా సంతోషం అని అంజమ్మ అంటుంది. అమ్మ నువ్వేం బెంగ పెట్టుకోకు నేను రేపు వేరే ఇల్లు చూసుకుంటున్నాం తర్వాత అక్కడికి వస్తాం అని గంగ ఫోన్ కట్ చేస్తుంది. మా అమ్మకి అబద్ధం చెప్పానని ఆలోచిస్తున్నారా అని గంగ అంటుంది.నీకు అబద్ధం చెప్పే అవకాశం అయినా ఉంది కానీ ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు అమ్మ కలలోకి చూడలేకపోయాను గంగ అమ్మ నన్ను వదిలిపెట్టి ఉండలేదు నేను కూడా అమ్మను వదిలిపెట్టి ఉండలేను గంగ అని గంగాధర్ బాధపడతాడు. అత్తయ్య గారు బాధపడరు అనే నేను అనను కానీ అత్తయ్య గారు ఇలాంటి కష్టాలు ఎన్నో చూసుంటారు  కష్టాలు తట్టుకునే సామర్థ్యం అత్తయ్య గారికి ఉంది మీరు బాధపడకండి అని గంగ గంగాధర్ ని ఓదారుస్తుంది. కట్ చేస్తే.

Mamagaru Today Episode March 21 2024 Episode 166 highlights
Mamagaru Today Episode March 21 2024 Episode 166 highlights

నాన్న మాకు బోర్ కొడుతుంది అత్త మాములని పట్టించుకోవట్లేదు నాయనమ్మ బాధపడుతుంది మాతో ఎవరు ఆడుకోవట్లేదు అని పిల్లలు అంటారు. బాబాయ్ మనతో ఏం మాట్లాడుతారా అని వసంత పిల్లలు అంటారు. రేయ్ పిల్లలు ఈ పాండురంగ ఆటలో కింగ్ రా నేను ముగ్గురి యాక్టింగ్ చేస్తే మీకేమైనా ప్రాబ్లమా అని పాండురంగ ఆడవేషం వేసుకొని వచ్చి ఏవండీ భోజనం వడ్డించమంటారా అని అంటాడు. ఇప్పుడు వసంత క్యారెక్టర్ లోకి వెళ్లి రేయ్ పిల్లలు మీ నాన్న ను తీసుకురండి నాకు కోర్టుకు టైం అవుతుంది వంట చేయాలి అని అంటాడు. నాన్న బాగా వంట చేయడమా అని పిల్లలు అంటారు. పిల్లలు చబరపడుతూ చప్పట్లు కొట్టి నాన్న అమలా చేయరా అని అంటారు.

Mamagaru Today Episode March 21 2024 Episode 166 highlights
Mamagaru Today Episode March 21 2024 Episode 166 highlights

అబ్బ మీ అమ్మ లాగా నేను చేయలేను రా అని పాండురంగ అంటాడు. ప్లీజ్ నాన్న చెయ్యి అని పిల్లలు బ్రతిమిలాడుతారు.పాండురంగ శ్రీ లక్ష్మీ లాగా డైలాగులు మాట్లాడుతాడు. తను డాన్స్ ఎలా వేస్తుందో అలా వేస్తాడు. అది చూసి పిల్లలందరూ చప్పట్లు కొడుతూ నవ్వుతూ ఉంటారు. ఇంతలో చ0గయ్య అక్కడికి వస్తాడు. చంగయ్యను చూసి అందరూ వెళ్ళిపోతారు. పాండురంగ డాన్స్ వేస్తూ చ0గయని చూసి షాక్ అయిపోతాడు. నువ్వేంటి రా ఇలా చీరలో అని చ0గయ్య అంటాడు. నాన్న ఒక సెల్ఫీ ఇవ్వరా అని పాండురంగ దగ్గరికి వెళ్తాడు. నోరు మూసుకొని వెళ్ళరా అని చ0గయ్య చిరాకు పడతాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode March 21 2024 Episode 166 highlights
Mamagaru Today Episode March 21 2024 Episode 166 highlights

గంగ గంగాధర్ కింద పడుకుంటారు. గంగ బెడ్ షీట్ కప్పుకుంటూ ఉండగా ఒక బుద్ధి0కా  కనపడుతుంది. దాన్ని చూసిన గంగ భయపడిపోయి గంగాధర్ ని గట్టిగా పట్టుకుంటుంది. ఏమైంది గంగ అని గంగాధర్ అంటాడు. బొద్దింకటే నాకు చాలా భయం అండి దాన్ని వెళ్ళగొట్టండి అని గంగ అంటుంది. గంగ నువ్వు భయపడి నన్ను భయపెట్టకు అని గంగాధర్ బొద్దింకను వెళ్లగొట్టడానికి ప్రయత్నిస్తాడు..

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N