NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru November 23: కష్టం వస్తే ఆదుకునే అన్న తమ్ముళ్ళని వదిలిపెట్టి నేను వేరే కాపురానికి రాలేను అంటున్న పాండురంగడు, శ్రీలక్ష్మి ఒప్పుకుంటుందా లేదా..

Mamagaru Today Episode November 23 2023 Episode 63 Highlights

Mamagaru November 23: ఇన్నాళ్ళకి నిజం తెలుసుకున్నారు రా ఎప్పటికీ మీరు ఇలాగే కలిసి ఉండాలి మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉందిరా పుత్రులారా, కొడుకు సంతోషం చూస్తే తండ్రికి ఆనందం వేస్తుంది కానీ పైకి చెప్పడు ఇంకా ఇంకా కొడుకు పైకి రావాలనే చూస్తాడు,నేను పెట్టే ఆంక్షలు కట్టుబాట్లు కూడా మిమ్మల్ని బలంగా ఉంచడానికి అని చoగయ్య అంటాడు. సారీ రా తమ్ముడు అని సుధాకర్ అంటాడు. తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడివి నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి అన్నయ్య అని పాండురంగడు అంటాడు. గంగ పొదుపు సంఘాల డబ్బు గురించి నీ మీద కోపం వచ్చింది కానీ నాకు ప్రత్యేకంగా ఏమీ ఎలాంటి కోపం లేదు గంగ సారి అని వసంత అంటుంది. అయ్యో నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి అక్క నాకు ఒక అక్కు ఉంటే కోప్పడదా నేను పడనా అని గంగ అంటుంది.

Mamagaru Today Episode November 23 2023 Episode 63 Highlights
Mamagaru Today Episode November 23 2023 Episode 63 Highlights

ఈ అందమైన మూమెంట్ ని ఒక సెల్ఫీలో బంధిద్దాం అని అందరూ ఫోటో దిగుతారు. కట్ చేస్తే, ఇల్లంతా ప్రశాంతంగా ఉంది చూశారా ఒక చిన్న కారణం వల్ల మొహమాటాలు పెంచుకున్నాము కానీ ఒక చిన్న కష్టం వస్తే అందరిని ఒకటి చేసింది అని గంగ అంటుంది. అవును గంగ పాండు అన్నయ్యకి చిన్న కష్టం వచ్చేసరికి మా అందరికీ కోపం వచ్చింది బంధాల్లో ఉన్న ప్రేమే అది అని గంగాధర్ అంటాడు. ఎన్ని కష్టాలు వచ్చినా ఈ కుటుంబం ఇలాగే కొనసాగాలండి మామగారు ఎన్ని షరతులు పెట్టినా అన్ని తట్టుకొని ఒకటిగా ఉండడం ఎంత గొప్ప విషయం కదా అండి అని గంగ అంటుంది. నాన్న పెట్టే ఆంక్షలు అందరినీ ఇబ్బంది పెడుతున్నాయి గంగ అని గంగాధర్ అంటాడు. మామయ్యను మార్చుకోవడానికి ప్రయత్నించాలి అని గంగ  అంటుంది. అది సాధ్యమంటావా గంగ అని గంగాధర్ అంటాడు. మీరు మాకు తోడుగా ఉంటే ఇల్లును స్వర్గాల మార్చుకుంటాం మీరు మాకు అండగా ఉంటానని మాట ఇవ్వండి అని గంగ అంటుంది. అలాగే గంగ అని గంగాధర్ మాట ఇస్తాడు. కట్ చేస్తే శ్రీలక్ష్మి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది.

Mamagaru Today Episode November 23 2023 Episode 63 Highlights
Mamagaru Today Episode November 23 2023 Episode 63 Highlights

శ్రీలక్ష్మి నువ్వు బాగా చదువుకున్న దానివి నీకు చెప్పే అంత తెలివి నాకు లేకపోవచ్చు, కానీ నాకు కష్టం వస్తే మా వాళ్లు అండగా నిలబడ్డారు నీ మాట విని నేను ఇంట్లో నుంచి రాలేను శ్రీలక్ష్మి అని పాండురంగడు అంటాడు. శ్రీలక్ష్మి తన చేయి తీసుకుని కోపంగా చూస్తుంది.నీకు కోపం వస్తుందని నాకు తెలుసు శ్రీలక్ష్మి  ఇంట్లో ఉన్న మనుషుల్ని వదిలిపెట్టి నేను రాలేను భర్తగా నా అధికారాన్ని ఏదో ఇక్కడ  ప్రదర్శించడం లేదు ఒక కొడుకుగా ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఇక్కడ బందీనైపోయాను శ్రీలక్ష్మి ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోదాము అంటే నీ వెనకాల వచ్చేస్తాను కానీ రేపు పొద్దుటికల్లా ఆలోచించు అంతిమ నిర్ణయం నీదే శ్రీలక్ష్మి అని పాండురంగడు అంటాడు. శ్రీలక్ష్మి ఏమి మాట్లాడకుండా కోపంగా లేచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, గంగ కాఫీ చాలా బాగుందమ్మా అని సుధాకర్ అంటాడు. థాంక్స్ బావగారు అని గంగ అంటుంది. ఏంట్రా నీ జాబ్ టెన్షన్ పోయింది గా ఇంకేం ఆలోచిస్తున్నావు అని సుధాకర్ అంటాడు.

Mamagaru Today Episode November 23 2023 Episode 63 Highlights
Mamagaru Today Episode November 23 2023 Episode 63 Highlights

ఇంతలో శ్రీలక్ష్మి వాళ్ళ నాన్న వచ్చి ఏంటి అల్లుడుగారు సైలెంట్ గా కూర్చున్నారు సామానంత సర్దరా అని అంటాడు. పాండు ఏంట్రా ఇదంతా అని సుధాకర్ అంటాడు. శ్రీలక్ష్మి మీ సామాన్లు బట్టలు అన్ని సద్దామా ఏంటమ్మా నువ్వు అలా చూస్తున్నావ్ వేరు కాపురం కోసం ఇల్లు చూశాను అని వాళ్ళ నాన్న అంటాడు. బావగారు సర్దడం ఏంటి ఖాళీ చేయడమేంటి ఏం మాట్లాడుతున్నారు అని చoగయ్య అంటాడు. ఏమీ లేదు బావగారు నిన్ను ఇoటి ని వదిలేసి వేరే కాపురం ఉంటానన్నారు వాళ్ళకి ఇల్లు కూడా చూశాను సామాను తీసుకొని వెళ్లడానికి వచ్చాను అని శ్రీలక్ష్మి వాళ్ళ నాన్న అంటాడు. ఏంటి అన్నయ్య మీరు మాట్లాడుతున్నది అని దేవమ్మ అంటుంది. చెల్లెమ్మ ఇక్కడ ఉండి వీళ్ళు ఏం బాగుపడతారు ఇక్కడ జరుగుతున్నావని నా కూతురు నాకు ఫోన్ చేసి చెప్పింది లెండి ఇంట్లో వాళ్ళందరూ ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటే ఇక్కడ వాళ్ళు ఉండి ఏం ఉపయోగం చెప్పండి అని వాళ్ళ నాన్న అంటాడు.

Mamagaru Today Episode November 23 2023 Episode 63 Highlights
Mamagaru Today Episode November 23 2023 Episode 63 Highlights

నాన్న మేము ఎక్కడికి రాము అని శ్రీలక్ష్మి అంటుంది. అదేంటమ్మా నువ్వు చెప్పావని ఇల్లు కిరాయికి తీసుకున్నాను కదా అని వాళ్ళ అన్న అంటాడు. జాబ్లో సస్పెండ్ అయ్యి మీ అల్లుడుగారు ఏడుస్తుoటే ముగ్గురు అన్నదమ్ములు తోడై నిలిచారు తను ధైర్యం కోల్పోతే మేము నీకు ఉన్నాము రా నీ ధైర్యం చెప్పారు ఇప్పటివరకు ఎన్నడు మా వారి కళ్ళలో కన్నీళ్లు చూడలేదు అలాంటిది మా వారు కన్నీళ్లు పెట్టుకుంటుంటే అన్నదమ్ములు అందరు కలిసి వెళ్లి ఆ సమస్యను ఎదుర్కొని వచ్చారు ఈ బంధాలను విడిచి ఎక్కడికి వెళ్ళమంటావు నాన్న అని శ్రీలక్ష్మి అంటుంది. శ్రీలక్ష్మి మాటలు విన్న చoగయ్య గర్వంతో నిలబడి చేతులు కట్టుకుంటాడు.ఇంతమంది ప్రేమను వదిలి నేను ఎక్కడికి రాను నాన్న అని శ్రీలక్ష్మి అంటుంది. అది కాదమ్మా మీరు గొడవలు పడుతున్నారని వాళ్ళ నాన్న అంటాడు.

Mamagaru Today Episode November 23 2023 Episode 63 Highlights
Mamagaru Today Episode November 23 2023 Episode 63 Highlights

వేరు కాపురం పెట్టుకొని మహా అయితే నేను డబ్బు సంపాదిస్తానేమో డబ్బుతో కొని లేని ఇంతమంది ప్రేమలని ఎలా సంపాదించుకోగలను బంగారు పల్లని విసిరి వేసుకుని బజార్ లో ఉన్న ఇస్తరాకులు తెచ్చుకున్నట్టు ఉంటుంది నాన్న నా పరిస్థితి అని శ్రీలక్ష్మి అంటుంది. అది కాదు శ్రీలక్ష్మి నువ్వు ఉద్యోగం చేయలేక పోతావు కదా అని వాళ్ళ నాన్న అంటాడు. కావాలంటే నువ్వు జాబ్ కోసం ఖర్చుపెట్టిన డబ్బు తిరిగి ఇస్తాను నీకు ఓపిక ఉంటే కాసేపు కూర్చో కాఫీ తెచ్చి ఇస్తాను తాగేసి వెళ్ళండి అని శ్రీలక్ష్మి అంటుంది. శ్రీలక్ష్మి మాటలు విని అందరూ సంతోష పడిపోయి చప్పట్లు కొట్టి మెచ్చుకుంటారు.మై డియర్ శ్రీ లక్ష్మి థాంక్స్ అని పాండురంగడు శ్రీ లక్ష్మీ ఎత్తుకొని గిరగిరా తిప్పుతాడు..

Related posts

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N