RRR: టాలీవుడ్ లో ఒక్క ఫ్లాప్ కూడా లేని డైరెక్టర్ గా పేరుగాంచిన రాజమౌళి మనందరికీ సుపరిచితమే. రాజమౌళి డైరెక్షన్లో సినిమా అంటే అది పక్కా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఆరెంజ్ స్క్రిప్ట్ తో వస్తాడు మరి జక్కన్న . బాహుబలి మరియు ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో సూపర్ హిట్ విజయాలని అందుకున్న రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమాపై మహేష్ మరియు రాజమౌళి అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక ఇదంతా పక్కన పెడితే గతంలో త్రిబుల్ ఆర్ మూవీలో చరణ్.. రాజమౌళి సాధ్యం కాదు అన్న సీన్ ని కూడా చేసి చూపించాడట. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ హీరోలుగా నటించిన త్రిబుల్ ఆర్ మూవీ ఎంతటి విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ద్వారా చరణ్ మరియు తారక్‌కి మంచి పాపులారిటీ దక్కింది.
ఇక ఈ మూవీలో చరణ్ ని ఒక పాము కాటేసే సీన్ ఒకటి ఉంది. ఆ సీన్ లో తన కాళ్లు మరియు చేతులు తో సంబంధం ఉండదు. ఒక్క ఐస్ తో మాత్రమే అట్రాక్షన్ ఉంటుంది. అన్ని ఎక్స్ప్రెషన్స్ ని కలిపి తన ఐస్ లో చూపించాలి. ఇక ఆ సమయంలో రాజమౌళి..” చరణ్ ఇది చాలా ఇంపార్టెంట్ సీన్. మూవీ మొత్తంలో. బాడీ మొత్తం పారలైజ్డ్ అవుతుంది. జస్ట్ ఐస్ తో ఆక్ట్ చేయాలి.
నువ్వు ఏం చేస్తావో తెలియదు సీన్ మాత్రం ఇంపాక్ట్ ఫుల్ గా ఉండాలి ” అని చాలా డౌట్ గా చెప్పాడట రాజమౌళి. ఇక దీనికి చరణ్..” నాకు జస్ట్ ఐస్ ఒక్కటే చాలు జక్కన్న ” అంటూ సమాధానమిచ్చాడట. ఇక అనంతరం ఆ సీన్ ని ఐస్ లో కొట్టొచ్చినట్లు చూపించాడు చరణ్. ఇలా రాజమౌళి సాధ్యం అవ్వదు అనుకున్న సీన్ ని కూడా చేసి తన సత్తా నిరూపించుకున్నాడు చెర్రీ. నిజంగా యాక్షన్ సీన్స్ మొత్తం తన ఐస్ లో చూపించడం అంటే మామూలు విషయం కాదు. ఇక దీనికి ప్రేక్షకులు సైతం హాట్సాఫ్ చెబుతున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!