Mahesh Babu: సాధారణంగా సినిమాలో హీరో మరియు హీరోయిన్ అలానే ఇతర సైడ్ క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉంటారు. కానీ డైరెక్టర్ మాత్రం కనిపించడు. వారికి కనిపించే అంత ఛాన్స్ కూడా ఉండదు. ఏదో లక్ బాగుండి కనిపిస్తే తప్ప లేకపోతే కనిపించరు. ఇక ఈ తరుణంలోనే కొందరు డైరెక్టర్స్ తమ హీరోల వెనక ఉంటూ కనిపిస్తూ ఉంటారు.
ఇక మహేష్ బాబు సినిమాలో కూడా ఓ డైరెక్టర్ కనిపించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన సంగతి తెలిసిందే. ఇక మహేష్ కెరీర్ లో చెరగని ముద్ర వేసుకున్న సినిమా మాత్రం ” సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు “. వెంకటేష్ మరియు మహేష్ హీరోలుగా నటించిన ఈ మూవీలో అంజలి మరియు సమంతా హీరోయిన్స్ గా నటించారు.
ఇక ఈ మూవీ ఆతరం ప్రేక్షకులనే కాదు ఈ తరం ప్రేక్షకులని కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో చిన్నోడుగా నటించిన మహేష్ ఒక రైల్వేస్టేషన్లో బెంచ్ పై కూర్చుంటాడు. ఇక అతని వెనకే డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల మరియు తన బ్రదర్ నుంచుని ఉంటారు. వారికి సినిమా మొత్తంలో ఎక్కడ కనిపించడానికి అవకాశం రాక చివరికి ఆ ప్లేస్ ని ఉపయోగించుకున్నారు.
కానీ దీనిని చాలామంది కనిపెట్టలేకపోయారు. కొందరు మాత్రమే వారిని కనిపెట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోని చూసిన ప్రేక్షకులు.. ఆఖరికి ఆ ప్లేస్ ని కూడా వదల్లేదు ఏంట్రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!