Mega156: మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది రెండు సినిమాలు విడుదల చేయడం జరిగింది. గత ఏడాది సంక్రాంతి పండుగకు “వాల్తేరు వీరయ్య” దసరా పండుగకు “భోళా శంకర్” విడుదల చేశారు. ఈ రెండిటిలో “వాల్తేరు వీరయ్య” సూపర్ డూపర్ హిట్ అయింది. “భోళా శంకర్” బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో తన కెరియర్ లో 156వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి టైటిల్ సంక్రాంతి పండుగ కానుకగా ఈరోజు సాయంత్రం ప్రకటించారు. “విశ్వంభర” అనే టైటిల్ ఖరారు చేసినట్లు సినిమా యూనిట్ తెలియజేస్తూ కాన్సెప్ట్ వీడియో కూడా విడుదల చేయడం జరిగింది. టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ పెద్ద బ్యానర్ యువి క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తూ ఉంది.
ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. డైరెక్టర్ వశిష్ట.. తన మొదటి సినిమా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తో “బింబిసారా” చేసి మంచి హిట్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. దీంతో చిరంజీవితో చేయబోతున్న “విశ్వంభర” పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకోవడం జరిగింది. చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇటీవల నాగార్జున “నా సామిరంగ”కి…కూడా కీరవాణి సంగీతమందించారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఓ రేంజ్ లో ఇవ్వడం జరిగింది. సినిమాకి బాగా ప్లస్ అయింది. ఇక చిరంజీవి కీరవాణి కాంబినేషన్ అంటేనే టాలీవుడ్ లో ఒక ప్రత్యేకం అని చెప్పాలి. వీరిద్దరి కలయికలో అప్పట్లో ఘరానా మొగుడు, ఆపద్బాంధవుడు, ఎస్పీ పరశురామ్ వంటి సినిమాలు హిట్ ఆల్బమ్స్ గా నిలిచాయి.
మళ్లీ 29 సంవత్సరాల తర్వాత.. చిరంజీవి లేటెస్ట్ సినిమా “విశ్వంభర” కి కీరవాణి సంగీతం అందించడం విశేషం. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో చాలామంది హీరోయిన్స్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా టైటిల్ ప్రకటిస్తూ విడుదల చేసిన వీడియో బట్టి చూస్తే సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటుందని టాక్. చిరంజీవి కెరియర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ లలో ఒకటైన “జగదేకవీరుడు అతిలోకసుందరి” తరహాలో “విశ్వంభర” ఉండబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!