Pushpa 2: ఈ సంక్రాంతి పండుగ చాలా సందడి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విడుదలైన సినిమాలలో అన్ని అంచనాలు తలకిందులు అయ్యాయి. రికార్డుల సృష్టించేస్తది అన్ని అనుకున్న సినిమాలు.. అంతగా ప్రేక్షకాదరణ దక్కించుకోలేకపోయింది. కానీ చిన్న సినిమాగా విడుదలైన “హనుమాన్” సూపర్ డూపర్ హిట్ అయింది. పెద్ద సినిమాతో విడుదలైన గాని సంక్రాంతి బరిలో గెలిచిన పుంజుగా “హనుమాన్” నిలిచింది. ఇదిలా ఉంటే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్.. ప్రతినిధులు ఇటీవల సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది టాప్ మోస్ట్ హీరోలతో భేటీ కావడం జరిగింది.
మెగా ఫ్యామిలీ హీరోలతో పాటు నందమూరి హీరో ఎన్టీఆర్ మహేష్ బాబు ఇంకా చాలామంది స్టార్ హీరోలను కలవడం జరిగింది. కాక తాజాగా సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలకు సంబంధించి.. డిజిటల్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ సంస్థ ముందుగానే దక్కించుకుంటూ ఉంది. సంక్రాంతి పండుగ జనవరి 15 ఉదయం ఎన్టీఆర్ “దేవర” సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకున్నట్లు అధికారిక ప్రకటన చేయడం జరిగింది. అదేరోజు సాయంత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప 2” రైట్స్ కూడా నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధికారికంగా తెలియజేయడం జరిగింది.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా “పుష్ప” 2021లో విడుదలయ్యి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రతి డైలాగ్ పాటలు అన్నీ కూడా దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రేమికులను అల్లరించాయి. దీంతో ఇప్పుడు “పుష్ప 2” పార్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 15వ తారీకు “పుష్ప 2” విడుదల చేయబోతున్నట్లు ఆల్రెడీ అధికారిక ప్రకటన చేయడం జరిగింది. కానీ ఈ సినిమాలో కేశవ పాత్ర చేసిన నటుడు జగదీష్ అరెస్టుతో.. ప్రకటించిన తేదీకి పుష్ప సెకండ్ పార్ట్ రిలీజ్ సందేహం ఏర్పడింది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!