`శ్యామ్ సింగరాయ్` వంటి హిట్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని నుండి వచ్చిన చిత్రం `అంటే..సుందరానికీ`. ఈ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు యంగ్ డైరెక్టర్ వివేక్ సాగర్ దర్శకత్వం వహించారు. నజ్రియా నజీమ్ ఇందులో హీరోయిన్గా నటించగా.. వీకే నరేష్, రోహిణి, నదియా, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 10న గ్రాండ్‌గా విడుదలైంది. అయితే పాజిటివ్ టాక్ వచ్చినా.. కమర్షియల్‌గా ఈ మూవీ హిట్ అవ్వలేకపోయింది. రూ. 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. లాంగ్ రన్లో రూ. 21.35 కోట్లు షేర్‌ను మాత్రమే రాబట్టగలిగింది.
దీంతో బయ్యర్లకు దాదాపు రూ. 9 కోట్ల మేర నష్టాలను మిగిల్చిందీ చిత్రం. ఇకపోతే ఈ మూవీని ఇటీవలె ఓటీటీలోకి దింపారు. ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ జూలై 8న నుండీ ఈ మూవీ స్ట్రీమింగ్ అయింది. అయితే ఓటీటీలో ఈ సినిమాకి అద్బుతమైన రెస్పాన్స్ వస్తోంది.
నెట్‌ఫ్లిక్స్‌లో ఇటీవల స్ట్రీమింగ్ అయిన చిత్రాల్లో టాప్ 10 లిస్ట్ తీయగా.. అందులో ‘అంటే సుందరానికి’ చిత్రం నెం.1 పొజీషన్లో నిలవడం విశేషంగా మారింది. ఇదే లిస్ట్ లో ఈ సినిమా తమిళ వెర్షన్ 6వ స్థానంలో నిలిచింది. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా.. ఓటీటీలో మాత్రం `అంటే..సుందరానికీ` సూపర్ హిట్ అయింది. ఈ విషయలో నాని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!