NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nindu Noorella Saavasam December 15 2023 Episode 108: ఆ బాలిక పాస్ అయినందుకు తల్లిదండ్రుల కన్నా నువ్వే ఎక్కువ సంతోషిస్తున్నావ్  అంటున్నా గుప్తా గారు.

Nindu Noorella Saavasam Today Episode December 15 2023 Episode 108 Highlights

Nindu Noorella Saavasam December 15 2023 Episode 108: భాగమతి లోపలికి వెళ్లి  ఇదేం బొమ్మ అక్క ఇక్కడ ఎందుకు ఉంది అని పట్టుకుంటుంది. అరుంధతి సంతోష పడిపోయి గీత దాటగలనా అని చూస్తుంది. అయ్యో నేను గీత దాటేశాను అని సంబరపడిపోతుంది అరుంధతి. అక్క నువ్వు ఇక్కడేం చేస్తున్నావ్ నీ పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదువుతున్నారని అర్థం అయిపోయిందిలే నీ పిల్లల కోసం వచ్చావా అని భాగమతి అంటుంది. ఓ నీకు అలా అర్థమైందా ఆ అవును అందుకే వచ్చాను అని అరుంధతి అంటుంది. అలా అర్థం అవడం ఏంటక్కా నువ్వు అందుకు కదా వచ్చింది అని భాగమతి అంటుంది. అందుకే వచ్చాను మిస్సమ్మ నాకు పని ఉంది నేను తర్వాత కలుస్తాను అంటూ అరుంధతి పారిపోతుంది. ఈ అమ్మాయి వాళ్ళ ఆత్మ మిస్ అయిపోయిందే అని కోపంతో రగిలిపోతాడు ఘోర. ఏంటో ఈ అక్క ఏది సరిగ్గా వినదు వినిపించుకోదు అని భాగమతి వెళ్లిపోతుంది. కట్ చేస్తే, గుప్తా గారు నీళ్లు కొడుతూ నీలా మీద నీళ్లు చల్లుతాడు.

Nindu Noorella Saavasam Today Episode December 15 2023 Episode 108 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 15 2023 Episode 108 Highlights

 

ఏంటండీ నా మీద నీళ్లు వర్షం కురిపిస్తున్నారు అని నీలా అంటుంది. నా  నా ప్రేమ నీమీద అలా వర్షంల  చూపిస్తున్నాను  అని గుప్త అంటాడు. కానీ నువ్వు ఎందులకు చింతించుచుంటివి అని గుప్తా అడుగుతాడు. నాకు తెలిసిన విషయం పదిమందికి చెప్పకపోతే నాకు ఏదోలా ఉంటుందండి మనోహరి అమ్మగారికి ఒక బిడ్డ కూడా ఉందంట అని చెప్తుంది నీలా. నీకెలా తెలుసు అని గుప్తా అంటాడు. మొన్న అంజలికి జ్వరం వచ్చినప్పుడు నేను ఒక మాట అంటే నా పీక పిసికి  నాకు బిడ్డ ఉంటే నీకెందుకే అని నన్ను తిట్టిందండి అని నీలా చెప్తుంది. ఒక బిడ్డ ఉన్నాక కూడా ఈ ఇంట్లో ఎందుకు ఉంటుందో అర్థం కావట్లేదు ఆ విషయం తెలుసుకోవాలి అని నీలా అంటుంది. ఏ సమయమునకు ఏ విషయమైనా బయటపడలో అప్పుడే బయట పడుతుంది నువ్వేమీ చింతించకు అని గుప్తా అంటాడు. ఇంతలో అరుంధతి గుప్తా గారు అంటూ కంగారు పడుకుంటూ పరిగెత్తుకొస్తుంది. ఏమైనాది బాలిక అలా కంగారుపడుతుంటివి అని గుప్తా అంటాడు. ఘోర నన్ను స్కూల్లో బంధించాలని చూశాడు నేను తప్పించుకొని పారిపోయి వచ్చాను అని అరుంధతి చెప్తుంది.

Nindu Noorella Saavasam Today Episode December 15 2023 Episode 108 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 15 2023 Episode 108 Highlights

నీకు ఏమీయును కాలేదు కదా జగన్నాధ అసలు ఏమి జరిగిందో వివరముగా చెప్పుము బాలిక అని గుప్తా అంటాడు. నిన్న నేను హాస్పిటల్ కి వెళ్ళేటప్పుడు ఘోర నా వెంట పడ్డాడు హాస్పిటల్ దగ్గరికి కూడా వచ్చాడు అక్కడ మా ఆయన వాడిని పట్టుకుందామనుకునేసరికి పారిపోయాడు ఇప్పుడు స్కూల్ దగ్గరికి కూడా వచ్చి నన్ను బంధించాలి అనుకున్నాడు మిస్సమ్మ పుణ్యమా అని నేను బయటపడ్డాను నాకు చాలా భయంగా ఉంది గుప్తా గారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని కంగారు పడిపోతూ అంటుంది అరుంధతి. అందుకే నిన్ను బయటికి వెళ్లొద్దు వెళ్లొద్దు అంటే పరిగెత్తుకు వెళ్లావు ఇప్పుడు బాగా అయిందా అతగాడు నిన్ను వెంబడించి నిన్ను పట్టుకోవాలని చూస్తున్నాడు ఇంకెప్పుడు ఇలా బయటికి ఒంటరిగా వెళ్ళకు అతని చేతికి నువ్వు చిక్కావే అనుకో ఇక నిన్ను ఎవరూ రక్షించలేరు అని గుప్తా అంటాడు. అది కాదు గుప్తా గారు అని అటు చూసేసరికి నీలా కనిపిస్తుంది గుప్తా గారు నీలా చూస్తుంది చూడండి అని అంటుంది అరుంధతి. ఇలా పక్కకి మొహం తిప్పి చూసేసరికి నీలా వంగబడి ఏం మాట్లాడుతున్నాడు ఇతను అని చూస్తుంది.

Nindu Noorella Saavasam Today Episode December 15 2023 Episode 108 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 15 2023 Episode 108 Highlights

అసలేం చేస్తున్నారండి మీరు ఎవరితో మాట్లాడుతున్నారు నాకేమీ అర్థం కావట్లేదు అప్పుడప్పుడు మీలో ఇలా ఎందుకు మాట్లాడుకుంటారు నేను ఇక్కడ ఉంటే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావ్ అని నీలా అంటుంది. చెప్పండి మనిద్దరం తప్ప ఇంకడ ఎవరు లేరు కదా అని నీలా అటు ఇటు అంత చూస్తుంది. గుప్తా గారు ఏం చెప్పాలో అర్థం కాక మాట తడబడతాడు. ఇంతలో అమరేంద్ర వాళ్ళు స్కూల్ నుంచి ఇంటికి వస్తారు. అమ్మో సార్ వస్తున్నాడు అని పరిగెత్తుకెళ్తుంది నీలా. కట్ చేస్తే, అరుంధతి చెట్టు చాటుకు దాక్కుంటుంది. అమరేంద్ర అంజలి తీసుకొని వెళుతూ ఉండగా ఒక నిమిషం అక్కడే ఉండరా అమర్ అని వాళ్ళ అమ్మ దిష్టి తీసి లోపలికి రమ్మంటుంది. ఆఖరికి అరుంధతిని కనిపెట్టి పిలుస్తుంది భాగమతి. అయ్యో మిస్సమ్మ నన్ను చూడొద్దు చూడొద్దు అనుకుంటూ ఉన్నా సరే భాగమతి అరుంధతి దగ్గరికి వస్తుంది.

Nindu Noorella Saavasam Today Episode December 15 2023 Episode 108 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 15 2023 Episode 108 Highlights

అక్క నువ్వు ఎప్పుడు వచ్చావు అని అడుగుతుంది భాగమతి. అది సరే అంజలి పాస్ అయిందా అని అరుంధతి అడుగుతుంది. పాస్ అయింది అక్క కానీ ప్రిన్సిపాల్ మేడం వందకు వంద మార్కులు వచ్చాయని చెప్పి మొహం తలగిలేసింది అని భాగమతి సంతోషంతో అంటుంది. ఆ బాలికా పాస్ అయినందుకు మాకు స్వీట్లు తీసుకురావా అని గుప్తా అంటాడు. తెస్తాను ఉండండి అని భాగమతి అంటుంది. గుప్తా గారు ఇప్పుడు మిస్సమ్మని స్వీట్లు తెమ్మని ఎందుకు అన్నారు నేను ఎలా తింటాను అని అరుంధతి అంటుంది. నీవు ఎలా తినదవో అది నీ సమస్య నాది కాదు నాకు మాత్రం స్వీట్లు భుజించవలెనని బహు ముచ్చటగానున్నది ఆ పిల్ల పిచ్చుక పాస్ అయినందుకు నీకు సంతోషంగా లేదా అని గుప్తా అంటాడు కట్ చేస్తే, అంజలి నువ్వు పాస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది మీ అమ్మకు దండం పెట్టుకో అమ్మ అని నిర్మల అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode December 15 2023 Episode 108 Highlights
Nindu Noorella Saavasam Today Episode December 15 2023 Episode 108 Highlights

అంజలి వాళ్ళ అమ్మ ఫోటో దగ్గరికి వెళ్లి అమ్మ నువ్వు ఉన్నప్పుడు ఎంత అల్లరి చేసినా సరే ఏమీ అనే దానివి కాదు కేవలం నీ కోసమే ఇప్పుడు ఎగ్జామ్ రాసి పాస్ అయ్యానమ్మా ఐ లవ్ యు అమ్మ ఐ మిస్ యు అమ్మ అని అంజలి వాళ్ళ అమ్మ ఫోటో తీసుకొని ఏడుస్తుంది.  అంజలి డాక్టర్ గారు నిన్ను రెస్ట్ తీసుకోమన్నారు రా అని అమరేంద్ర అంజలిని తీసుకొని పైకి వెళ్ళిపోతాడు. ఇంతలో భాగమతి స్వీట్లు కోసం అని లోపలికి వస్తుంది. మళ్లీ వెనక్కు తిరిగి వెళ్ళిపోయి స్వీట్లు లేవు అందరి కోసం ఇప్పుడు స్వీట్లు తయారు చేస్తున్నాను మీకు కూడా తెస్తాను అని అరుంధతి ఉత్సాహంతో అంటుంది. ఆ బాలిక పాసైనందుకు కన్న తల్లిదండ్రుల కంటే నువ్వే ఎక్కువ సంతోషం పడిపోతున్నావేంటి అని గుప్తా అంటాడు. అవును కదా రక్తసంబంధం ఉన్న వాళ్ళు సంతోషిస్తున్నారంటే అర్థం ఉంది కానీ నేనెందుకు ఇంత సంతోషపడుతున్నాను నాకే అర్థం కావట్లేదు అని భాగమతి అంటుంది. నాకు కూతురు ఉంటే కూడా నేను ఇంత సంతోషిస్తానో లేదో అని భాగమతి అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 

Related posts

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

bharani jella

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N