NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: బాబుకు వయసు పైబడి మతిమరుపు వచ్చిందా..?  విమర్శలకు అర్ధం ఉండాలిగా..!

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి ఆ ముసలాయన అని సీఎం జగన్మోహనరెడ్డి ఇటీవల కాలంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తప్పులేదని పిస్తొంది. ఎందుకంటే .. చంద్రబాబు ప్రస్తుతం చేస్తున్న విమర్శలు చూస్తుంటే ఆయనకు వయసు పైబడి మతిమరుపు వచ్చిందా అన్న కామెంట్స్ వినబడుతున్నాయి. అధికార పార్టీ ఏది చేసినా విమర్శించాలన్న తలంపే తప్ప అది సద్విమర్శా కాదా అని ఆలోచించడం లేదు. ప్రత్యర్ధి పార్టీలోని అంతర్గత విషయాలపై మాట్లాడాల్సిన అవసరం టీడీపీ అధినేతకు ఎందుకో అర్ధం కావడం లేదని అంటున్నారు.

రీసెంట్ గా వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ పలు నియోజకవర్గాలకు నూతన ఇన్ చార్జిలను నియమించారు. ఈ క్రమంలో ఒక నియోజకవర్గం నుండి మరో నియోజకవర్గాలకు పంపారు. వారిలో ప్రస్తుత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజని కూడా ఉన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జిగా నియమించారు. చిలకూరిపేటకు పార్టీ ఇన్ చార్జిగా మల్లెల రాజేష్ నాయుడును పార్టీ నియమించింది. అభ్యర్ధుల నియోజకవర్గాల మార్పు అనేది పూర్తిగా ఆ పార్టీ అధినేత ఇష్టం. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు దీనిపైనా మాట్లాడి విమర్శలు ఎదుర్కొంటున్నారు.

‘నా నలభై అయిదేళ్ల రాజకీయ జీవితంలో ఇలా మంత్రులను ట్రాన్స్ ఫర్ చేయడం చూడలేదు. మంత్రులకు కూడా ట్రాన్స్ ఫర్ లు ఉంటాయని నాకు ఇప్పుడే తెలిసింది’ అని వ్యాఖ్యానించారు చంద్రబాబు. మరి చంద్రబాబు గతంలో చేసిన పని ఆయనకు గుర్తు లేదా అన్న కామెంట్స్ వినబడుతున్నాయి. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు కూడా ఇటువంటి ప్రక్రియే చేపట్టారు కదా. కొవ్వురు నుండి నాటి మంత్రి కె జవహర్ ను తప్పించి ఆయనను తిరువూరుకు పంపారు. కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలకు, జవహర్ కు మధ్య విభేదాలు తారా స్థాయికి చేరడంతో జవహర్ కు తిరువూరు టికెట్ ఇచ్చారు.

అలానే పాయకరావుపేట నియోజకవర్గంలో అసమ్మతిని ఎదుర్కొంటున్న వంగలపూడి అనితను కొవ్వూరుకు మార్చారు చంద్రబాబు. అలా చాలా నియోజకవర్గాల్లో చంద్రబాబు మార్పులు చేశారు. తను చేస్తే తప్పుకాదు.. అదే ఎదుటి వారు చేస్తే తప్పు అన్నట్లుగా మాట్లాడటం విమర్శలకు దారి తీస్తుంది. ఏ రాజకీయ పార్టీ అయినా అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా వివిధ రకాల వ్యూహాలను అమలు చేస్తుంటాయి. సామాజిక సమీకరణాలను చూసుకుంటే అభ్యర్ధుల మార్పులు, చేర్పులు చేస్తుంటాయి. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు .. ఏ అంశంపై విమర్శలు చేయాలి, మాట్లాడాలి అనేది మరచి ప్రత్యర్ధి పార్టీ అంతర్గత వ్యవహారాలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని అంటున్నారు.

Janasena – TDP: త్యాగరాజులు అవుతారా..? తిరగబడతారా..? టీడీపీలో అంతర్మధనం..!

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju